చవక ధర ఆరియాను విడుదల చేసిన టాటా మోటార్స్

By Ravi

టాటా మోటార్స్‌ అందిస్తున్న క్రాసోవర్ టాటా అరియాలో కంపెనీ ఇప్పుడు చవక వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. భారీ అంచనాలతో కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసిన టాటా ఆరియా అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగుతుండటంతో ఇందులో ఓ ప్రైస్ కట్ వెర్షన్‌ను టాటా మోటార్స్ తాజాగా మార్కెట్‌కు పరిచయం చేసింది. గతేడాది సరిగ్గా ఇదే నెలలో ఓ చవక రకం టాటా ఆరియా క్రాసోవర్ టూ-వీల్ డ్రైవ్ క్రాసోవర్‌ను కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది. అప్పట్లో దీని ధరలు రూ.11.79 లక్షల నుంచి రూ.14.49 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉన్నాయి.

అయితే, ప్రస్తుతం యుటిలిటీ వాహన సెగ్మెంట్లో కొత్తగా వస్తున్న మోడళ్లతో పోటీ మరింత పెరగడంతో టాటా ఆరియా క్రాసోవర్ ధరను, అలాగే ఫీచర్లను తగ్గించి ఓ కొత్త వేరియంట్‌ను కంపెనీ మార్కెట్‌‌కు పరిచయం చేసింది. ఇప్పటి వరకూ టాటా ఆరియా క్రాసోవర్ ప్యూర్, ప్లెజర్, ప్రెస్టీజ్ అనే మూడు వేరియంట్లలో లభ్యమవుతూ వచ్చేది. కాగా.. ఇందులో 'ప్యూర్ ఎల్ఎక్స్' అనే ఓ ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను కేవలం రూ. 9.95 లక్షలకే (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) టాటాట మోటార్స్ విడుదల చేసింది. టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్ వేరియంట్‌లో ఫీచర్ల కన్నా టాటా ఆరియా ప్యూర్ ఎల్ఎక్స్ వేరియంట్‌లో ఫీచర్లు తక్కువగా ఉండనున్నాయి.


అయితే, ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు లేవు. టాటా ఆరియా టూ-వీల్ డ్రైవ్ కారులో ఉపయోగించిన 2.2 లీటర్ డైరెక్ట్‌ ఇంజెక్షన్‌ కామర్‌ రైల్‌ డీజిల్ ఇంజిన్‌నే ఈ చవక వేరియంట్‌లోనూ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 140 పిఎస్‌‌ల శక్తిని, 320 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు డీజిల్‌కు 13.7 కి.మీ.మైలేజీనిస్తుంది. ఈ చవక టాటా ఆరియా (ప్యూర్ ఎల్ఎక్స్)లో బాడీ కలర్డ్ బంపర్స్, ప్రొజెక్టర్ హెచ్ఐడి ల్యాంప్స్, డిస్క్ బ్రేక్స్, కీలెస్ ఎంట్రీ, రియర్ ఏసి వెంట్స్ వంటి ఫీచర్లను యధావిధిగా ఉంచారు.

అయితే, ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌(ఈబిడి)తో కూడిన యాంటీలాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబిఎస్), ఫ్యాబ్రిక్ లేదా లెథర్ సీట్స్ (ఇది వినైల్ సీట్స్‌తో లభిస్తుంది), ఆడియో సిస్టమ్, రియర్ వాష్, వైపర్, డిఫాగ్గర్, ఫాలో మి హోమ్ హెడ్‌ల్యాంప్స్, రూఫ్ స్టోరేజ్ కాంపోనెంట్స్, బాడీ కలర్డ్ రబ్-స్ట్రిప్స్, క్రోమ్ ట్రీటెడ్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, లోవర్ ఎయిర్ డ్యామ్‌పై క్రోమ్ బార్డర్‌లను తొలగించారు. టాటా ఆరియా క్రాసోవర్ ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, October 20, 2012, 17:37 [IST]
English summary
Auto major Tata Motors has launched the stripped down variant of its premium crossover Tata Aria. The new stripped version of Tata Aria is named as Pure LX and it is available at the price of Rs. 9.95 lakh (ex-showroom New Delhi). The new Tata Aria Pure LX now comes with few more slashed features of its entry level 4×2 variant.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+