రూ.6.99 లక్షల ధరకే స్కాలాను విడుదల చేసిన రెనో

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా నేడు రెనో స్కాలా సెడాన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన ఫీచర్లను కలిగి ఉండేలా తీర్చిదిద్దిన రెనో స్కాలా సెడాన్‌ను సరసమైన ధరకే కంపెనీ అందిస్తోంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుంది. రెనో స్కాలాలో ఆటోమేటిక్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ సెగ్మెంట్లోనే తొలిసారిగా సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ స్కాలాలో ఉపయోగించామని కంపెనీ పేర్కొంది.


రెనో స్కాలా పెట్రోల్ వేరియంట్‌లో ఎక్స్‌హెచ్2 మోడల్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 99 పిఎస్‌ల శక్తిని, 134 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 16.95 కి.మీ. మైలేజీనిస్తుంది. అలాగే, డీజిల్ వెర్షన్ స్కాలాలో ఉపయోగించిన కె9కె ఇంజన్ 86 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు డీజిల్‌కు 21.64 కి.మీ. మైలేజీనిస్తుంది.

మైక్రా, సన్నీలో కనిపించే అనేక ఫీచర్లు స్కాలా సెడాన్‌లో ఉండనున్నాయి. డ్యాష్‌బోర్డ్, స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్, స్టార్ట్ బటన్ ఫంక్షన్, ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెనో స్కాలా సెడాన్ ఈ సెగ్మెంట్లోని స్కొడా ర్యాపిడ్, మారుతి సుజుకి ఎస్ఎక్స్4, హోండా సిటీ, ఫోక్స్‌వ్యాగన్ వెంటో, హ్యుందాయ్ వెర్నాలకు పోటీగా నిలువనుంది.

రెనో స్కాలా ధరలు:
* రెనో స్కాలా పెట్రోల్ ఆర్ఎక్స్ఈ - రూ. 6.99 లక్షలు
* రెనో స్కాలా పెట్రోల్ ఆర్ఎక్స్ఎల్ - రూ. 7.85 లక్షలు
* రెనో స్కాలా డీజిల్ ఆర్ఎక్స్ఎల్ - రూ. 8.69 లక్షలు
* రెనో స్కాలా డీజిల్ ఆర్ఎక్స్‌జెడ్ - రూ. 9.57 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Friday, September 7, 2012, 12:36 [IST]
English summary
The French Auto maker's sedan is finally here. The 2012 Renault Scala's outstanding design feature, comes in the form of a butch front edge and hexagonal grille. The Renault Scala is a revamped version of the Nissan Sunny.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+