సరికొత్త 2013 వ్యాగన్ఆర్‌ను ఆవిష్కరించిన సుజుకి

By Ravi

మారుతి సుజుకి అందిస్తున్న బుజ్జి కారు 'వ్యాగన్ఆర్' ఇప్పుడు కొత్త అవతారమెత్తింది. మారుతి సుజుకి మాతృ సంస్థ అయిన సుజుకి మోటార్ కార్పోరేషన్ వ్యాగన్ఆర్ సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను గ్లోబల్ మార్కెట్‌కు పరిచయం చేసింది. పాత వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌తో పోల్చుకుంటే కొత్త వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌లో డిజైన్ పరంగాను, ఫీచర్ల పరంగాను అనేక మార్పులు ఉన్నాయి.

స్మాల్ బాక్సీ షేప్‌లో ఉండే ఈ 2012 సుజుకి వ్యాగన్ఆర్ రెండవ తరానికి చెందినది. ఇది చూడటానికి మినీ వ్యాన్‌లా ఉన్నప్పటికీ, ఇందులో సాధారణ కార్లలో అన్ని సౌకర్యవంతమైన ఫీచర్లు ఉంటాయి. లాంగ్ రైడ్‌లకు సౌకర్యవంతంగా ఉండేలా సీటింగ్, విశాలమైన హెడ్‌రూమ్ అండ్ లెగ్‌రూమ్, వెనుక వరుసలో విశాలమైన సీట్లు ఉన్నాయి. అవసరం లేదనుకుంటే వెనుక సీట్లను మడిచిపెట్టి, ఆ స్థలాన్ని లగేజ్ స్పేస్ కోసం వాడుకోవచ్చు.

సరికొత్త లుక్‌తో స్టయిలిష్ వ్యాగన్ఆర్

సరికొత్త లుక్‌తో స్టయిలిష్ వ్యాగన్ఆర్

పాత వెర్షన్ జపనీస్ వ్యాగన్ఆర్‌తో పోల్చుకుంటే, 2013 వ్యాగన్ఆర్‌లో పెద్ద హెడ్‌ల్యాంప్స్, పెద్ద ఎయిర్-డ్యామ్స్, ఆకర్షనీయమైన లుక్ కలిగిన ఫ్రంట్ గ్రిల్‌ను గమనించవచ్చు.

చిన్న కారు.. పెద్ద వండర్..

చిన్న కారు.. పెద్ద వండర్..

2013 వ్యాగన్ఆర్‌లో సరికొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్, స్పోర్టీ రియర్ స్పాయిలర్, బాడీ కలర్డ్ సైడ్ మిర్రర్స్, బాడీ కలర్డ్ బంపర్స్, బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్‌లు చెప్పుకోదగిన మార్పులు. కొత్త వ్యాగన్ఆర్ వెనుకవైపు గమనిస్తే, రీడిజైన్ చేయబడిన టెయిల్ ల్యాంప్స్, రియర్ బంపర్, రూఫ్ స్పాయిలర్, రియర్ వైపర్‌లను గమనించవచ్చు.

2012 సుజుకి వ్యాగన్ఆర్ ఇంటీరియర్స్

2012 సుజుకి వ్యాగన్ఆర్ ఇంటీరియర్స్

2013 వ్యాగన్ఆర్ ఇంటీరియర్స్‌ను గ్లోబల్ కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని తీర్చిదిద్దటం జరిగింది. గ్రే కలర్‌లో విశాలమైన ఇంటీరియర్స్, పెద్ద గ్లాస్ విండోస్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్, ఇంజన్ స్టార్ట్-స్టాప్ బటన్, ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్ వంటి సౌకర్యవంతమైన ఫీచర్లను గమనించవచ్చు.

స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్

స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్

సిల్వర్ బ్లాక్ కలర్ కాంబినేషన్‌లో కూడిన స్టయిలిష్ 3-స్పోక్ స్టీరింగ్ వీల్, దానిపై అమర్చిన ఆడియో కంట్రోల్స్, లోపలి వైపు డోర్లకు అమర్చిన క్రోమ్ డోర్ హ్యాండిల్స్‌, డ్యాష్‌బోర్డ్‌పై బ్లాక్ సిల్వర్ ఫినిష్ మార్పులను చూడొచ్చు.

ఇంజన్ స్టార్ట్ - స్టాప్ ఆప్షన్

ఇంజన్ స్టార్ట్ - స్టాప్ ఆప్షన్

సరికొత్త వ్యాగన్‌ఆర్‌లో ఇంజన్ స్టార్ట్ - స్టాప్ ఆప్షన్ ఉంది. డ్యాష్ బోర్డుపై అమర్చిన ఈ బటన్‌ను నొక్కటం ద్వారా ఇంజన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు.

సరికొత్త డ్యాష్‌బోర్డ్

సరికొత్త డ్యాష్‌బోర్డ్

సిల్వర్ గ్రే కలర్ కాంబినేషన్‌తో కూడిన డ్యాష్‌బోర్డ్ ఈ కొత్త కారులో మరొక చెప్పుకోదగిన మార్పు.

ఫోల్డబల్ రియర్ సీట్స్

ఫోల్డబల్ రియర్ సీట్స్

అవసరం లేదనుకున్నప్పుడు వెనుక వైపు సీట్లను విడగొట్టి, ఆ స్థలాన్ని లగేజ్ స్పేస్ కోసం వాడుకోవచ్చు.


2013 వ్యాగన్ఆర్ పాత జనరేషన్ వ్యాగన్ఆర్ కన్నా తేలికైనది మరియు మెరుగైనది. కొత్త వ్యాగన్ఆర్ కేవలం 780-870 కిలోల బరువును మాత్రమే కలిగి ఉండి, మైలేజ్‌ పెరగడంలో సహకరిస్తుంది. ఇందులో 660సీసీ, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. సాధారణ వెర్షన్‌లో ఈ ఇంజన్ గరిష్టంగా 52 బిహెచ్‌పిల శక్తిని, టర్బోఛార్జ్‌డ్ వెర్షన్‌లో 64 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది. (ఈ సెగ్మెంట్లోని టాటా నానో ఇంజన్ శక్తి కన్నా ఇది అధికం). కొత్త 2013 వెర్షన్ వ్యాగన్ఆర్ లీటర్ పెట్రోల్‌కు 25-28 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.

ఇన్ని విశిష్ట ఫీచర్లు కలిగిన 2013 సుజుకి వ్యాగన్ఆర్ ధర జపనీస్ కరెన్సీలో 11,09,850 యెన్‌లు. అదే మన దేశ కరెన్సీలో అయితే సుమారు రూ.8 లక్షలు అన్నమాట. గడచిన జవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి ఇలాంటి కొన్ని కీ (Kei) కార్లను ప్రదర్శనకు ఉంచుంది. చిన్న కార్లకు పెద్ద డిమాండ్ ఉండే మనలాంటి మార్కెట్లో ఇలాంటి కార్లు మంచి సక్సెస్‌ను సాధించడం ఖాయం. మరి ఈ స్టయిలిష్ స్మాల్ ఇంజన్డ్ వ్యాగన్ఆర్ కారును మారుతి సుజుకి భారత మార్కెట్లో విడుదల చేస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, September 10, 2012, 12:35 [IST]
English summary
Japanese car major Suzuki Motor Co has recently revealed the 2012 Wagon R hatchback in Japan. The second generation 2013 Suzuki Wagon R is powered by 660cc 3 cylinder, petrol engine and boost so many unique features in its segment. Have a detailed look it here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+