లీటరుకు 29 కి.మీ. మైలేజీనిచ్చే సుజుకి వ్యాగన్ఆర్

పెట్రోల్ ధరలు భగ్గుమంటున్న నేటి రోజుల్లో వాహన కొనుగోలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది అధిక మైలేజీనిచ్చే కార్లకే. వాస్తవానికి డీజిల్ కార్లతో పోల్చుకుంటే పెట్రోల్ కార్ల మైలేజ్ తక్కువగా ఉంటుంది. కానీ ఈ వ్యాగన్ఆర్ కారు మాత్రం లీటర్ పెట్రోల్‌కు 29 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. అయితే, ఇది మామూలు వ్యాగన్ఆర్ కాదు. ఇది వ్యాగన్ఆర్ హైబ్రిడ్ వెర్షన్.

జపనీస్ కార్ మేకర్ సుజుకి మోటార్ కార్పోరేషన్ వ్యాగన్ఆర్ హైబ్రిడ్ కారును తయారు చేసింది. ఇందుకోసం కంపెనీ అభివృద్ధి చేసిన 'ఈఎన్ఈ-చార్జ్' అనే పేటెంటెడ్ టెక్నాలజీని ఉపయోగించింది. పెట్రోల్ ఇంజన్ మరియు బ్యాటరీ పవర్‌లతో పనిచేసే ఈ వ్యాగన్ఆర్ హైబ్రిడ్ వెర్షన్ లీటర్ పెట్రోల్‌కు 28.8 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపనీ పేర్కొంది.

జపాన్‌లో ఆవిష్కరించిన వ్యాగన్ఆర్ హైబ్రిడ్ వెర్షన్ కారులో లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేసే ఎలక్ట్రిక్ మోటార్, పెట్రోల్ ఇంజన్‌లను ఉపయోగించారు. ఈ రెండి సాయంతో అత్యధిక మైలేజీని పొందవచ్చని సుజుకి పేర్కొంది. అంతేకాకుండా, ఇందులో 'ఎకో-కూల్' అనే ఎనర్జీ సేవింగ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ కూడా ఇంది. మైలేజ్‌ పెరగడానికి ఇది కూడ ఒక ప్రధాన కారణం. ఈ హైబ్రిడ్ వెర్షన్ వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌ను ఉత్పత్తి స్థాయికి తీసుకువచ్చే విషయాన్ని కంపెనీ స్పష్టం లేదు. ఏదేమైనప్పటికీ, నానాటికీ పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో ఇలాంటి హైబ్రిడ్ కార్ల అవసరం ఎంతైనా ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 11, 2012, 15:42 [IST]
English summary
Japanese car maker Suzuki Motor Corporation has recently showcaed a hybrid version of the Wagon R in Japan with a patented technology called ‘ENE-CHARGE’. Company claims tha Hybrid Wagon R can deliver up to 28.8kmpl.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+