పాత చెవర్లే కాప్టివా ఎస్‌యూవీపై రూ.2 లక్షల డిస్కౌంట్
జనరల్ మోటార్స్ ఇండియా గత నెల చివరి వారంలో సరికొత్త అప్‌గ్రేడెడ్ ప్రీమియ ఎస్‌యూవీ 2012 చెవర్లే కాప్టివాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, పాత చెవర్లే కాప్టివా స్టాక్ ఎక్కువగా ఉండటంతో ఈ మోడల్‌పై ఏకంగా రూ.2 లక్షల తగ్గింపును జనరల్ మోటార్స్ అందిస్తోంది. కేవలం మ్యాన్యువల్ వేరియంట్ (ఎల్‌టి) మాత్రమే ప్రస్తుతం స్టాక్‌లో ఉంది.
కొత్త మోడల్ రాకతో పాత మోడల్ స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు జనరల్ మోటార్స్ ఈ తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతం పాత చెవర్లే కాప్టివా ఎల్‌టి వేరియంట్ ధర రూ.19.26 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉండగా, డిస్కౌంట్ అనంతరం దీని ధర రూ.17.26 లక్షలకు దిగొచ్చింది. తక్కువ ధరకే చెవర్లే కాప్టివా ఎస్‌యూవీ సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ డీల్‌గా చెప్పవచ్చు. మరి త్వరపడండి ఈ ఆఫర్ స్టాక్ మిగిలి ఉన్నంత వరకూ మాత్రమే.
వాస్తవానికి గడచిన జనవరిలో ఆవిష్కరించిన కొత్త 2012 వెర్షన్ చెవర్లే కాప్టివా ఎస్‌యూవీని ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని జనరల్ మోటార్స్ భావించింది. అయితే, మందగించిన మార్కెట్ పరిస్థితుల కారణంగా అమ్మకాలు తగ్గుముఖం పట్టడం, ఫలితంగా స్టాక్ అలానే మిగిలి ఉండిపోవటంతో దీని విడుదలను కంపెనీ వాయిదా వేసుకుంటూ వచ్చింది.
కానీ, ఎస్‌యూవీ మార్కెట్లో పోటీ ఎక్కువ అవుతుండటంతో కొత్త చెవర్లే కాప్టివా జనరల్ మోటార్స్ త్వరగానే మార్కెట్లోకి విడుదల చేసింది. మార్చి-మే 2012 కాలంలో కేవలం 88 కాప్టివాలు మాత్రమే అమ్ముడయ్యాయి. కొత్త మోడల్ రాకతో అమ్మకాల సంఖ్య ఊపందుకోగలదని జనరల్ మోటార్స్ భావిస్తోంది. ప్రారంభంలో భాగంగా కొత్త చెవర్లే కాప్టివా కేవలం ఆటోమేటిక్ వేరియంట్‌లో మాత్రమే లభ్యం కానుంది.
ప్రస్తుతం స్టాక్‌లో ఉన్న సుమారు 140 మ్యాన్యువల్ వేరియంట్ పాత చెవర్లే కాప్టివా అమ్మకాలు క్లియర్ కాగానే జిఎమ్ కొత్త చెవర్లే కాప్టివాలో మ్యావవల్ వెర్షన్‌ను విడుదల చేసే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. మంచి తరుణం మించిన రాదు. కాబట్టి, వెంటనే పాత కాప్టివాను సరసమైన ధరకే సొంతం చేసుకోండి.
ఇక కొత్త 2012 చెవర్లే కాప్టివా విషయానికి వస్తే.. ఇందులో ఉపయోగించిన శక్తివంతమైన 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ 3800 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 150 పిఎస్‌ల శక్తిని, 2000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌లతో పాటుగా 2-వీల్ డ్రైవ్, 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌లతో కూడా లభ్యమవుతుంది. ఇప్పటి వరకూ చెవర్లే కాప్టివాలో ఆటోమేటిక్ వెర్షన్ లేదు. కాగా.. కొత్తగా విడుదలైన 2012 చెవర్లే కాప్టివా ఈ ఫీచర్‌తో లభిస్తుంది.
హైదరాబాద్ మార్కెట్లో చెవర్లే కాప్టివా ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:
* Chevrolet Captiva LT BS4 - Rs 1907378
* Chevrolet Captiva Xtreme BS4 - Rs 1982984
* Chevrolet Captiva AWD BS4 - Rs 2095746


Click it and Unblock the Notifications








