రోల్స్ రాయిస్ వెడ్డింగ్ ఎడిషన్ ఘోస్ట్, ఫాంటమ్ విడుదల
బ్రిటీష్ లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయిస్ గురించి మన భారతీయులకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజుల కాలం నుంచి ఇప్పటి వరకూ విలాసవంతమైన కార్లను అందించడంలో తనదైన ముద్రను వేసుకున్న రోల్స్ రాయిస్ భారత మార్కెట్లో అందిస్తున్న ఘోస్ట్, ఫాంటమ్ మోడళ్లలో రెండు స్పెషల్ ఎడిషన్ వేరియంట్లను పరిచయం చేసింది. రానున్నది పెళ్లిల్ల సీజన్ కావటంతో, ధనిక కుటుంబాలను టార్గెట్ చేసుకొని ఈ రెండు మోడళ్లలో 'వెడ్డింగ్ ఎడిషన్'ను కంపెనీ విడుదల చేసింది.

రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఫ్రంట్ వ్యూ

రోల్స్ రాయిస్ ఘోస్ట్ రియర్ వ్యూ

రోల్స్ రాయిస్ ఘోస్ట్ సైడ్ వ్యూ

రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఫ్రంట్ వ్యూ

రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్యాష్‌బోర్డ్

రోల్స్ రాయిస్ ఫాంటమ్ సూపర్ లగ్జరీ సెలూన్

రోల్స్ రాయిస్ ఫాంటమ్ స్టీరింగ్
రోల్స్ రాయిస్ ప్రపంచ వ్యాప్తంగా పది కార్లు విక్రయిస్తే, అందులో ఒకటి ఇండియాలో అమ్ముడుపోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా చేతుల్తో తయారు చేసిన ఈ మోడళ్లను కంపెనీ ఇక్కడి మార్కెట్‌కు పరిచయం చేసింది. వినియోగదారుల అభ్యర్థనల మేరకు ఈ వెడ్డింగ్ ఎడిషన్‌ను పరిచయం చేశామని, అక్టోబర్ 30 నుంచి ఈ సీజన్ ప్రారంభమవుతుందని, ఇప్పటికే రెండు, మూడు జంటల నుంచి అభ్యర్థనలు వచ్చాయని, వాళ్లు కోరుకున్న విధంగా కార్లను మార్పులు చేర్పులు చేసేందుకు డీలర్లు వారితో మాట్లాడుతున్నారని కంపెనీ జిఎమ్ (ఎమర్జింగ్ మార్కెట్స్, ఏషియా) హెర్‌ఫ్రైడ్ హసెనోహ్రెల్ తెలిపారు.
ఈ వెడ్డింగ్ ఎడిషన్ కొనుగోలు చేయాలనుకున్న జంటలు తమ అభిరుచికి తగిన రంగులను ఎంచుకోవటంతో పాటుగా, ఇంటీరియర్లపై వారిద్దరి పేర్లను ముద్రించుకోవచ్చు. ప్రస్తుతం దేశీయ విపణిలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ ధరలు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల రేంజ్‌లో ఉండగా, రోల్స్ రాయిస్ ఫాంటమ్ ధర దాదాపు రూ.4.5 కోట్లుగా ఉన్నాయి. 2011లో భారతీయులు ఈ కార్ మేకర్ నుంచి సుమారు 100 సూపర్ లగ్జరీ కార్లను కొనుగోలు చేశారని అంచనా. ఈ సంవత్సరంలో ఇది మరో 50 శాతం పెరగవచ్చని తెలుస్తోంది. రోల్స్ రాయిస్ భారత మార్కెట్లో 2005 నుంచి దాదాపు 200 యూనిట్లకు పైగా లగ్జరీ కార్లను విక్రయించింది. 2015 నాటికి ఇక్కడి మార్కెట్లో సుమారు 130 నుంచి 150 యూనిట్ల కార్లను విక్రయించవచ్చని కంపెనీ అంచనా వేస్తుంది.


Click it and Unblock the Notifications








