రోల్స్ రాయిస్ కార్లను కలిగిన ఉన్న ఇండియన్ సెలబ్రిటీస్
ఇండియాలో ఎంత మంది వద్ద మారుతి సుజుకి ఆల్టో కారు ఉందో చెప్పడం కష్టం కానీ, ఎంత మంది వద్ద రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయో అని అడిగితే టక్కున వేళ్ల మీద లెక్కపెట్టి చెప్పేయవచ్చు. బ్రిటన్‌కు ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయిస్ ప్రస్తుతం భారత మార్కెట్లో రెండు కార్లను మాత్రమే విక్రయిస్తోంది. అందులో ఒకటి రోల్స్ రాయిస్ ఘోస్ట్, మరొకటి రోల్స్ రాయిస్ ఫాంటమ్. కోట్ల ఖరీదు చేసే ఈ కార్లను కొనుగోలు చేసిన భారతీయ సెలబ్రిటీలను క్రింది ఫోటో ఫీచర్‌లో గమనించవచ్చు.
చిరంజీవి - రోల్స్ రాయిస్ ఫాంటమ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వద్ద సుమారు రూ.4 కోట్ల ఖరీదు చేసే పవర్‌ఫుల్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ లగ్జరీ కారు ఉంది. చిరంజీవికి ఈ కారును ఆయన 53వ పుట్టిన రోజు సందర్భంగా తన తనయుడు రామ్ చరణ్ తేజ బహుకరించాడు.
అమితాబ్ బచ్చన్ - రోల్స్ రాయిస్ ఫాంటమ్
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వద్ద కూడా ఓ రోల్స్ రాయిస్ ఫాంటమ్ లగ్జరీ కారు ఉంది. బిగ్ బికు ఈ కారును బాలీవుడ్ డైరెక్టర్ విదు వినోద్ చోప్రా బహుమతిగా ఇచ్చారని సమాచారం.

అమీర్ ఖాన్ - రోల్స్ రాయిస్ ఘోస్ట్
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ వద్ద ఓ రోల్స్ రాయిస్ ఘోస్ట్ లగ్జరీ కారు ఉంది. గడచిన సంవత్సరంలోనే అమీర్ ఖాన్ ఈ కారును కొనుగోలు చేశాడు. దీనికోసం ఆయన సుమారు రూ.3 కోట్లకు పైగానే రుక్కాన్ని వెచ్చించాడు. ప్రత్యేకించి రిజిస్ట్రేషన్ నెంబర్ 1 కోసం అమీర్ ఖాన్ రూ.3 లక్షలు చెల్లించారట.

విజయ మాల్యా - రోల్స్ రాయిస్ ఘోస్ట్
లిక్కర్ దిగ్గజం విజయ మాల్యా వద్ద కార్లకు కొదవే లేదు. ఆయన వద్ద రెండు రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. అందులో ఒకటి 1913 సంవత్సరానికి చెందిన పురాతన రోల్స్ రాయిస్ సిల్వర్ ఘోస్ట్ కాగా మరొకటి మోడ్రన్ రోల్స్ రాయిస్ ఘోస్ట్.

శంకర్ - రోల్స్ రాయిస్ ఘోస్ట్
విలక్షణమైన సినిమాలు తీయటంలో ప్రసిద్ధి చెందిన కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ రోబో సినిమా సక్సెస్ కావటంతో ఓ రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు కోసం శంకర్ రూ.3.45 కోట్లు (ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ నెంబర్‌తో కలిపి) వెచ్చించాడు.

విజయ్ - రోల్స్ రాయిస్ ఘోస్ట్
తాజా చిత్రం 'తుపాకీ'తో సినీ ప్రేక్షకులను అలరిస్తున్న కోలీవుడ్ కుర్ర హీరో ఇటీవలే ఓ రోల్స్ రాయిస్ ఘోస్ట్ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. విజయ్ ఈ కారు కోసం సుమారు రూ.3 కోట్లకు పైగా మొత్తాన్ని వెచ్చించినట్లు సమాచారం.

మన్యతా దత్ - రోల్స్ రాయిస్ ఘోస్ట్
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ భార్య మన్యతా దత్ వద్ద కూడా ఓ రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు ఉంది. సంజయ్ దతే ఆమెకు ఈ కారును బహుకరించాడు.

Click it and Unblock the Notifications