స్కొడా ర్యాపిడ్ కోసం ఆకర్షనీయమైన ఇఎమ్ఐ ఆఫర్లు

స్కొడా ఇండియా ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఎంట్రీ లెవల్ సెడాన్ స్కొడా ర్యాపిడ్ కోసం కంపెనీ ఓ ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పుడు లోన్ ద్వారా స్కొడా ర్యాపిడ్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు కేవలం రూ.9,999 ఇఎమ్ఐకే ఈ సెడాన్‌‌ను సొంతం చేసుకోవచ్చు. స్కొడా ఆర్థిక విభాగం స్కొడా ఫైనాన్స్ ఈ ఆఫర్‌ను అందిస్తోంది. పెట్రోల్ వెర్షన్, డీజిల్ వెర్షన్లపై ఈ ఇఎమ్ఐ ఆఫర్ అందుబాటులో ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ వెంటో, హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, మారుతి ఎస్ఎక్స్4, ఫోర్డ్ ఫియస్టా మోడళ్లను సవాల్ చేస్తూ స్కొడా తమ ర్యాపిడ్ సెడాన్‌ను ప్రవేశపెట్టింది. స్కొడా ర్యాపిడ్‌ పెట్రోల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.6 లీటర్, 1598 సీసీ, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 5250 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్‌పిల శక్తిని, 3800 ఆర్‌పిఎమ్ వద్ద 153 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

అలాగే, స్కొడా ర్యాపిడ్‌ డీజిల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.6-లీటర్, 1598 సీసీ, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ 4400 ఆర్‌పిఎమ్ వద్ద 104 బిహెచ్‌పిల శక్తిని, 1500-2500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. దీని స్కొడా ర్యాపిడ్ సెడాన్ గరిష్ట వేగం గంటకు 183 కిలోమీటర్లు. సిల్వర్, వైట్, బీగీ, బ్లాక్, రెడ్ కలర్లలో ఇది లభ్యమవుతుంది.

స్కొడా ర్యాపిడ్ టాప్-ఎండ్ వేరియంట్ల (ఎలిగాన్స్)లో ఈబిడి (ఎలక్ట్రానికి బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ముందు, వెనుక ఫాగ్ ల్యాంప్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మిర్రర్స్, డ్రైవర్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఎయిర్ కండిషనింగ్, రియర్ ఏసి వెంట్స్, పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, టిల్ట్ స్టీరింగ్, టెలిస్కోపిక్ స్టీరింగ్, రిమోట్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సిడి/ఎఫ్ఎమ్/ఆక్స్-ఇన్/ఎస్‌డి కార్డ్ ఆప్షన్ కలిగిన మ్యూజిక్ సిస్టమ్, కీ లెస్ ఎంట్రీ, ఫ్యాబ్రిక్ సీట్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

కొనుగోలుదారులు డౌన్‌పేమెంట్‌ను చెల్లించిన తర్వాత 48 నెలల (4 సంవత్సరాల) పాటు ప్రతి నెలా 9,999 లను చెల్లించాల్సి ఉంటుంది. స్కొడా ర్యాపిడ్ ఇఎమ్ఐ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.

ర్యాపిడ్ పెట్రోల్ వేరియంట్స్ డౌన్‌పేమెంట్ ఇఎమ్ఐ (48 నెలలకు) బెలూన్ పేమెంట్*
ర్యాపిడ్ యాక్టివ్ 1.6 ఎమ్‌పిఐ ఎమ్‌టి రూ. 1,62,220 రూ. 9,999
రూ. 1,38,000
ర్యాపిడ్ యాంబిషన్ 1.6 ఎమ్‌పిఐ ఎమ్‌టి రూ. 1,39,200 రూ. 11,999 రూ. 1,47,000
ర్యాపిడ్ ఎలిగాన్స్ 1.6 ఎమ్‌పిఐ ఎమ్‌టి రూ. 1,41,050 రూ. 13,999 రూ. 1,65,000
ర్యాపిడ్ యాంబిషన్ 1.6 ఎమ్‌పిఐ ఏటి రూ. 1,49,800 రూ. 13,999 రూ. 1,67,000
ర్యాపిడ్ ఎలిగాన్స్ 1.6 ఎమ్‌పిఐ ఏటి రూ. 1,52,490 రూ. 15,999 రూ. 1,85,000
ర్యాపిడ్ డీజిల్ వేరియంట్స్


ర్యాపిడ్ యాక్టివ్ 1.6 టిడిఐ సిఆర్ ఎమ్‌టి రూ. 1,29,670 రూ. 13,999 రూ. 1,63,000
ర్యాపిడ్ యాంబిషన్ 1.6 టిడిఐ సిఆర్ ఎమ్‌టి రూ. 1,35,950 రూ. 14,999 రూ. 1,72,000
ర్యాపిడ్ ఎలిగాన్స్ 1.6 టిడిఐ సిఆర్ ఎమ్‌టి రూ. 1,86,581 రూ. 15,999 రూ. 1,90,000

* బెలూన్ పేమెంట్‌ను లోను ముగిసే సమయంలో చివరి ఇఎమ్‌ఐతో పాటుగా చెల్లించాల్సి ఉంటుంది. పైన లెక్కించిన గణన ఆగస్ట్ 3, 2012 నాటికి ఎక్స్-షోరూమ్, ఢిల్లీ ధరల ఆధారంగా చేసుకొని లెక్కించడం జరిగింది. ఇందులో లోకల్ టాక్స్‌లు, ఇతర పన్నులు, అధనపు ఛార్జీలను కలుపబడలేదు. ఖచ్చితమైన ధరల కోసం మీ సమీపంలోని స్కొడా అధీకృత డీలర్‌ను సందర్శించండి. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకూ లేదా ఆగస్ట్ 31, 2012 వరకూ (ఏది ముందు పూర్తయితే అది) మాత్రమే వర్తిస్తుంది. పైన తెలిపిన ఆఫర్లను స్కొడా ఫైనాన్స్ అందిస్తోంది. షరతులు వర్తిస్తాయి.

More from DriveSpark

Article Published On: Thursday, August 9, 2012, 12:43 [IST]
English summary
Skoda Finance is offering attractive EMI offers for its entry level sedan Skoda Rapid. Now buyers can own a Rapid sedan at Rs 9,999 EMI. This offer is available on limited stocks only and applicable until stocks last or 31 Aug 2012, whichever is earlier.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+