సన్ ఫిల్మ్‌లపై నిషేధంతో షాక్‌లో పడిన పరిశ్రమ

భద్రతా కారణాల దృష్ట్యా ఆటోమొబైల్ వాహనాల్లో అద్దాలపై ఉపయోగించి నల్లటి ఫిల్ములపై (సన్ ఫిల్మ్స్) సుప్రీం కోర్టు నిషేధం విధించడంతో సుమారు రూ.150 కోట్ల విలువైన ఈ పరిశ్రమకు భారీ షాక్ తగిలేలా చేసింది. సాధారణంగా సూర్యుడి నుండి వెలువడే అతినీలలోహిత కాంతి కిరణాలు కారు లోపలకి ప్రవేశించకుండా ఉండేందుకు, కారులో ఏసి మరింత ఉత్తమ పనితీరును కనబర్చేందుకు కార్లకు సన్‌ ఫిల్ములను ఉపయోగించడం జరుగుతుంది.

అయితే, దీనిని అదునుగా చేసుకున్న దుండగులు, సంఘ విద్రోహ కార్యకలాపాల కోసం ఈ నల్లటి ఫిల్ములు ఉండే వాహనాలను ఉపయోగిస్తుండటం ఎక్కువ అవుతుండటంతో వీటిపై పూర్తిగా నిషేధం విధించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. మార్కెట్లో సన్‌ ఫిల్మ్‌ల ధర రూ.700 నుండి ప్రారంభమవుతుంది. వాస్తవానికి కొత్త కారును తయారు చేసేటప్పుడు తయారీదారులు చ్టటపరమైన నిబంధనలకు లోబడి కారు అద్దాలకు టింట్‌ చేస్తారు.

అయితే, కొనుగోలుదారులు తమ ఇష్టానుసారంగా, ఎక్కువ నలుపు రంగు కలిగిన సన్ ఫిల్మ్‌లను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఇలా అక్రమ సన్ ఫిల్మ్‌లు కలిగిన వానాలు చాలానే ఉన్నాయి. సుప్రీం కోర్టు తాజా ఆదేశాల మేరకు, అధిక నలుపు రంగు కలిగిన సన్‌ఫిల్మ్‌లను ఉపయోగించిన కార్లన్నీ కూడా తక్షణమే తమ కార్ల నుండి సన్‌ ఫిల్మ్‌లను తొలగించాల్సి ఉంటుంది. అలా కాకుండా, సన్‌ ఫిల్మ్‌లతోనే వాహనాన్ని నడిపినట్లయితే, తప్పు చేసిన వారు ఎవరైనా సరే జరిమానా కట్టక తప్పదు.

ప్రస్తుతం ఈ నిబంధన మే 4వ తేదీ నుండి న్యూఢిల్లీ అమలులోకి రాగా.. మే 19వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. ఏదేమైనప్పటికీ, సన్‌ ఫిల్మ్‌ను సడెన్‌గా బ్యాన్ చేయటం అనేది ఈ వ్యాపారాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న వ్యాపారస్తులపై కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పవచ్చు.

సన్ ఫిల్ముల వాడకం గురించి మోటార్ వాహన చట్టం ఏం చెబుతోంది..?
మోటార్ వాహన చట్టం ప్రకారం, కారు విండ్‌స్క్రీన్స్ (ముందు వైపు అద్దం), రియర్ విండో (వెనుక వైపు అద్దం) లపై 70 శాతం విజువల్ లైట్ ట్రాన్స్‌మిషన్ (విఎల్‌టి)ను, కారుకు పక్కల ఉండే అద్దాలకు (కారు డోర్లకు అమర్చిన అద్దాలు) 50 విఎల్‌టిని కలిగి ఉండాలి. సాధారణంగా కంపెనీలు తయారు చేసే అద్దాలు (ఫ్యాక్టరీ ఫిట్టెడ్ గ్లాసెస్) ఈ నియమాన్ని పాటించే తయారు చేయటం జరుగుతుంది.

ఈ నిబంధనను ఉల్లంఘిస్తే చర్యలు ఏంటి..?
ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేసేటప్పుడు పరిమితులకు మించి టింట్ చేయబడి ఉన్న సన్ ఫిల్ములను ఉపయోగించినట్లు గుర్తిస్తే మొదటి తప్పుగా రూ.100 జరిమానాను, రెండవ తప్పుగా రూ.300 జరిమానాను విధించటం జరుగుతుంది. అంతేకాకుండా, ఆన్‌-ది-స్పాట్‌లోనే సన్‌ ఫిల్మ్‌లను తొలగించే అధికారం కూడా పోలీసులకు ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, May 7, 2012, 16:10 [IST]
English summary
The Supreme Court has banned the use of sun films the car windows completely. This new rule comes as a shock to the Rs 150-crore industry that could close down. According to the motor vehicle rules, a car's windscreen and rear glass should have 70 per cent light transmittance and reflectance, whereas the window panes should have 50 per cent light reflectance.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+