ప్లేబాయ్ కవర్ పేజ్ గర్ల్ షెర్లిన్ చోప్రా కాస్ట్లీ రైడ్
యువకుల మదిని దోచుకునే ఐటమ్ గర్ల్, హాట్ బ్యూటీ షెర్లిన్ చోప్రా గురించి బహుశా తెలియని వారెవ్వరూ ఉండకపోవచ్చేమో..! తన అందచందాలతో అమాయక మనసుల్ని దోచేసుకునే ఈ హైదరబాదీ ముద్దు గుమ్మ జాక్‌పాట్ కొట్టేసింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయే అడల్ట్ మ్యాగజైన్ 'ప్లేబాయ్' కవర్ పేజీపై తన అందాలను ప్రదర్శించే అవకాశాన్ని షెర్లిన్ చోప్రా కొట్టేసింది.
అయితే, ఈ ముఖపుట (కవర్ పేజీ)పై తన చిత్రాన్ని ప్రచురించాలంటే, ఇందుకు ఆమె కెమెరా ముందు నగ్నంగా ఫోజులివ్వాల్సి ఉంటుంది. ఇందుకు షెర్లిన్ చోప్రా ఏ మాత్రం సిగ్గు పడకుండా ఒప్పేసుకుంది. అంతేకాదండోయ్.. నగ్నంగా తీయుంచున్న ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ ఇంటర్నెట్‌లో వేడి వాతావరణాన్ని సృష్టించింది. ఇప్పుడు గూగుల్‌లో కూడా ఈమె టాప్ ట్రెండ్‌గా ఉండగా, 'షెర్లిన్ చోప్రా న్యూడ్ ఫోటోస్' అనేది టాప్ సెర్చ్‌గా మారింది.
ఏదేమైనప్పటికీ, షెర్లిన్ చోప్రా హాట్ ఫోటోలతో కొద్దిసేపట్లో వరల్డ్ ఫేమస్ అయిపోంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన షెర్లిన్ చోప్రా అసలు పేరు మోనా చోప్రా. 1984లో జన్మించిన ఈ అమ్మడికి సినిమా పిచ్చి బాగా ముదిరి పాకాన పడింది. దీంతో చదువును గాలికి వదిలేసి బాలీవుడ్ వైపు బాట పట్టింది. చిన్నాచితకా సినిమాల్లో నటించినప్పటి పెద్దగా గుర్తింపును రాకపోవడంతో, హాట్ హాట్ అల్బమ్‌లు చేస్తూ ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకట్టుకుంది. గతంలో ఈమె ఇంటర్నెట్‌లో ఈమె చేసిన గందరగోళం అంతా ఇంతా కాదులెండి. ఇప్పుడు తాజాగా ప్లేబాయ్ కవర్ పేజ్‌కు ఎంపికైన మొట్టమొదటి ఇండియన్ గర్ల్‌గా షెర్లిన్ చోప్రా మరింత క్రేజ్‌ను తెచ్చుకుంది.
సరే ఇదంతా అటుంచి, ఈ అమ్మడు ఉపయోగించిన పవర్‌ఫుల్ "బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5" కారు విషయానికి వస్తే, ఈ కారు కూడా షెర్లిన్ చోప్రా మాదిరిగానే చాలా సెక్సీగా ఉంటుంది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యూవీ రెండు వేరియంట్ల (ఎక్స్5 ఎక్స్‌డ్రైవ్30డి, ఎక్స్5 ఎక్స్‌డ్రైవ్50ఐ)లో లభ్యమవుతుంది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎక్స్‌డ్రైవ్30డి ధర రూ.58.7 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండగా, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎక్స్‌డ్రైవ్50ఐ ధర రూ.76.9 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ప్రస్తుతం ఈ మోడల్‌ను బిఎమ్‌డబ్ల్యూ సిబియూ రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications









