సరికొత్త ఎక్స్‌ట్రీమ్ ఎమ్‌యూవీని విడుదల చేసిన సోనాలికా

By Ravi

ఇంటర్నేషనల్ కార్స్ అండ్ మోటార్స్ లిమిటెడ్ (ఐసిఎమ్ఎల్)కు చెందిన ఆటోమోటివ్ డివిజన్ సోనాలికా గ్రూప్ ఓ సరికొత్త బహుళ ప్రయోజన వాహన (ఎమ్‌యూవీ) తాజాగా మార్కెట్లో ప్రవేశపెట్టింది. 'సోనాలికా ఎక్స్‌ట్రీమ్' అనే పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ సరికొత్త ఎమ్‌యూవీ చూడటానికి, ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న సోనాలికా రినో మాదిరిగానే ఉంటుంది.

ఎమ్‌పివి సెగ్మెంట్లో కనుమరుగైపోయిన టొయోటా క్వాలిస్‌కు జెరాక్స్ కాపీ మాదిరగా అనిపించే సొనాలికా ఎక్స్‌ట్రీమ్ ఎమ్‌యూవీ మొత్తం నాలుగు వేరియంట్లలో (ఎల్‌డి (నాన్ ఏసి), ఎల్‌డి (ఏసి), ఎస్‌డి, విడి) లభ్యమవుతుంది. వినియోగదారుల ఎంపికను బట్టి ఇది 7 సీటర్ నుంచి 10 సీటర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. కంపెనీ అందిస్తున్న రినో ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా చేసుకొని ఎక్స్‌ట్రీమ్ ఎమ్‌యూవీని అభివృద్ధి చేశారు.


సోనాలికా ఎక్స్‌ట్రీమ్ డిఐ, సిఆర్‌డిఎఫ్ఐ అనే రెండు ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఇందులో డిఐ ఇంజన్ 99 బిహెచ్‌పిల శక్తిని 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను, సిఆర్‌డిఎఫ్ఐ ఇంజన్ 120 బిహెచ్‌పిల శక్తిని, 285 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. చెవర్లే తవేరా నియో 3 ఎమ్‌యూవీలో కూడా ఇదే సిఆర్‌డిఎఫ్ఐ ఇంజన్‌ను ఉపయోగించారు.

టొయోటా క్వాలిస్‌ను ప్రతిబింబించేలా ఉండే సోనాలికా రినో కొనుగోలుదారులను ఆకట్టుకోవటంలో విఫలమైందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సరికొత్త లుక్ అండ్ పెర్ఫామెన్స్‌తో వచ్చిన సోనాలికా ఎక్స్‌ట్రీమ్ ఎమ్‌యూవీకు మార్కెట్లో మంచి ఆదరణ లభించగలదని ధీమా వ్యక్తం చేస్తుంది. కొత్త సోనాలికా ఎక్స్‌ట్రీమ్ ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్లలో కంపెనీ మార్పులు చేర్పులు చేసింది.

సౌకర్యవంతమైన సీటింగ్ కోరుకునే వారి కోసం 7-సీటర్ ఆప్షన్, అలాగే కమర్షియల్ ప్రయోజనం కోసం ఎక్కువ సీటింగ్ కెపాసిటీ కోరుకునే వారి కోసం 10 సీటర్ ఆప్షన్‌ను సోనాలికా ఎక్స్‌ట్రీమ్‌లో పొందవచ్చు. ప్రస్తుతానికి సోనాలికా దక్షిణ భారతదేశంలో మాత్రమే లభ్యం కానుంది. కంపెనీ తొలుత ఈ ఎమ్‌యూవీని హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసింది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 12, 2012, 19:42 [IST]
English summary
ICML - International Cars & Motors Limited, the automobile division of the Sonalika Group has launched a new MUV called the Extreme. The Sonalika Extreme looks very much similar to the Sonalika Rhino which as we all no is a close replica of the Toyota Qualis. It will be available in four variants - Extreme LD (non-ac), LD (with ac), SD and VD.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+