పొడవాటి వీల్‌బేస్ కలిగిన స్కొడా యెటి; చైనాకు మాత్రమేనా..?
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న స్కొడా యెటి వీల్‌బేస్ 2578 మి.మీ. లుగా ఉంది. త్వరలో మార్కెట్లోకి రానున్న సరికొత్త స్కొడా యెటి వీల్‌బేస్ పాత వెర్షన్ సుమారు 60 మి.మీ. ఎక్కువగా ఉండనుంది. అంటే, లాంగర్ వీల్‌బేస్ వెర్షన్ స్కొడా యెటి వీల్‌బేస్ 2638 మి.మీ. లుగా ఉండనుంది. ఈ పొడవాటి వీల్‌బేస్ కలిగి స్కొడా యెటి ముందుగా చైనా మార్కెట్లో విడుదల కానుంది.
అక్కడి మార్కెట్లోని కస్టమర్ల అభిరుచిని దృష్టిలో ఉంచుకొని స్కొడా ఆటో కొత్త వెర్షన్‌ను డెవలప్ చేసింది. వెనుక వరుసలలోని ప్యాసింజర్లకు మంచి సౌకరాన్ని, స్పేస్‌ను కల్పించాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ లాంగర్ వీల్‌బేస్ వెర్షన్ స్కొడా యెటిని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ కస్టమర్లు కూడా పొడవాటి వీల్‌బేస్ కలిగిన ఎస్‌యూవీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. మరి ఈ కొత్త వెర్షన్‌ను స్కొడా ఇండియన్ మార్కెట్లో కూడా అందుబాటులోకి తీసుకువస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది.
ఇండియన్ మార్కెట్లో స్కొడా యెటి డీజిల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఇది 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌తో 110 పిఎస్, 140 పిఎస్ పవర్‌తో ఫ్రంట్-వీల్, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లతో లభ్యమవుతోంది. ఫ్రంట్-వీల్ డ్రైవ్ స్కొడా యెటి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తోనూ, ఆల్-వీల్ డ్రైవ్ స్కొడా యెటి 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తోనూ లభిస్తుంది. రెనో డస్టర్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత స్కొడా యెటిపై సుమారు రూ.2 లక్షలకు పైగా తగ్గింపును కూడా అందించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications









