మాస్కోలో మెరిసిన సరికొత్త సుజుకి గ్రాండ్ విటారా

భారత్‌లో మారుతి సుజుకి నుంచి అంతంత మాత్రంగా అమ్మడవుతున్న ఎస్‌యూవీ గ్రాండ్ విటారాలో ఓ రిఫ్రెష్డ్ వెర్షన్‌ను కంపెనీ మాతృ సంస్థ జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ మాస్కోలో ఆవిష్కరించింది. మాస్కోలో జరుగుతున్న అంతర్జాతీయ మోటార్ షోలో సుజుకి ఈ సరికొత్త అప్‌గ్రేడెడ్ గ్రాండ్ విటారా ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ రిఫ్రెష్డ్ వెర్షన్ ఎస్‌యూవీ సరికొత్త ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫీచర్లను కలిగి ఉంది.

మరింత శక్తివంతమైన, స్పోర్టీ లుక్‌తో ఫ్రంట్ డిజైన్, కొత్త హెడ్‌లైట్స్, రిఫ్రెష్డ్ ఫ్రంట్ బంపర్, క్రోమ్ సైడ్ మౌల్డింగ్స్, 8-స్పోక్ 17 ఇంచ్ అల్యూమినియం అల్లాయ్ వీల్స్ (లేదా ఆప్షనల్ 10-స్పోక్, 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్)తో ఇది మొత్తం 9 ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది. ఇది 5-డోర్ (ఏషియన్ మార్కెట్ల కోసం), 3-డోర్ (యూరప్ మార్కెట్ల కోసం) వెర్షన్లలో లభ్యమవుతుంది.

ఫైవ్-డోర్, త్రీ-డోర్ వెర్షన్ గ్రాండ్ విటారాలలో ఉపయోగించిన కొత్త ఫ్యాబ్రిక్ స్పోర్టీ ఇంటీరియర్ డిజైన్ లుక్‌ని అందిస్తుంది. గ్రాండ్ విటారా తొలిసారిగా 1998లో ఎస్కుడో అనేపేరుతో జపాన్‌లో విడుదలైంది. అప్పట్లో ప్రపంచంలోకెల్లా ఇదే మొదటి కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్. ఫోర్-వీల్ డ్రైవ్‌‌తో లభించే గ్రాండ్ విటారా రగ్గడ్ పెర్ఫామెన్స్‌ను కలిగి ఉండి ఆఫ్-రోడింగ్ అడ్వెంచర్లకు అనువుగా ఉంటుంది.


ప్రస్తుతం మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లో అందిస్తున్న గ్రాండ్ విటారా ఎస్‌యూవీని సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్‌లో విదేశాల్లో పూర్తిగా తయారైన కారును ఇండియాకు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తోంది. అధిక దిగుమతి సుంఖాల కారణంగా, దీని ధర కూడా కాస్తంత అధికంగానే ఉంది. అయితే, భారత ఎస్‌యూవీ సెగ్మెంట్లో పోటీ పెరుగుతండటంతో పాత మోడల్ స్థానంలో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది.

అంతేకాకుండా.. ఈ ఎస్‌యూవీ ధరను అందుబాటులో ఉంచేందుకు గాను దీనిని ఇక్కడి మార్కెట్లో అసెంబ్లింగ్ చేయాలని కూడా మారుతి సుజుకి యోచిస్తోంది. ఇదే గనుక జరిగితే సుజుకి గ్రాండ్ విటారా ధర తగ్గి ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇతర కార్ మేకర్లకు గట్టి పోటీనిచ్చే ఆస్కారం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న గ్రాండ్ విటారా ఎక్స్-షోరూమ్, హైదరాబాద్ ధరలు ఈ విధంగా ఉన్నాయి:

* గ్రాండ్ విటారా (మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) - రూ. 23.83 లక్షలు
* గ్రాండ్ విటారా (ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్) - రూ. 25.83 లక్షలు

సరికొత్త అప్‌గ్రేడెడ్ సుజుకి గ్రాండ్ విటారా త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి కూడా ప్రవేశించనుంది. R కొత్త సుజుకి గ్రాండ్ విటారాలో సరికొత్త ఫ్రంట్ డిజైన్, రీడిజైన్ చేయబడిన గ్రిల్ (హనీకోంబ్ డిజైన్ కలిగిన గ్రిల్), బంపర్, 4-వీల్ డ్రైవ్ ఆప్షన్, ఆఫ్-రోడ్ డ్రైవింగ్ విభిన్న డ్రైవింగ్ మోడ్స్ వంటి అనేక మార్పులతో ఇది లభ్యమవుతుంది. ఇందులో అమర్చిన 2.4 లీడర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 165 పిఎస్‌ల శక్తిని, 225 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 30, 2012, 17:08 [IST]
English summary
Suzuki Motor Corporation has enhanced the Grand Vitara and made it even more appealing with new interior and exterior design features. The SUV expected to be launched in India later this year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+