టాటా నానోకు పోటీగా రెనో చిన్న కారు; ధర రూ.2.15 లక్షలు

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ దేశీయ విపణిలో అందిస్తున్న ప్రజల కారు 'టాటా నానో'కు త్వరలోనే గట్టి పోటీ ఎదురుకానుంది. నానో కారుకు పోటీగా ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో (Renault) ఓ చిన్న కారును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను దృష్టిలో ఉంచుకొని రెనో రెండు చవక కారును అభివృద్ధి చేయనుంది. ఈ రెండు కార్లలో ఒకటి ప్రపంచంలో కెల్లా అత్యంత చవక కారుగా పేరు తెచ్చుకున్న టాటా నానో కారును సవాల్ చేయనుంది.

భవిష్యత్తులో రానున్న ఈ రెండు కార్లలో తొలి చవక కారును రెనో తమ జపనీస్ భాగస్వామి నిస్సాన్ సహకారంతో అభివృద్ధి చేయనుంది. ఈ కారు ధర 5,000 యూరోలు లేదా 6,400 డాలర్లు ఉండొచ్చని అంచనా. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.3.5 లక్షల రేంజ్‌లో ఉండనుంది. ఈ చిన్న కారు 2014 నాటికి ఇండియన్ మార్కెట్‌ను తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి ఆల్టో 800, హ్యుందాయ్ ఇయాన్ వంటి చిన్న కార్లకు పోటీగా నిలువనుంది.


ఇకపోతే కంపెనీ అభివృద్ధి చేయనున్న మరో చిన్న కారు ధర 3,000 యూరోలు లేదా 3,900 డాలర్లు. అంటే మనదేశ కరెన్సీలో సుమారు రూ.2.15 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. రెనో ఈ రెండు చవక కార్లను కూడా చెన్నైలో ఉ్నన రెనో-నిస్సాన్ ఉత్పత్తి కేంద్రంలో తయారు చేయనుంది. అయితే, ఈ చిన్న కార్లను యూరప్ మార్కెట్లలో విక్రయించే అవకాశాలు కనిపించడం లేదు. రెనోకు చెందిన చవక కార్ బ్రాండ్ డాట్సన్ ద్వారా కంపెనీ ఈ చవక కార్లను ఇండియాలో ప్రవేశపెట్టనుంది.

డాట్సన్ బ్రాండ్ క్రింద ఇండియాకు రానున్న మొదటి రెండు ఉత్పత్తులు కూడా ఇవే కానున్నాయి. గతంలో రెనో నిలిపివేసిన తమ డాట్సన్ బ్రాండ్‌ను తిరిగి మార్కెట్లో ప్రవేశపెడతామని ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. డాట్సన్ బ్రాండ్ క్రింద రానున్న రెండేళ్లలో రెండు చవక కార్లను ప్రవేశపెడతామని రెనో-నిస్సాన్ సీఈఓ కార్లోస్ ఘోస్న్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి భవిష్యత్తులో టాటా నానో ఈ పోటీని ఎలా ఎదుర్కుంటుందో వేచి చూడాల్సి ఉంది. మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Friday, November 23, 2012, 11:23 [IST]
English summary
French carmaker Renault is planning to launch two new low cost models designed specifically for emerging markets like India. One of the two new low cost models from Renault could rival the World's cheapest car, the Tata Nano, according to French news website Latribune.fr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+