భారత్‌లో చిన్న కార్లను సవాల్ చేస్తూ రానున్న రెనో 800సీసీ కారు
గ్లోబల్ మార్కెట్ల కోసం రెనో ఇండియా బి4ఏ అనే కోడ్‌నేమ్‌తో, లీటరుకు 20 కిలోమీటర్లకు పైగా మైలేజీనిచ్చే ఓ చిన్నసైజు ఇంజన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత చిన్న కార్ సెగ్మెంట్లో చిన్న కార్ల ధరలు రూ.1.5 లక్షల నుంచి రూ.4 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. కాగా.. రెనో ఇండియా 'ఏ ఎంట్రీ' అనే కోడ్‌నేమ్‌తో అభివృద్ధి చేస్తున్న ఈ గ్లోబల్ మోడల్ చిన్న కారును అభివృద్ధి చెందుతున్న ప్రపంచ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని కంపెనీ రూపొందించనుంది.
ఇండియాలో నిస్సాన్-రోనో కంపెనీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న చెన్నై ప్లాంటులో ఈ చిన్న కారు ఉత్పత్తిని కంపెనీ చేపట్టనుంది. 2014-15 నాటికి రెనో చిన్న కారు మార్కెట్లను తాకవచ్చని తెలుస్తోంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, లీటరుకు 24-26 కి.మీ. మైలేజీని చేరుకునేలా ఈ కారును తయారు చేయాలని రెనో భావిస్తోంది. సిటీ రోడ్లపై ఇది కనీసం 20 కి.మీ. మైలేజీని ఇవ్వవచ్చని అంచనా. ప్రస్తుతం రెనో ఇండియా అందిస్తున్న చిన్న కారు రెనో పల్స్ హ్యాచ్‌బ్యాక్‌కు దిగువన కంపెనీ తమ 800సీసీ కారును ప్రవేశపెట్టనుంది.


Click it and Unblock the Notifications









