పెట్రోల్ వేరియంట్ 'పల్స్‌'ను విడుదల చేసిన రెనో ఇండియా

ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో ఇండియా (Renault India) దేశీయ విపణిలో అందిస్తున్న చిన్న కారు "పల్స్"లో పెట్రోల్ వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. రెనో ఇండియా తొలుత పల్స్ హ్యాచ్‌బ్యాక్‌ను డీజిల్ వేరియంట్లో మాత్రమే విడుదల చేసింది. కాగా.. తాజాగా పెట్రోల్ వేరియంట్ పల్స్ హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ అత్యంత ఆఖర్షనీయమైన ధరకే మార్కెట్లోకి విడుదల చేసింది.

కేవలం రూ.4.25 లక్షల ప్రారంభ ధరకే (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) పల్స్ పెట్రోల్ వేరియంట్‌ను రెనో ఇండియా అందిస్తోంది. పెట్రోల్ వేరియంట్ పల్స్ కారు మూడు వెర్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ రెనో పల్స్‌ హ్యాచ్‌బ్యాక్‌లో 1.2 లీటర్, 3-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 79 పిఎస్‌ల శక్తిని, 104 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది ఆరు ఆకర్షనీమైన రంగుల్లో లభిస్తుంది.


టాప్-ఎండ్ వేరింయట్ పల్స్‌ (ఆర్ఎక్స్‌జెడ్)లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటో-రీట్రాకబల్ వింగ్ మిర్రర్స్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్ వంటి ఫీచర్లు లభిస్తాయి. రెనో పల్స్ పెట్రోల్ వేరియంట్లో లభించే వెర్షన్లు, వాటి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

* పల్స్ ఆర్ఎక్స్ఈ - రూ.4.25 లక్షలు
* పల్స్ ఆర్ఎక్స్ఎస్ - రూ.4.99 లక్షలు
* పల్స్ ఆర్ఎక్స్‌జెడ్ - రూ.5.55 లక్షలు

రెనో పల్స్ డీజిల్ వేరియంట్:
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న రెనో పల్స్ డీజిల్ వేరియంట్‌ను తొలిసారిగా గడచిన జనవరి నెలలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో రెనో ఇండియా విడుదల చేసింది. నిస్సాన్ మైక్రా హ్యాచ్‌బ్యాక్ డీజిల్ వేరియంట్‌లో ఉపయోగించిన 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్‌నే పల్స్ హ్యాచ్‌బ్యాక్‌ లోనూ ఉపయోగించారు. పెర్ఫామెన్స్ పరంగా ఈ రెండు వేరియంట్లు ఒకేరకమైన అనుభూతినిస్తాయి. ఈ ఇంజన్ 63 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. రీనాల్ట్ పల్స్ కేవలం బేస్ వేరియంట్ ఆర్ఎక్స్ఎల్, టాప్-ఎండ్ వేరియంట్ ఆర్ఎక్స్‌జెడ్ అనే రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, May 11, 2012, 12:32 [IST]
English summary
French carmaker Renault India has launched the petrol version of its compact car Pulse hatchback at a starting price of Rs 4.25 lakh (ex-showroom Delhi). The petrol version Pulse is available in three variants.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+