రాష్ట్ర మార్కెట్లో సరికొత్త టాటా మాంజా క్లబ్ క్లాస్‌ విడుదల

పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని కొనుగోలుదారులకు కొత్తదనాన్ని అందించేందుకు గాను దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ టాటా మాంజా సెడాన్‌లో ఇటీవల విడుదల చేసిన క్లబ్ క్లాస్ ఎడిషన్‌ ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా లభ్యం కానుంది. టాటా మాంజా క్లబ్ క్లాస్‌ను కంపెనీ శుక్రవారం రాష్ట్ర మార్కెట్లో విడుదల చేసింది. ఇదవరకటి టాటా మాంజాతో పోల్చుకుంటే ఈ కొత్త ఆరు ఆదనపు ఫీచర్లతో లభ్యమవుతుంది.

హైదరాబాద్‌లో సఫైర్ పెట్రోల్ వెర్షన్ టాటా మాంజా క్లబ్ క్లాస్ ప్రారంభ ధర రూ. 5.65 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్‌)గా ఉండగా క్వాడ్రాజెట్ డీజిల్ వెర్షన్ టాటా మాంజా క్లబ్ క్లాస్ ప్రారంభ ధర రూ. 6.44 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్‌)గా ఉన్నాయి. ప్రతి నెలా సగటను 2,000 యూనిట్ల టాటా మాంజా కార్లను విక్రయిస్తున్నామని, కొత్తగా మార్కెట్లోకి తీసుకువచ్చిన టాటా మాంజా క్లబ్‌ క్లాస్‌‌తో ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది.

టాటా మాంజా క్లబ్ క్లాస్ ఫీచర్లు:

టాటా మాంజా క్లబ్ క్లాస్ ఫీచర్లు:

* శ్రేణిలో కెల్లా ఉత్తమమైన క్యాబిన్‌ స్పేస్

* విలాసవంతమైన ఇంటీరియర్స్

* రిచ్ ఇటాలియన్ లెథర్ సీట్స్

* పూర్తి ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్

* ఇన్-బిల్ట్ జిపిఎస్‌తో కూడిన టచ్‌స్క్రీన్ మల్టీ-మీడియా ఇంటర్‌ఫేస్

* కాంట్రాస్ట్ రూఫ్

* 8 స్ప్లిట్-స్పోక్ అల్లాయ్ వీల్స్

టాటా మాంజా క్లబ్ క్లాస్‌ మైలేజ్:

టాటా మాంజా క్లబ్ క్లాస్‌ మైలేజ్:

టాటా మాంజా క్లబ్ క్లాస్‌లో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన 90 పిఎస్ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్‌, సఫైర్ పెట్రోల్ ఇంజన్లను ఉపయోగించారు. క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్‌ లీటర్ డీజిల్‌కు 21.02 కి.మీ. మైలేజీని, సఫైర్ పెట్రోల్ ఇంజన్ లీటర్ పెట్రోల్‌కు 13.7 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

టాటా మాంజా క్లబ్ క్లాస్‌ సేఫ్టీ, సెక్యూరిటీ ఫీచర్లు:

టాటా మాంజా క్లబ్ క్లాస్‌ సేఫ్టీ, సెక్యూరిటీ ఫీచర్లు:

కొలాప్సబల్ స్టీరింగ్ కాలమ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంజన్ ఇమ్మొబిలైజర్, సెంట్రల్ లాకింగ్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు కారు భద్రతకు మరింత సురక్షితను చేకూర్చి పెడుతాయి.

టాటా మాంజా క్లబ్ క్లాస్‌ కలర్స్, వేరియంట్స్:

టాటా మాంజా క్లబ్ క్లాస్‌ కలర్స్, వేరియంట్స్:

టాటా మాంజా క్లబ్ క్లాస్ ఇన్ఫినిటీ బ్లాక్ (కొత్త కలర్), టైరియాన్ వైన్, లేజర్ రెడ్, క్యాస్టల్ గ్రే, డ్యూ వైట్ మరియు జెట్ సిల్వర్ అనే ఆరు ఆకర్షనీయమైన రంగులలో ఎల్ఎస్, ఎల్ఎక్స్, విఎక్స్, ఈఎక్స్ఎల్ (లెథర్ వేరియంట్) అనే ఐదు వేరియంట్లలో లభ్యమవుతుంది.

