కత్రినా కైఫ్‌కు ఆడి కారును కానుకగా ఇచ్చిన సల్మాన్ ఖాన్

బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌ల రిలేషన్ గురించి తెలియని వారెవ్వరూ ఉండరేమో. ఎప్పుడూ ఏదో ఒక గాసిప్‌తో హెడ్‌లైన్స్‌లో నిలిచే వీరిద్దరూ మరోసారి హెడ్‌లైన్స్‌ హైలైట్‌గా నిలిచారు. బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ ఇటీవలే తన 28న జన్మదినాన్ని జరుపుకున్న సంగతి తెలిసిందే.


ఈ బర్త్‌డే బేబీకి తన మాజీ బాయ్ ఫ్రెండ్ (ప్రస్తుతం గుడ్ ఫ్రెండ్) సల్మాన్ ఖాన్ ఓ పవర్‌ఫుల్ ఎస్‌యూవీని బహుమతిగా ఇచ్చాడు. కత్రినా కైఫ్‌కు అత్యంత ఇష్టమైన ఆడి బ్రాండ్ ఎస్‌యూవీనే సల్లు భాయ్ కానుగా ఇవ్వటం జరిగింది. అయితే, అది ఆడి క్యూ3నా లేక ఆడి క్యూ5 అనేది తేలాల్సి ఉంది. కత్రినా కైఫ్ వద్ద ఇప్పటికే రూ.60 లక్షలకు పైగా ఖరీదు చేసే ఆడి క్యూ7 ఎస్‌యూవీ ఉంది.

కత్రినా కైఫ్‌ తన బర్‌డేను గ్రాండ్‌గా జరుపులేకపోయింది. తన పుట్టిన రోజున స్టూడియోలోనే ఉండిపోవటంతో ఆ వేడుక కాస్తా జరగలేదు. కానీ షూటింగ్ అనంతరం సల్మాన్ ఖాన్ బహుమతిగా ఇచ్చిన ఓ నలుపు రంగు ఆడి ఎస్‌యూవీలో కత్రినా కైఫ్ ముంబై రోడ్లపై చక్కర్లు కొట్టి చివరికి అర్థరాత్రి సమయంలో సల్మాన్ ఖాన్ ఇంటికికి డిన్నర్‌కు వెళ్లటం జరిగింది.

తాజాగా సల్మాన్ ఖాన్ ఇచ్చిన ఆడి ఎస్‌యూవీతో అమ్మడు భలే ఖుషీ ఖుషీగా కనిపిస్తోంది. అయితే, సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌లు మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం 'ఏక్ థా టైగర్' మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో భాగంగా సల్మాన్ ఈ కానుక ఇచ్చాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ, ఈ సరికొత్త కానుకతో కత్రినా కైఫ్ కార్ కలెక్షన్‌లోకి మరొక ఆడి బ్రాండ్ కారు వచ్చి చేరినట్లయింది.

More from DriveSpark

Article Published On: Thursday, July 19, 2012, 18:20 [IST]
English summary
Bollywood beauty Katrina Kaif recently celebrated her birthday and former boy friend Salman Khan has reportedly gifted her a new Audi. The car could be the recently launched Q3 which was unveiled by Katrina herself at the Delhi Auto Expo.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+