జనవరి 2013లో మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ డెలివరీలు

మారుతి సుజుకి అందిస్తున్న రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఓ ఆటోమేటిక్ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకురానున్న తెలుగు డ్రైవ్ గతంలో ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసిందే. మారుతి సుజుకి రిట్జ్ ఇప్పటి వరకూ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వేరియంట్లలో మాత్రమే లభ్యమవుతోంది. అయితే, ఆటోమేటిక్ వేరియంట్ రిట్జ్‌కు మంచి డిమాండ్ ఉంటుందనే ఉద్దేశ్యంతో కంపెనీ ఇందులో సరికొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది.

కొత్త రిట్జ్ ఆటోమేటిక్‌లో ఫోర్-స్పీడ్ (4 గేర్లు) ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించనున్నారు. దీనిని 1.2 లీటర్ కె12 పెట్రోల్ ఇంజన్‌కు జతచేయనున్నారు. ఇది గరిష్టంగా 86 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. డిజైర్ ఆటోమేటిక్ మాదిరిగానే రిట్జ్ ఆటోమేటిక్ కూడా కేవలం విఎక్స్ఐ (ఏబిఎస్) వేరియంట్లో మాత్రమే లభ్యం కానుంది. భారత్‌లో మారుతి సుజుకి ఇప్పటికే ఏ-స్టార్ ఆటోమేటిక్, డిజైర్ ఆటోమేటిక్ మోడళ్లను విక్రయిస్తోంది. కాగా.. కొత్త రిట్జ్ కంపెనీ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడిన మూడవ మోడల్ కానుంది.

ఇది ఈ సెగ్మెంట్లోని హ్యుందాయ్ ఐ10, హోండా బ్రయో ఆటోమేటిక్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది. మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ ధర రూ.6.3 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. కాగా.. మారుతి సుజుకి డీలర్లు ఇప్పటికే ఆటోమేటిక్ రిట్జ్ కోసం 50,000 అడ్వాన్స్‌తో బుకింగ్‌లను అంగీకరిస్తున్నారు. జనవరి 15, 2012 నుంచి ఈ ఆటోమేటిక్ రిట్జ్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి. మారుతి సుజుకి ఏ-స్టార్, స్విఫ్ట్ డిజైర్ సెడాన్లలో ఉపయోగించిన 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌నే రిట్జ్ ఆటోమేటిక్‌‌లోను ఉపయోగించారు. ఇందులో ఉపయోగించిన 1.2 లీటర్ కె12 పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 83 బిహెచ్‌పిల శక్తిని, 114 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ వేరియంట్ లీటర్ పెట్రోల్‌కు 17.16 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ వేరియంట్:

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ వేరియంట్:

మారుతి సుజుకి తాజాగా ప్రవేశపెట్టిన అప్‌గ్రేడెడ్ పెట్రోల్ వెర్షన్ రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌లో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌ను కూడా పరిచయం చేయనుంది. కేవలం పెట్రోల్ వెర్షన్‌లో (విఎక్స్ఐ ఏటి) మాత్రమే ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది.

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్:

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్:

మారుతి సుజుకి ఏ-స్టార్, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ మోడళ్లలో ఉపయోగించే 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌నే రిట్జ్ ఆటోమేటిక్‌‌ వేరియంట్‌లోను ఉపయోగించనున్నారు.

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ ఇంజన్:

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ ఇంజన్:

మారుతి సుజుకి రిట్జ్‌లో ఉపయోగించిన 1197సీసీ, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 85 పిఎస్‌ల శక్తిని, 113 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ మైలేజ్:

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ మైలేజ్:

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ వేరియంట్ లీటర్ పెట్రోల్‌కు 17.16 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ ధర:

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ ధర:

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ ధర రూ.6.3 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ కాంపిటీషన్:

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ కాంపిటీషన్:

మారుతి సుజుకి రిట్జ్ ఆటోమేటిక్ ఈ సెగ్మెంట్లోని హ్యుందాయ్ ఐ10, హోండా బ్రయో ఆటోమేటిక్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.

మారుతి సుజుకి రిట్జ్ పెట్రోల్ ధరలు (మ్యాన్యువల్):

మారుతి సుజుకి రిట్జ్ పెట్రోల్ ధరలు (మ్యాన్యువల్):

* మారుతి సుజుకి రిట్జ్ ఎల్ఎక్స్ఐ - రూ.4.43 లక్షలు

* మారుతి సుజుకి రిట్జ్ విఎక్స్ఐ - రూ.4.74 లక్షలు

* మారుతి సుజుకి రిట్జ్ విఎక్స్ఐ (ఏబిఎస్) - రూ.5.00 లక్షలు

* మారుతి సుజుకి రిట్జ్ జెడ్ఎక్స్ఐ - రూ.5.37 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

మారుతి సుజుకి రిట్జ్ డీజిల్ ధరలు (మ్యాన్యువల్):

మారుతి సుజుకి రిట్జ్ డీజిల్ ధరలు (మ్యాన్యువల్):

* మారుతి సుజుకి రిట్జ్ ఎమ్‌సి ఎల్‌డిఐ - రూ.5.50 లక్షలు

* మారుతి సుజుకి రిట్జ్ ఎమ్‌సి విడిఐ - రూ.5.83 లక్షలు

* మారుతి సుజుకి రిట్జ్ ఎమ్‌సి విడిఐ (ఏబిఎస్) - రూ.6.02 లక్షలు

* మారుతి సుజుకి రిట్జ్ ఎమ్‌సి జెడ్‌డిఐ - రూ.6.43 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)

More from DriveSpark

Article Published On: Tuesday, December 11, 2012, 15:19 [IST]
English summary
Maruti Suzuki is all set to launch an automatic variant of its popular Ritz hatchback. The leading Indian carmaker has updated its website with details about the upcoming automatic Ritz variant. Deliveries will commence by January 15, 2013
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+