ఎక్స్‌క్లూజివ్ ఉత్పత్తులపై రెనో-నిస్సాన్ కన్ను
ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో, జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్‌లు సంయుక్తంగా చేతులు కలిపి కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ఇప్పుడు కొత్త వ్యూహాలను రచిస్తోంది. ఇండియన్ మార్కెట్లో రెనో-నిస్సాన్‌లు ఒకే ప్లాంటులో ఉత్పత్తిని నిర్వహిస్తూ ఒకరి మోడల్ ఫ్లాట్‌ఫామ్‌ను మరొకరు పంచుకుంటూ ఒకే ఉత్పత్తిని రెండు విభిన్న బ్రాండ్ పేర్లతో, ధరలోను, డిజైన్‌లోను, ఫీచర్లలోను కొంచెం అటు ఇటు వ్యత్యాసాలతో దేశీయ విపణిలో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.
ఉదాహరణకు రెనో పల్స్, రెనో స్కాలా మోడళ్లు నిస్సాన్ మైక్రా, నిస్సాన్ సన్నీ ఫ్లాట్‌ఫామ్‌లను షేర్ చేసుకోగా, ఇప్పుడు నిస్సాన్ రెనో డస్టర్ ఫ్లాట్‌ఫామ్‌ను షేర్ చేసుకుంటూ ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది. అయితే, ఇకపై భవిష్యత్తులో ఇలా ఒకరి మోడళ్ల ఫ్లాట్‌ఫామ్‌ను మరొకరు షేర్ చేసుకునేలా కాకుండా, ఈ రెండు కంపెనీలు వేర్వేరుగా ఎక్స్‌క్లూజివ్ ఉత్పత్తులను తయారు చేయాలని నిర్ణయించాయి. ప్రపంచ మార్కెట్లో నిస్సాన్‌కు చవక కార్ మేకర్‌గా గుర్తింపు ఉంది. అదే రెనో విషయానికి వస్తే, ఈ బ్రాండ్‌కు గ్లోబల్ మార్కెట్లో మంచి ఇమేజ్ ఉంది.
కాబట్టి, ఇండియన్ మార్కెట్లో నిస్సాన్ అందిస్తున్న ఉత్పత్తులనే కొద్దిగా మార్పులు చేర్పులు చేసి రీబ్యాడ్జ్‌తో రెనో విక్రయించినప్పటికీ, కొనుగోలుదారులు ఎక్కువగా నిస్సాన్ ఉత్పత్తులను ఆశ్రయిస్తారు. ఇందుకు ప్రధాన కారణం, నిస్సాన్ ఉత్పత్తులు చవకగా ఉండటమే. నిస్సాన్ ముందుగా మైక్రా, సన్నీ కార్లను ప్రవేశపెట్టడం, వాటిని కొద్దిపాటి మార్పులు చేసి రెనో తమ బ్రాండ్‌తో పల్స్, స్కాలా అనే పేర్లతో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అప్పటికే నిస్సాన్ కార్లను చూసేసిన కొనుగోలుదారులు రెనో ఉత్పత్తుల్లో కొత్తదనం ఏమీ లేదని నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, రెనో-నిస్సాన్ కార్ కంపెనీలు డిజైన్, ఫీచర్ల పరంగా ఒకే విధంగా ఉండే ఉత్పత్తులు కాకుండా వేర్వేరు ఉత్పత్తులను అందించాలని యోచిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ రెండు కంపెనీలు ఒకే ఫ్లాట్‌ఫామ్‌ను షేర్ చేసుకున్నప్పటికీ, డిజైన్, ఫీచర్లు మాత్రం ఒకే విధంగా ఉండబోవని తెలుస్తోంది. కార్ ప్రియులకు ఒకరకంగా ఇది మంచి పరిణామమనే చెప్పాలి. మీరేమంటారు?


Click it and Unblock the Notifications









