నిలుచుకొని ప్రయాణించే రిన్‌స్పీడ్ మైక్రోమ్యాక్స్ ఈవి కాన్సెప్ట్
మీరు ఇప్పటి వరకూ కూర్చుని ప్రయాణం చేసే కార్ల గురించి తెలుసుకొని ఉంటారు. అయితే, మీరెప్పుడైనా నిల్చుని ప్రయాణించే కార్లను చూశారా..? పోనీ అలాంటి కార్ల గురించి ఎక్కడైనా విన్నారా..? నిలుచుని ప్రయాణించే కార్లేంటబ్బా అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ కథనం చదవండి. స్విట్జర్లాండ్‌కు చెందిన రిన్‌స్పీడ్ అనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఓ వినూత్నమైన కాన్సెప్ట్ కారును రూపొందించింది. రిన్‌స్పీడ్ భవిష్యత్తులో పట్టణ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని 'మైక్రోమ్యాక్స్ ఈవి' (MicroMAX EV) అనే కాన్సెప్ట్ కారును అభివృద్ధి చేసింది.
వచ్చే ఏడాది మార్చిలో జెనీవాలో జరగనున్న అంతర్జాతీయ మోటార్ షోలో రిన్‌స్పీమ్ తమ మైక్రోమ్యాక్స్ ఈవి కాన్సెప్ట్‌ను ఆవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో, కంపెనీ తమ అధునాతన కాన్సెప్ట్ గురించి కొన్ని వివరాలను మీడియాకు తెలియజేసింది. మైక్రోమ్యాక్స్ ఈవి కాన్సెప్ట్ కారు 3.6 మీటర్ల పొడవును కలిగి ఉండి ఒక డ్రైవర్, ముగ్గురు ప్యాసింజర్లకు చోటును కల్పించడమే కాకుందా ఇందులో ఒక స్ట్రోలర్ లేదా షాపింగ్ కార్ట్‌ను స్టోర్ చేసుకునేంత స్థలం ఉంటుంది. ఇది 2.2 మీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది, అందుకే ఈ కారులో విశాలమైన స్థలం ఉంటుంది.

రిన్‌స్పీడ్ మైక్రోమ్యాక్స్ ఈవి కాన్సెప్ట్
స్విట్జర్లాండ్‌కు చెందిన రిన్‌స్పీడ్ అనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఓ వినూత్నమైన కాన్సెప్ట్ కారును రూపొందించింది. రిన్‌స్పీడ్ భవిష్యత్తులో పట్టణ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని 'మైక్రోమ్యాక్స్ ఈవి' (MicroMAX EV) అనే కాన్సెప్ట్ కారును అభివృద్ధి చేసింది. వచ్చే ఏడాది మార్చిలో జెనీవాలో జరగనున్న అంతర్జాతీయ మోటార్ షోలో రిన్‌స్పీమ్ తమ మైక్రోమ్యాక్స్ ఈవి కాన్సెప్ట్‌ను ఆవిష్కరించనుంది.

రిన్‌స్పీడ్ మైక్రోమ్యాక్స్ ఈవి కాన్సెప్ట్
మైక్రోమ్యాక్స్ ఈవి కాన్సెప్ట్ కారు 3.6 మీటర్ల పొడవును కలిగి ఉండి ఒక డ్రైవర్, ముగ్గురు ప్యాసింజర్లకు చోటును కల్పించడమే కాకుందా ఇందులో ఒక స్ట్రోలర్ లేదా షాపింగ్ కార్ట్‌ను స్టోర్ చేసుకునేంత స్థలం ఉంటుంది. ఇది 2.2 మీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది, అందుకే ఈ కారులో విశాలమైన స్థలం ఉంటుంది. మైక్రోమ్యాక్స్ ఈవి కాన్సెప్ట్ కారు సీటింగ్ సాధారణ కార్లలో ఉండే సీటింగ్ కన్నా భిన్నంగా ఉంటుంది. ఇందులో ప్రయాణికులు కూర్చుని కాకుండా నిల్చుని ప్రయాణించాల్సి ఉంటుంది.

రిన్‌స్పీడ్ బ్యాంబూ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్

రిన్‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌స్పీడ్ ఎస్‌క్యూబా

రిన్‌స్పీడ్ డాక్‌గో

రిన్‌స్పీడ్ డాక్‌గో

రిన్‌స్పీడ్ డాక్‌గో
మైక్రోమ్యాక్స్ ఈవి కాన్సెప్ట్ కారు సీటింగ్ సాధారణ కార్లలో ఉండే సీటింగ్ కన్నా భిన్నంగా ఉంటుంది. ఇందులో ప్రయాణికులు కూర్చుని కాకుండా నిల్చుని ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే, కాళ్లపై పూర్తి భారం పడకుండా ఉండేందుకు గాను ఇందులో కొంచెం ఎత్తులో ఉండే చిన్నపాటి సీట్లను (అప్‌రైట్ సీట్స్) అమర్చారు. ఈ సీట్లకు సీట్‌బెల్ట్స్ ఉంటాయి (సింపుల్‌గా చెప్పాలంటే చిన్నప్పుడు మనం స్కూళ్లో తప్పు చేసినప్పుడు టీచర్లు మనచేత గోడకుర్చీ వేయిస్తారు కదా అలాగన్నమాట). ఇలాంటి సీట్లను అమర్చడం వల్లనే ఈ కారులో అంత ఎక్కువ లగేజ్ స్పేస్ సాధ్యమవుతుంది.
మైక్రోమ్యాక్స్ ఈవిలో కాఫీ మేకర్, రిఫ్రిజిరేటర్‌లతో వినోదం కోసం పలు కెనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉండనున్నాయి. ఈ వినూత్న ఎలక్ట్రిక్ వాహనానికి సంబంధించిన మరింత సమాచారాన్ని, సాంకేతిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ కాన్సెప్ట్ వాహనం యొక్క రియల్ రూపాన్ని చూడాలంటే వచ్చే ఏడాది మార్చి వరకూ ఆగాల్సిందే. రిన్‌స్పీడ్ ఇప్పటికే వివిధ రకాల కాన్సెప్ట్ వాహనాలను రూపొందించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అందులో అటు నీటిలోను ఇటు రోడ్డుపైన ప్రయాణించే రిన్‌స్పీడ్ ఎస్‌క్యూబా కారు చెప్పుకోదగినది.


Click it and Unblock the Notifications








