సఫారీ స్టోర్మ్‌తో తుఫాన్ సృష్టించనున్న టాటా మోటార్స్

ఎస్‌యూవీ సెగ్మెంట్లో తుఫాన్ సృష్టించేందుకు టాటా మోటార్స్ తమ సఫారీతో సిద్ధంగా ఉంది. గడచిన జనవరిలో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించిన సరికొత్త టాటా సఫారీ స్టోర్మ్ ఈ పండుగ సీజన్‌లో ఎస్‌యూవీ ప్రియులను ఆకర్షించనుంది. సరికొత్త స్టయిల్, స్టన్నింగ్ లుక్, పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్‌లతో తీర్చిదిద్దిన సరికొత్త టాటా సఫారీ స్టోర్మ్ దీపావళి కానుకగా మార్కెట్లోకి రానుంది.

మరి ఈ టాటా సఫార్ స్టోర్మ్ ఎస్‌యూవీ హైలైట్స్ ఏంటో ఓ లుక్కేయండి..

టాటా ఆరియా క్రాసోవర్‌లో ఉపయోగించే ఛాస్సిస్‌ను టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీలో కూడా ఉపయోగించారు. దీంతో ఇది క్రితం సఫారీ కన్నా మెరుగైన డ్రైవింగ్ డైనమిక్స్‌ను ఆఫర్ చేస్తుంది.

ఎక్స్టీరియర్స్:
టాటా సఫారీ స్టోర్మ్‌లో సాధారణ హ్యాలోజెన్ బల్బులతో పాటు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌తో లభిస్తుంది. దీని వెనుకవైపు రెండు సైలెన్సర్స్ ఉంటాయి. ఇది ఆల్-రౌండ్ డిస్క్ బ్రేక్స్‌తో లభిస్తుంది. స్పేర్ వీల్‌ను ఇదివరకటి సఫారీలో వెనుక డోర్‌కు అమర్చినట్లు కాకుండా, బూట్‌కు క్రింది భాగంలో అమర్చబడి ఉంటుంది.

ఇంటీరియర్స్:
టాటా సఫారీ స్టోర్మ్‌ ఎస్‌యూవీలో ఆరియా నుంచి సేకరించిన రోటరీ టైప్ హెడ్‌ల్యాంప్ స్విచ్ ఉంటుంది. ప్రస్తుతం సఫారీతో పోల్చుకుంటే కొత్త సఫారీ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కొత్త సఫారీలో ఏసి అన్నివైపులకు ప్రసరించే వీలుంటుంది. రెండవ వరుసలో ప్రయాణికుల కోసం రూఫ్‌పై ఏర్పాటు చేసిన ఏసి వెంట్, చివరి వరుసలో ప్రయాణికుల కోసం పిల్లర్స్‌పై ఏర్పాటు చేసిన ఏసి వెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

ఇంకా క్రోమ్ కోటింగ్ కలిగిన డోర్ హ్యాండిల్స్, నాణ్యమైన ప్లాస్టిక్ ఇంటీరియర్స్, యాంత్రికంగా నియంత్రించబడే కొత్త రియర్ వ్యూ మిర్రర్స్, రిమోట్ కంట్రోల్డ్ కీ, థియేటర్ డిమ్మింగ్ లైట్స్, 60:40 నిష్పత్తిలో మడిచిపెట్టే వీలున్న ఫోల్డబిల్ రియర్ సీట్ బూట్‌లో లగేజ్ నెట్ వంటి ఫీచర్లు కొత్త టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీ సొంతం.

పవర్ అండ్ పెర్ఫామెన్స్:
టాటా సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీ 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇంకా ఇందులో ఉపయోగించిన 2.2-లీటర్ 16-వాల్వ్ కామన్ రైల్ (డైకార్) ఇంజన్‌ 140 పిఎస్‌ల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది చాలా తక్కువ ఎన్‌విహెచ్ (నాయిస్, వైబ్రేషన్, హార్ష్‌నెస్) స్థాయిని కలిగి ఉంటుంది. దీని ఇంజన్ మంచి లో-ఆర్‌పిఎమ్ పెర్ఫామెన్స్‌ను కలిగి ఉంటుది. ఇంకా ఉత్తమ సస్పెన్షన్, షార్ప్ బ్రేక్స్‌ను కలిగి ఉంటుంది.

ఈ సెగ్మెంట్లోకి కొత్తగా వచ్చిన మహీంద్రా ఎక్స్‌యూవీ500, రెనో డస్టర్ వంటి ఎస్‌యూవీలకు టాటా సఫారీ స్టోర్మ్ గట్టి పోటీ ఇవ్వనుంది. భారత మార్కెట్లో టాటా సఫారీ స్టోర్మ్ ధర రూ.9 లక్షల నుండి 12 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Monday, August 20, 2012, 16:12 [IST]
English summary
Tata Safari Storme SUV is expected to hit the Indian roads in this festive season. The new Safari has an all-new styling and comes with a host of new features and specifications. The 4-wheel drive Safari Storme is powered by a 2.2-liter 16-valve common rail (DiCOR) engine, which generates 140 PS power and 320 Nm torque. This engine will be mated to a 5-speed manual transmission.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+