స్పెషల్ ఎడిషన్ స్విఫ్ట్ ఎస్ఈని విడుదల చేసిన సుజుకి

By Ravi

మారుతి సుజుకి ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను దాని మాతృ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ గ్లోబల్ మార్కెట్లోలో విభిన్న రూపాల్లో విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. సుజుకి ఆఫర్ చేస్తున్న 5-డోర్ వెర్షన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను అక్కడి మార్కెట్లకు పరిచయం చేసింది. జపాన్ మార్కెట్లో సుజుకి ఇటీవల విడుదల చేసిన స్విఫ్ట్ స్పోర్ట్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ 'స్విఫ్ట్ ఎస్ఈ' (స్పెషల్ ఎడిషన్)ను కంపెనీ గ్లోబల్ మార్కెట్స్‌కు పరిచయం చేసింది.

సాధారణ సుజుకి స్విఫ్ట్‌తో పోల్చుకుంటే సుజుకి స్విఫ్ట్ ఎస్ఈ మరిన్ని అదనపు ఫీచర్లతో పాటుగా, ఆకర్షనీయమైన డిజైన్‌ను కూడా కలిగి ఉండనుంది. స్టయిలిష్ లుక్‌నిచ్చేందుకు జోడించిన 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ కోటింగ్ కలిగిన డోర్ హ్యాండిల్స్, సరికొత్త ఫాగ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లతో రూపొందించిన సుజుకి స్విఫ్ట్ ఎస్ఈని కంపెనీ దక్షిణాఫ్రికా మార్కెట్లో విడుదల చేసింది. సిల్వర్ కలర్ బాడీ పెయింట్, బాడీ పెయింట్‌కు తగినట్లుగా సిల్వర్ కలర్ ఇంటీరియర్స్ వంటి డిజైన్ థీమ్‌తో దీనిని తయారు చేయటం జరిగింది.


ఇంకా ఇందులో టాప్ ఎండ్ కార్లలో ఉండేటటువంటి కొన్ని ప్రీమియం ఫీచర్లను కూడా జోడించారు. లెథర్‌తో కప్పబడిన స్టీరింగ్ వీల్, సిల్వర్ స్టిచింగ్, యూఎస్‌బి, శాటిలైట్ నావిగేషన్‌తో కూడిన మల్టీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇంజన్ విషయానికి వస్తే.. సుజుకి స్విఫ్ట్ ఎస్ఈలో 1.4 లీటర్ కె14బి పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు (మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో కూడా ఇదే ఇంజన్‌ను ఉపయోగించారు). ఇది గరిష్టంగా 94 బిహెచ్‌పిల శక్తిని, 130 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

అయితే, ఈ పవర్‌ఫుల్ స్పెషల్ ఎడిషన్ సుజుకి స్విఫ్ట్‌ను మారుతి సుజుకి భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశాలు కనిపించడం లేదు. దీనికి బదులు మరింత పవర్‌ఫుల్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను కోరుకునే వారి కోసం కంపెనీ ప్రస్తుతం మన మార్కెట్లో లభిస్తున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లోనే 1.2 లీటర్ పెట్రోల్‌కు బదులు 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను పరిచయం చేయవచ్చు. మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Monday, November 5, 2012, 17:29 [IST]
English summary
Japanese carmaker Suzuki Motor Corporation has launched another special edition of its popular hatchback, Swift. The new Suzuki Swift SE takes design hints from the recently launched new Swift Sport.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+