లాడ్జీ ఎమ్‌పివిని ఇండియాకు తీసుకురానున్న రెనో
భారత కార్ మార్కెట్లో ఇటీవలే స్కాలా సెడాన్‌ను విడుదల చేసిన ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా, ఎమ్‌పివి సెగ్మెంట్లో కూడా ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తుంది. గ్లోబల్ మార్కెట్లలో రెనో అందిస్తునన్న లాడ్జీ ఎమ్‌పివి (Renault Lodgy)ని దేశీయ విపణిలో ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ఇప్పటికే హ్యాచ్‌బ్యాక్ (పల్స్), ప్రీమియం సెడాన్ (ఫ్లూయెన్స్), ఎంట్రీ సెవల్ సెడాన్ (స్కాలా), ప్రీమియం ఎస్‌యూవీ (కొలియోస్), కాంపాక్ట్ ఎస్‌యూవీ (డస్టర్)లను భారతీయ కొనుగోలుదారులకు ఆఫర్ చేస్కున్న రెనో ఇండియా త్వరలోనే ఓ ఎమ్‌పివి (లాడ్జీ)ని కూడా అందించనుంది.
గ్లోబల్ మార్కెట్లలో మంచి సక్సెస్ సాధించిన రెనో లాడ్జీ ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉండి మారుతి సుజుకి ఎర్టిగా, నిస్సాన్ ఇవాలియా, టొయోటా ఇన్నోవా, మహీంద్రా జైలో వంటి మోడళ్ల సరసన నిలువనుంది.

రెనో లాడ్జీ ఫ్రంట్ వ్యూ

రెనో లాడ్జీ రియర్ వ్యూ

రెనో లాడ్జీ సైడ్ వ్యూ

రెనో లాడ్జీ ఫ్యామిలీ కార్

రెనో లాడ్జీ బూట్ స్పేస్

రెనో లాడ్జీ లగేజ్ స్పేస్

రెనో లాడ్జీ - మారుతి సుజుకి ఎర్టిగా పోటీదారు

రెనో లాడ్జీ ధర రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు మధ్యలో ఉండొచ్చని అంచనా.
రెనో లాడ్జీ గురించి కొన్ని వాస్తవాలు:
రెనో లాడ్జీ ఒక 7-సీటర్ ఎమ్‌పివి.
2014 మధ్య భాగంలో దేశీయ విపణిలో విడుదల కావచ్చని అంచనా.
అంచనా ధర రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు మధ్యలో.
2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో విడుదల కావచ్చు.
ప్రస్తుతం భారత మార్కెట్లో యుటిలిటీ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, డస్టర్ ఎస్‌యూవీని ఇక్కడి మార్కెట్లో విడుదల చేసి భారీ సక్సెస్‌ను సొంతం చేసుకున్న రెనో ఇండియా ఎమ్‌పివి విభాగంలో కూడా లాడ్జీ విడుదలతో సక్సెస్‌ను సాధించాలని భావిస్తోంది. రెనో ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో డాసియా బ్రాండ్‌తో లాడ్జీ ఎమ్‌పివిని విక్రయిస్తోంది.
ఇండియన్ మార్కెట్లో విడుదల కానున్న రెనో లాడ్జీ ఎమ్‌పివిలో పాపులర్ 1.5 లీటర్ కె9కె ఇంజన్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఇది గరిష్టంగా 84 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. అలాగే, పెట్రోల్ వెర్షన్ రెనో లాడ్జీ ఎమ్‌పివిలో 1.6 లీటర్, 84 బిహెచ్‌పి ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. దీనిని బట్టి చూస్తుంటే, ఈ సెగ్మెంట్లో నేరుగా మారుతి సుజుకి ఎర్టిగాను టార్గెట్ చేస్తూ కంపెనీ ఈ కారును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








