పవర్‌ఫుల్ రెక్స్టన్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన శాంగ్‌యాంగ్

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) స్వాధీనం చేసుకున్న కొరియన్ కంపెనీ శాంగ్‌యాంగ్ కొత్త ఇంజన్‌తో కూడిన సరికొత్త రెక్స్టన్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. కొరియాలో ఇటీవల జరిగిన 2012 బుసాన్ మోటార్ షోలో శాంగ్‌యాంక్ శక్తివంతమైన 'రెక్స్టన్ డబ్ల్యూ' ఎస్‌యూవీని ఆవిష్కరించింది. రెక్స్టన్ డబ్ల్యూ ఎస్‌యూవీ మూడవ తరానికి చెందినది.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న 'రెక్స్టన్ 2' రెండవ తరానికి చెందినది. ఇటు ఆన్-రోడ్, అటు ఆఫ్-రోడ్ డ్రైవింగ్ పెర్ఫామెన్స్‌లో అన్నివిధాల మెరుగ్గా ఉండేలా ఈ సరికొత్త రెక్స్టన్ డబ్ల్యూ ఎస్‌యూవీని శాంగ్‌యాంగ్ రూపొందించింది. మెరుగైన మైలేజ్, ధృఢమైన పెర్ఫామెన్స్, సౌకర్యవంతమైన ఇంటీరియర్స్ వంటి అంశాలను ప్రధానంగా చేసుకొని రెక్స్టన్ డబ్ల్యూ ఎస్‌యూవీని శాంగ్‌యాంగ్ అభివృద్ధి చేసింది.


రెక్స్టన్ డబ్ల్యూ ఎస్‌యూవీని అభివృద్ధి చేయడానికి రెండున్నరేళ్ల సమయం పట్టిందని, ఇందుకు గానూ 130 బిలియన్ డాలర్లను ఖర్చు చేశామని కంపెనీ పేర్కొంది. రెక్స్టన్ డబ్ల్యూ అంటే వర్క్ ఆఫ్ ఆర్ట్ (డబ్ల్యూ అక్షరం సూచకంగా)తో కూడిన కొత్త ప్రీమియం ఎస్‌యూవీ అని అర్థమని శాంగ్‌యాంగ్ వివరించింది. రెక్స్టన్ డబ్ల్యూలో ఉపయోగించిన ఆ-ఎక్స్‌డిఐ200 ఎల్ఈటి (లో ఎండ్ టార్క్) డీజిల్ ఇంజన్ అధిక మైలేజీనిస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ ఇంజన్‌ 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది గరిష్టంగా 155 పిఎస్‌ల శక్తిని, 36.7 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది లీటర్‌కు 13.7 కి.మీ. మైలేజీనిస్తుంది. ఇంకా ఇందులో ఈఎస్‌పి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), ఏఆర్‌పి (యాక్టివ్ రోల్ ఓవర్ ప్రోగ్రామ్) టిపిఎమ్ఎస్ (టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్), యూడబ్ల్యూఎస్ (ఆల్ట్రాసోనిక్ వార్నింగ్ సిస్టమ్) వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఆటో షోలో మొత్తం 18 కార్లను శాంగ్‌యాంగ్ ప్రదర్శనకు ఉంచింది. మహీంద్రా గ్లోబల్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ500 మోడల్‌ను కూడా ఈ షోలో ప్రదర్శనకు ఉంచారు.

More from DriveSpark

Article Published On: Saturday, May 26, 2012, 15:37 [IST]
English summary
Mahindra owned South Korean automaker, Ssangyong Motor unveiled the new facelift Rexton flagship SUV at the 2012 Busan Motor Show. The new Rexton sports modern and sophisticated style with the improved on and off road driving performance of an authentic SUV. The Rexton is equipped with Korean-type diesel engine, e-XDi200 LET with performance of 155 ps and fuel efficiency of 13.7 km/litre.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+