కింగ్ ఖాన్ 'షారుఖ్ ఖాన్' లగ్జరీ కార్ కలెక్షన్

ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ సీజన్ 5లో ముంబై క్రికెట్ అసోషియేషన్‌తో గొడవకు దిగిన కెకెఆర్ కో-ఓనర్ షారుఖ్ ఖాన్‌కు కార్లంటే భలే క్రేజ్. అందులోనూ విలాసవంతమైన కార్లంటే షారుఖ్ ఖాన్‌కు భలే ఇష్టం. షారుఖ్ నటించే సినిమాల్లో కూడా కార్ ఛేజింగ్ సన్నివేశాలు వళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. స్వతహాగా లగ్జరీ కార్ ప్రియడైన షారుఖ్ ఖాన్, లగ్జరీ కార్లను కొనుగోలు చేయడమే కాకుండా, తనకు ఇష్టమైన వారికి సైతం కానుక ఇస్తుంటాడు.

గత కొద్ది సంవత్సరాలుగా హ్యుందాయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న షారుఖ్ ఖాన్ వద్ద బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్, 6-సిరీస్ సెలూన్‌లతో పాటుగా ఓ కన్వర్టబిల్ కారు కూడా ఉంది. అంతేకాకుండా.. షారుఖ్ తన పిల్లల కోసం ఓ ఆడి ఏ6 సెడాన్ కారును ఉపయోగిస్తుంటాడు.

SRK Car


బ్రిటీష్ లగ్జరీ కార్ మేకర్ రోల్స్ రాయిస్ అందిస్తున్న విలాసవంతమైన, అత్యంత ఖరీదైన ఫాంటమ్ కారుతో పాటుగా తెలుపు రంగు బెంట్లీ కాంటినెంటల్ జిటి కారు కూడా మన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గ్యారేజ్‌లో కొలువుదీరి ఉన్నాయి. టొయోటా ల్యాండ్ క్రూజర్, మిత్సుబిషి పాజెరో స్పోర్ట్ వంటి ప్రీమియం ఎస్‌యూవీలకు కూడా 'డాన్' షారుఖ్ యజమాని.


షారుఖ్ తన సినిమాల్లో కూడా కార్లకు ఓ ప్రత్యేక ఐడెంటిటీని కల్పిస్తుంటాడు. షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన డాన్ 2లో హ్యుందాయ్ ఫ్లూయిడ్ వెర్నా సెడాన్, కొత్త శాంటా ఫే ఎస్‌యూవీలను మన మార్కెట్లో విడుదల కాకముందే ఆ సినిమాలో ఉపయోగించాడు. అలాగే, రావన్ సినిమాలో ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ కార్లు (బీటెల్, టోరెగ్)లను ఉపయోగించాడు.

More from DriveSpark

Article Published On: Friday, May 18, 2012, 19:28 [IST]
English summary
Shahrukh Khan who is in the middle of another controversy following his spat with Mumbai Cricket Association on Wednesday has an enviable car collection. He owns several top of the line cars that will make car lovers take notice.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+