స్మార్ట్ ఫర్‌స్టార్స్ కారు బానెట్‌లో ఇన్‌బిల్ట్ సినిమా ప్రొజెక్టర్
కారు కేవలం ప్రయాణించడానికి మాత్రమే కాకుండా, అప్పుడు వినోదాన్ని పంచే పెద్ద సినిమా థియేటర్‌లా మారిపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఊహించుకోవటమెందుకు ఈ ఊహను నిజం చేసిందో కార్ కంపెనీ. కారులో కేవలం సరదా ప్రయాణాలు చేయటమే కాకుండా, బోర్ కొట్టినప్పుడు కారునే సినిమా థియేటర్ మార్చేసుకొని ఎంచక్కా కారులో కూర్చొని హాయిగా సిమాలు కూడా చూసేయొచ్చు.
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్‌కు చెందిన స్మాల్ కార్ బ్రాండ్ 'స్మార్ట్' ఓ సరికొత్త కాన్సెప్ట్ కారును రూపొందించింది. 'స్మార్ట్ ఫర్‌స్టార్స్'గా పిలిచే ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూసీ (స్పోర్ట్స్ యుటిలిటీ కూపే) కారుకు ముందువైపు బానెట్‌లో ఓ ఇన్‌బిల్ట్ ప్రొజెక్టర్‌ను అమర్చబడి ఉంటుంది. కారుకు అడ్డుగా ఉండే గోడపై ప్రొజెక్టర్ సాయంతో వీడియోను ప్లే చేయవచ్చు. అలాకుండా, కారుకు ముందువైపు ఓ తెల్లటి తెరను కూడా ఏర్పాటు చేసుకొని వీడియోలను వీక్షించవచ్చు.

స్మార్ట్ ఫర్‌స్టార్స్ - బానెట్‌లో సినిమా ప్రొజెక్టర్

స్మార్ట్ ఫర్‌స్టార్స్ - సెంటర్ కన్సోల్

స్మార్ట్ ఫర్‌స్టార్స్ - డ్యాష్‌బోర్డ్

స్మార్ట్ ఫర్‌స్టార్స్ - స్టీరింగ్ వీల్

స్మార్ట్ ఫర్‌స్టార్స్ - ఇంటీరియర్స్

స్మార్ట్ ఫర్‌స్టార్స్ - ఫ్రంట్ వ్యూ

స్మార్ట్ ఫర్‌స్టార్స్ - లగేజ్ స్పేస్

స్మార్ట్ ఫర్‌స్టార్స్ - ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ కూపే)

స్మార్ట్ ఫర్‌స్టార్స్ - టాప్ వ్యూ

స్మార్ట్ ఫర్‌స్టార్స్ - ప్రొజెక్టర్
ఈనెల 29 నుంచి (సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 15 వరకూ) ప్రారంభం కానున్న ప్యారిస్ మోటార్ షోలో స్మార్ట్ తమ ఫర్‌స్టార్స్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారును ప్రదర్శనకు ఉంచనుంది. కారు లోపల హై క్వాలిటీ సౌండ్ సిస్టమ్‌ను అమర్చబడి ఉంటుంది. ఈ ప్రొజెక్టర్‌ను స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇందులో శక్తివంతమైన బ్యాటరీని అమర్చారు.
ఈ స్మార్ట్ కారులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. స్మార్ట్ ఫర్‌స్టార్స్ కారులో శక్తివంతమైన 60 కి.వా. (80 బిహెచ్‌పి) ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది 17.6 కి.వా. లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్టంగా గంటకు 130 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. అంటే ఈ కారుతో సినిమాలు చూడటంతో పాటు షికార్లు కూడా చేయవచ్చన్నమాట. బాగుంది కదూ ఈ సినిమాల కారు.


Click it and Unblock the Notifications








