జులై 4న మార్కెట్లోకి రానున్న రెనో డస్టర్ ఎస్‌యూవీ
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా (Renault India) నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్‌యూవీ) 'రెనో డస్టర్' రేపు (బుధవారం, జులై 4, 2012) మార్కెట్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రెనో డస్టర్ సంబంధించిన మరిన్ని సరికొత్త వివరాలు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి. రెనో డస్టర్ మూడు వేరియంట్లలో (ఒకటి పెట్రోల్, రెండు డీజిల్) విడుదల కానుంది. వాటి మైలేజ్ వివరాలు ఇలా ఉన్నాయి.
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఈ (పెట్రోల్) - 13.24 కెఎమ్‌పిఎల్
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ (85 పిఎస్ డీజిల్) - 20.46 కెఎమ్‌పిఎల్
* రెనో డస్టర్ ఆర్ఎక్స్‌జెడ్ (110 పిఎస్ డీజిల్) - 19.01 కెఎమ్‌పిఎల్
రెనో డస్టర్‌ను తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశ్యంతో పెట్రోల్ వేరియంట్‌లో కంపెనీ అనేక ఫీచర్లను తగ్గించి వేసింది. టాప్-ఎండ్ డీజిల్ వేరియంట్ (ఆర్ఎక్స్‌జెడ్) పూర్తి ఫీచర్ల లభ్యం కానుంది. కొత్త రెనో డస్టర్ 4 ఏళ్లు (2+2) లేదా 80,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది. అన్ని వేరియంట్లు కూడా టూ-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తోనే లభిస్తాయి. పెట్రోల్ వేరియంట్ రెనో డస్టర్ 102 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 1.6లీటర్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. డీజిల్ వేరియంట్ రెనో డస్టర్ 85పిఎస్, 110పిఎస్‌ల పవర్‌తో 1.5 డిసిఐ ఇంజన్‌తో లభిస్తుంది.
కొత్త రెనో డస్టర్ ఎస్‌యూవీలో లభ్యం కానున్న కొన్ని ప్రధాన ఫీచర్లు:
* ఎంపిక చేసిన వేరియంట్లలో ఏబిఎస్, ఈబిడి, బ్రేక్ అసిస్ట్
* టిల్ట్ స్టీరింగ్
* కీలెస్ ఎంట్రీ
* వెనుక వైపు సీట్లకు ఏసి వచ్చేలా ఏర్పాటు చేసిన రియర్ ఏసి వెంట్స్
* రివర్స్ పార్కింగ్ సెన్సార్స్
* యాంత్రికంగా నియంత్రించబడే సైడ్ మిర్రర్స్
* యూఎస్‌బి, బ్లూటూత్ ఆడియో సపోర్ట్‌తో కూడిన 2-డిన్ ఆడియో సిస్టమ్
* స్టీరింగ్ వీల్‌పై ఆడియో, ఫోన్ కంట్రోల్స్
* ఆప్షనల్ లెథర్ ప్యాక్
పైన తెలిపిన ఫీచర్లే కాకుండా మరిన్ని ప్రత్యేకతలతో రెనో డస్టర్ రేపు మార్కెట్లో విడుదల కానుంది. దీని ధర ఇతర వివరాలు విడుదల సమయంలో కంపెనీ వెల్లడించనుంది. రెనో డస్టర్ ఎస్‌యూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్ స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.


Click it and Unblock the Notifications









