ఇండికా ఈవి2 ధరను రూ.23,000 తగ్గించిన టాటా మోటార్స్
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ నుంచి లభిస్తున్న అత్యధిక మైలేజీనిచ్చే హ్యాచ్‌బ్యాక్ టాటా ఇండికా ఈవి2లో మరో సరికొత్త రిఫ్రెష్డ్ వేరియంట్‌ను కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది పాత వెర్షన్ కన్నా రూ.23,000 తక్కువ ధరను కలిగి ఉండటమే కాకుండా, మరిన్ని అదనపు ఫీచర్లను కలిగి ఉండనుంది. డ్యూయెల్ టోన్ హెడ్‌లాంప్స్, సరికొత్త ఫ్రంట్ బంపర్, స్టయిలిష్ స్పోర్టీ అల్లాయ్ వీల్స్, ట్రిపిల్-స్టెప్ క్రోమ్ టిప్పెడ్ గ్రిల్, అభివృద్ధి చేసిన స్టాప్ ల్యాంప్‌తో కూడిన సరికొత్త రియర్ స్పాయిలర్, ఆకర్షణీయమైన డెకాల్స్ వంటి ఫీచర్లు కొత్త ఇండికా ఈవి2 సొంతం.
దేశీయ విపణిలో సరికొత్త టాటా ఇండికా ఈవి2 కారు ధరలు రూ.4.01 లక్షల (బేస్ వేరియంట్) రూ.4.87 లక్షల (టాప్ ఎండ్) రేంజ్‌లో ఉన్నాయి. రెండు ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. డీజిల్ వెర్షన్ టాటా ఇండికా ఈవి2లో 1,396 సీసీ కామన్ రెయిల్ డీజిల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 70 పిఎస్‌లవ శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, లీటరు డీజిల్‌కు 25 కిలోమీటర్ల మైలేజినిస్తుందని కంపెనీ పేర్కొంది.

టాటా ఇండికా ఈవి2 - సీ బ్లూ
టాటా ఇండికా ఈవి2లో కంపెనీ విడుదల చేసిన ఈ సరికొత్త రిఫ్రెష్డ్ వెర్షన్ పాత వెర్షన్ కన్నా రూ.23,000 తక్కువ ధరను కలిగి ఉండటమే కాకుండా, మరిన్ని అదనపు ఫీచర్లను కలిగి ఉంది.

టాటా ఇండికా ఈవి2 - స్పైస్ రెడ్
కొత్త ఇండికా ఈవి2లో డ్యూయెల్ టోన్ హెడ్‌లాంప్స్, సరికొత్త ఫ్రంట్ బంపర్, స్టయిలిష్ స్పోర్టీ అల్లాయ్ వీల్స్, ట్రిపిల్-స్టెప్ క్రోమ్ టిప్పెడ్ గ్రిల్, అభివృద్ధి చేసిన స్టాప్ ల్యాంప్‌తో కూడిన సరికొత్త రియర్ స్పాయిలర్, ఆకర్షణీయమైన డెకాల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా ఇండికా ఈవి2 - నియో ఆరెంజ్
డీజిల్ వెర్షన్ టాటా ఇండికా ఈవి2లో 1,396 సీసీ కామన్ రెయిల్ డీజిల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 70 పిఎస్‌లవ శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, లీటరు డీజిల్‌కు 25 కిలోమీటర్ల మైలేజినిస్తుందని కంపెనీ పేర్కొంది.

టాటా ఇండికా ఈవి2 - జెట్ సిల్వర్
పెట్రోల్ వెర్షన్ టాటా ఇండికా ఈవి2లో 1,193 సీసీ ఎమ్‌పిఎఫ్ఐ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 65.3 పిఎస్‌లవ శక్తిని, 99.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా భారత్ స్టేజ్ 4 (బిఎస్4) కాలుష్య నిబంధనలు పాటిస్తాయి.

టాటా ఇండికా ఈవి2 - మింట్ వైట్
టాటా ఇండికా ఈవి2 సీ బ్లూ, స్పైస్ రెడ్, మింట్ వైట్, నియో ఆరెంజ్, జెట్ సిల్వర్ అనే ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది.

టాటా ఇండికా ఈవి2 - ధర
దేశీయ విపణిలో సరికొత్త టాటా ఇండియా ఈవి2 కారు ధరలు రూ.4.01 లక్షల (బేస్ వేరియంట్) రూ.4.87 లక్షల (టాప్ ఎండ్) రేంజ్‌లో ఉన్నాయి. రెండు ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ.
పెట్రోల్ వెర్షన్ టాటా ఇండికా ఈవి2లో 1,193 సీసీ ఎమ్‌పిఎఫ్ఐ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 65.3 పిఎస్‌లవ శక్తిని, 99.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా భారత్ స్టేజ్ 4 (బిఎస్4) కాలుష్య నిబంధనలు పాటిస్తాయి. ఈ కారు కోసం కంపెనీ ప్రత్యేక రుణ సదుపాయాన్ని కూడా ఆఫర్ చేస్తుంది. కేవలం రూ.50,000ల డౌన్‌పేమెంట్‌ను చెల్లించటం ద్వారా టాటా ఇండికా ఈవి2 హ్యాచ్‌బ్యాక్‌ను సొంతం చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.
టాటా ఇండికా ఈవి2లో కొత్తగా జోడించిన ఫీచర్లు:
* డ్యూయెల్ టోన్ హెడ్‌లాంప్స్
* సరికొత్త ఫ్రంట్ బంపర్
* ట్రిపిల్-స్టెప్ క్రోమ్ టిప్పెడ్ ఫ్రంట్ గ్రిల్
* మెటల్ స్ట్రిప్‌తో కూడిన బాడీ కలర్డ్ రియర్ వ్యూ మిర్రర్స్
* మెరుగైన డిస్క్ బ్రేక్స్‌తో కూడిన స్పోర్టీ అల్లాయ్ వీల్స్
* వెనుక వైపు హైమౌంట్ స్టాప్ ల్యాంప్‌తో కూడిన సరికొత్త రియర్ స్పాయిలర్,
* ప్రీమియం ఉడ్ ఫినిష్ కలిగిన సెంటర్ కన్సోల్
* ఆల్ పవర్ విండోస్
* సరికొత్త బ్లావ్‌పన్క్ట్ మ్యూజిక్ సిస్టమ్
* బ్లూటూత్ కెనక్టివిటీ
ఓ వైపు మారుతి సుజుకి, హోండా కార్స్, ఆడి ఇండియా వంటి కంపెనీలు తమ ఉత్పత్తులను ధరలు పెంచుతుంటే, టాటా మోటార్స్ మాత్రం తగ్గింపు ధరకే ఈ కారును ఆఫర్ చేస్తుండటం విశేషం. మంచి డీల్‌లో ఎక్కువ మైలేజ్‌ను ఆఫర్ చేసే టాటా కారును కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశంగా చెప్పవచ్చు. మరింకెందుకు ఆలస్యం.. మంచి తరుణం మించి పోకముందే మీ టాటా ఇండికా ఈవీ2 దక్కించుకోండి..!


Click it and Unblock the Notifications








