ఆకర్షనీయమైన పండుగ ఆఫర్లను అందిస్తున్న స్కొడా

By Ravi

ఈ పండుగ సీజన్‌లో కార్ కంపెనీలు ధరల పెంపుతో కొనుగోలుదారుల నడ్డి విరుస్తుంటే, స్కొడా ఆటో ఇండియా మాత్రం ఆకర్షనీయమైన పండుగ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. స్కొడా అందిస్తున్న ఈ ఫెస్టివ్ క్యాంపైన్‌లో భాగంగా, స్కొడా ఉత్పత్తులను కొనుగోలు చేసే కస్టమర్లు ఆకర్షనీయమైన ఆఫర్లు, స్కీమ్‌లు, ఫైనాన్స్ ఆప్షన్లను అలాగే ప్రతి కొనుగోలు/బుకింగ్‌పై ఖచ్ఛితమైన సంతోషాన్ని పొందవచ్చని స్కొడా ఆటో ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్కొడా అధీకృత డీలర్‌షిప్ కేంద్రాలలో ఈ ఫెస్టివ్ క్యాంపైన్ అక్టోబర్ 31, 2012 వరకూ అందుబాటులో ఉంటుంది.

స్కొడా ఆటో ఇండియా లేటెస్ట్‌గా దేశీయ విపణిలో అందిస్తున్న ర్యాపిడ్ సెడాన్ కోసం మరిన్ని అదనపు యాక్ససరీలను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే పూర్తి ఫీచర్లతో లోడ్ చేయబడిన స్కొడా ర్యాపిడ్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు, యాక్ససరీ ప్యాకేజ్‌ను కానీ లేదా అందుబాటులో ఉన్న ఇతర ఆప్షన్లను కానీ ఎంచుకోవచ్చు. స్కొడా ర్యాపిడ్ కొనుగోలు చేసే వారి కోసం ఇది ధరకు తగిన విలువను కలిగిన (వ్యాల్యూ ఫర్ మనీ) ఆఫర్‌గా ఉండనుంది. అన్ని స్కొడా అవుట్‌లెట్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.


ఈ ఫెస్టివ్ క్యాంపైన్ గురించి స్కొడా ఆటో ఇండియా మార్కెటింగ్ హెడ్ కమల్ బసు మాట్లాడుతూ.. పండుగలు అనేవి ప్రతి భారతీయ కుటుంబంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉంటాయని, ఈ సందర్భంగా చేసే కొనుగోళ్లు కూడా ఎంతో విలువైనవిగా పరిగణించడం జరుగుతుందని చెప్పారు. అందుకే, ఈ పండుగ సీజన్‌లో స్కొడా తమ వినియోగదారుల కోసం ఆకర్షనీయమైన ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చిందని అన్నారు. క్లాస్, ఎఫీషియన్సీ, ఎలిగాన్స్, సేఫ్టీ, స్పేషియన్‌నెస్ మరియు కంఫర్ట్ అంశాల్లో మేటి కార్లను తయారు చేయడంలో స్కొడా ఆటో ఇండియా తన ప్రత్యేకతన చాటుకుంది.

భారత మార్కెట్లోని ప్రతి సెగ్మెంట్లో ఉత్పత్తులను అందిస్తున్న స్కొడా 'సింప్లీ క్లెవర్' అనిపించుకుంటుంది. ఈ ఆఫర్లకు సంబంధించిన మరింత పూర్తి సమాచారాన్ని కొనుగోలుదారులు తమకు సమీపంలో అధీకృత స్కొడా అవుట్‌లెట్‌ను సందర్శించవచ్చు. స్కొడా ఆటో ఇండియాకు దేశవ్యాప్తంగా 106 ఎక్స్‌క్లూజివ్ డీలర్‌షిప్ కేంద్రాలున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, October 11, 2012, 10:57 [IST]
English summary
With the onset of the festive season, ŠKODA Auto India is all set to participate in the celebrations with the introduction of the Festive Campaign. Customers can avail exciting offers, schemes, finance options on ŠKODA products and guarantee happiness at every purchase/booking. This festive campaign is running across all ŠKODA authorized dealerships till October 31, 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+