సెప్టెంబర్‌ 7న మార్కెట్లోకి రానున్న రెనో స్కాలా

పాపులర్ నిస్సాన్ సన్నీ సెడాన్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని ఫ్రెంచ్ కార్ మేకర్ రెనో ఇండియా అభివృద్ధి చేసిన సరికొత్త సెడాన్ రెనో స్కాలా విడుదలకు ముహుర్తం ఖరారైంది. వచ్చే నెల 7వ తేదీని ఈ కారు మార్కెట్లో విడుదల కానుంది. ఇప్పటికే మీడియా ప్రతినిధుల కోసం రెనో ఇండియా ఓ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రెనో ఇండియా తమ అధికారిక వెబ్‌సైట్‌లో రెనో స్కాలా సెడాన్ కోసం ఓ ప్రత్యేక వెబ్‌పేజ్‌ను డిజైన్ చేసి, ఆన్‌లైన్ ద్వారా ముందస్తు బుకింగ్‌లను కూడా స్వీకరిస్తోంది. నిస్సాన్ సన్నీ సెడాన్‌కు జెరాక్స్ కాపీగా వస్తున్న రెనో స్కాలా సెడాన్‌లో చాలా వరకూ ఫీచర్లను నిస్సాన్ సన్నీలో గమనించవచ్చు. ఇంజన్, ఇంటీరియర్స్ వంటి వాటిలో ఈ రెండు కార్లలో పెద్దగా మార్పులు ఉండబోవు.


నిస్సాన్ సన్నీ సెడాన్‌లో ఉపయోగించిన 1.5 లీటర్ కె9కె 85 బిహెచ్‌పి డీజిల్ ఇంజన్‌నే రెనో స్కాలా సెడాన్‌లోను ఉపయోగించటం జరిగింది. రెనో స్కాలా బూట్ డోర్‌పై సరికొత్త క్రోమ్ బార్‌ను ఏర్పాటు చేశారు. ధర విషయంలో మాత్రం ఇది నిస్సాన్ సన్నీ కన్నా కాస్తంత అధికంగా ఉండనుంది. రెనో స్కాలా ధరలు రూ.6.5 లక్షల నుంచి 9.5 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

రెనో స్కాలాలో ఆటోమేటిక్ వేరియంట్ కూడా లభించే అవకాశాలున్న ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో డీజిల్ కార్లకు డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో రెనో ఇండియా తొలుత డీజిల్ వెర్షన్ స్కాలాను మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. అనంతరం ఇందులో పెట్రోల్ వేరియంట్‌‌ను ప్రవేశపెట్టవచ్చు. పెట్రోల్ వెర్షన్ రెనో స్కాలాలో కూడా నిస్సాన్ సన్నీ పెట్రోల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.5 లీటర్ 98 హెచ్‌పి ఇంజన్‌నే ఉపయోగించనున్నారు.

రెనో స్కాలా సెడాన్ భారత్‌లో రెనో ఇండియా నుంచి లభిస్తున్న ఐదవ ఉత్పత్తి. నిస్సాన్-రెనో భాగస్వామ్యంలో చెన్నైలో నిర్వహించబడుతున్న ఫ్యాక్టరీలోనే రెనో స్కాలా సెడాన్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ప్రస్తుతం రెనో ఇండియా పల్స్ హ్యాచ్‌బ్యాక్, ప్రీమియం సెడాన్ ఫ్లూయెన్స్, ప్రీమియం ఎస్‌యూవీ కొలియోస్, ఎస్‌యూవీ డస్టర్ ఉత్పత్తులను అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 30, 2012, 12:19 [IST]
English summary
Renault Scala has being doing its fair share of testing in India. Drivespark is keeping a close tab on Renault's developments in India. The French auto-maker will launch their Scala sedan in India on 7th September, 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+