టాటా మాంజా క్లబ్ క్లాస్‌ ధరలు:

టాటా మాంజా క్లబ్ క్లాస్‌ ధరలు:

సఫైర్ పెట్రోల్ వెర్షన్ టాటా మాంజా క్లబ్ క్లాస్ ప్రారంభ ధర రూ. 5.65 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్‌)గా ఉండగా క్వాడ్రాజెట్ డీజిల్ వెర్షన్ టాటా మాంజా క్లబ్ క్లాస్ ప్రారంభ ధర రూ. 6.44 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్‌)గా ఉంది.

టాటా మాంజా క్లబ్ క్లాస్‌ సర్వీసింగ్:

టాటా మాంజా క్లబ్ క్లాస్‌ సర్వీసింగ్:

టాటా మాంజా క్లబ్ క్లాస్ యజమానుల కోసం కంపెనీ ఓ ప్రత్యేక సర్వీస్ స్కీమ్‌ను ఆఫర్ చేస్తోంది. షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లలో టాటా మాంజా క్లబ్ క్లాస్ కార్లను అటెండ్ అయ్యేందుకు కంపెనీ డెడికేటెడ్ మేనేజర్లను అపాయింట్ చేసింది. ఈ కొత్త కారు 2 ఏళ్లు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీతో లభిస్తుంది (ఏది ముందుగా ముగిస్తే అది).

టాటా మాంజా క్లబ్ క్లాస్‌ స్టీరింగ్:

టాటా మాంజా క్లబ్ క్లాస్‌ స్టీరింగ్:

టాటా మాంజా క్లబ్ క్లాస్‌ స్టీరింగ్‌ 4-స్పోక్ డిజైన్‌ను కలిగి ఉండి, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్‌ను కలిగి ఉంటుంది.

టాటా మాంజా క్లబ్ క్లాస్‌ ట్రాన్సిమిషన్:

టాటా మాంజా క్లబ్ క్లాస్‌ ట్రాన్సిమిషన్:

టాటా మాంజా క్లబ్ క్లాస్‌‌లో అమర్చిన 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ స్మూత్ గేర్ ఛేంజింగ్ ఫీల్‌ను కలిగిస్తుంది. దీనిని మరింత సున్నింత హ్యాండ్లింగ్ చేసేందుకు గాను ఇది ప్రీమియం లెథర్‌తో కప్పబడి ఉంటుంది.


శ్రేణిలో కెల్లా ఉత్తమమైన క్యాబిన్‌ స్పేస్, విలాసవంతమైన ఇంటీరియర్స్, రిచ్ ఇటాలియన్ లెథర్ సీట్స్, పూర్తి ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, ఇన్-బిల్ట్ జిపిఎస్‌తో కూడిన టచ్‌స్క్రీన్ మల్టీ-మీడియా ఇంటర్‌ఫేస్, కాంట్రాస్ట్ రూఫ్, 8 స్ప్లిట్-స్పోక్ అల్లాయ్ వీల్స్ వంటి స్టయిలింగ్ ఫీచర్లు కొత్త టాటా మాంజా క్లబ్ క్లాస్ సొంతం. పాత టాటా మాంజా కారుతో పోల్చుకుంటే దీని ధర దాదాపు రూ.25,000 అధికంగా ఉంటుంది. షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లలో టాటా మాంజా క్లబ్ క్లాస్ కార్లను అటెండ్ అయ్యేందుకు కంపెనీ డెడికేటెడ్ మేనేజర్లను అపాయింట్ చేసింది. ఈ కొత్త కారు 2 ఏళ్లు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీతో లభిస్తుంది (ఏది ముందుగా ముగిస్తే అది).

More from DriveSpark

Article Published On: Saturday, October 27, 2012, 13:24 [IST]
English summary
Tata Motors has launched its new Manza Club Class sedan in Hyderabad. It is entirely a new class of car where unmatched luxury meets unrivalled performance. The Tata Manza Club Class comes with a first-in-class touchscreen multi-media interface with in-built GPS and Automatic Climate Control. The touchscreen brings GPS navigation, multi-media DVD player, Blu5 and other such functionalities all through a multi-colour 6.2 inch high resolution display at the touch of a finger.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+