భవిష్యత్తు కోసం స్కొడా ఆటో ఇండియా భారీ ప్రణాళికలు

ఫోక్స్‌వ్యాగన్ గ్రూపుకు చెందిన చెక్ రిపబ్లిక్ కార్ మేకర్ స్కొడా ఆటో భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భావిస్తోంది. తొలుత భారత్‌కు ప్రీమియం కార్ బ్రాండ్‌గా పరిచయం అయిన స్కొడా ఆటో ఇండియా ఫ్యాబియాతో చవక కార్ మార్కెట్లోకి కూడా ప్రవేశించింది. తాజాగా స్కొడా ఫ్యాబియాకు దిగువన ఓ చిన్న కారును ప్రవేశపెట్టి ఎంట్రీ లెవల్ కార్ మార్కెట్లో ధరల యుద్ధాని తెరలేపేందుకు స్కొడా ఆటో ఇండియా సిద్ధంగా ఉంది.

మార్కెట్లో వృద్ధి పరంగా స్థిరంగా కొనసాగుతున్న స్కొడా ఆటో ఇండియా, భవిష్యత్ ప్రణాళికల కోసం ఇండియన్ మార్కెట్లో రూ.300 కోట్లు వెచ్చించనున్నట్లు పేర్కొంది. ఈ మొత్తాన్ని ఉత్పత్తిని పెంచుకునేందుకు, లోకలైజేషన్ (స్థానికంగా విడిభాగాలను కొనుగోలు చేయటం) విస్తరించుకునేందుకు, కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు స్కొడా ఆటో ఇండియా ఉపయోగించనుంది. 2018 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 150 లక్షల కార్లను ఉత్పత్తి చేయాలని స్కొడా లక్ష్యంగా పెట్టుకుంది.

Skoda Superb

ప్రస్తుతం భారత మార్కెట్లో ఫ్యాబియా, ఫ్యాబియా స్కౌట్, ర్యాపిడ్, లారా, లారా ఆర్ఎస్, యెటి, సూపర్బ్ మోడళ్లను అందిస్తుంది. స్కొడా ఇండియా ఇటీవలే సూపర్బ్ సెడాన్లో తక్కువ ధర కలిగిన ఓ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అలాగే, ఫ్యాబియా హ్యాచ్‌బ్యాక్‌లో ఓ ప్రీమియం వేరియంట్ ఫ్యాబియా స్కౌట్‌ను కూడా విడుదల చేసింది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 9, 2012, 14:49 [IST]
English summary
Skoda India is planning to invest as much as Rs.300 crores in India to boost its production, launch new models and thereby increasing sales. The Volkswagen Group owned Czech carmaker is keen to help its parent company reach its goal of 1.5 million sales per year by 2018.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+