మరింత శక్తివంతమైన విస్టాను విడుదల చేసిన టాటా
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న పాపులర్ హ్యాచ్‌బ్యాక్ 'టాటా విస్టా' ఇప్పుడు మరింత పవర్‌ఫుల్ ఇంజన్‌తో లభ్యం కానుంది. 1.3 లీటర్ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్ అమర్చిన కొత్త 'విస్టా క్వాడ్రాజెట్ 90' వెర్షన్‌ను కంపెనీ నేడు మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఇంజన్ 88 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజన్‌ను ఇప్పటికే ఫియట్ పుంటో 90హెచ్‌పి స్పోర్ట్, లీనియా, టాటా మాంజా, మారుతి సుజుకి ఎస్ఎక్స్4 వంటి మోడళ్లలో వినియోగిస్తున్నారు. టాటా విస్టాలో నాల్గవ వెర్షన్ అయిన విస్టా క్వాడ్రాజెట్ 90 ధరలు రూ.6.03 లక్షల (ఎక్స్-షోరూమ్, ముంబై) నుంచి రూ.6.63 లక్షల (ఎక్స్-షోరూమ్, ముంబై) రేంజ్‌లో ఉన్నాయి.
టాటా మోటార్స్ 2011లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విస్టాను విడుదల చేసినప్పటికీ, గతకొద్ది నెలలుగా గమనిస్తే ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగటం లేదు. ఈ నేపథ్యంలో, కొత్త పవర్‌ఫుల్ విస్టా క్వాడ్రాజెట్ 90 ద్వారానైనా ఈ మోడల్ అమ్మకాలు జోరుగా సాగవచ్చని కంపెనీ విశ్వసిస్తోంది. కొత్త విస్టాలో ఎక్స్టీరియర్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. కేవలం ఇంజన్ మరియు కొద్దిపాటి ఇంటీరియర్ మార్పులు మాత్రమే ఈ మోడల్‌లో గమనించవచ్చు. దీని ఇంటీరియర్స్ మాంజా సెడాన్ ఇంటీరియర్స్‌ను పోలి ఉండనున్నాయి.
విస్టా క్వాడ్రాజెట్ 90 వెర్షన్‌లో ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఇదివరకటి వెర్షన్లలో మాదిరిగా డ్యాష్‌బోర్డుకు మధ్యభాగంలో కాకుండా, స్టీరింగ్ వీల్ వెనుక భాగంలోకి మార్చబడింది. డ్యాష్‌బోర్డుకు కొద్దిపాటి లెథర్ వర్క్‌ను జోడించటం వలన ఈ వెర్షన్ మరింత ప్రీమియం ఫీల్‌ను అందిస్తుంది. ఇందులోని జెడ్ఎక్స్, విఎక్స్ వేరియంట్లలో పైభాగం (రూఫ్) నలుపు రంగులో పెయింట్ చేయబడి ఉంటుంది. ఈ రెండు వేరియంట్లలో అనేక ఫీచర్లు భిన్నంగా ఉంటాయి.
విఎక్స్ వేరియంట్లో పవర్ విండోస్, ఏబిఎస్, ఈబిడి, సెంట్రల్ లాకింగ్ వంటి ఫీచర్లు ఉండగా, జెడ్ఎక్స్ వేరియంట్లో విఎక్స్ వేరియంట్లో ఉండే ఫీచర్లకు అదనంగా, అల్లాయ్ వీల్స్, ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్లు లభిస్తాయి. కొత్త విస్టాలో ముందు, వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణికులకు విశాలమైన స్థలం ఉంటుంది. అలాగే ఇది విశాలమైన బూట్ స్పేస్‌ను కలిగి ఉండి, ఎక్కువ లగేజ్‌ను స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది.
విస్టా క్వాడ్రాజెట్ 90 వెర్షన్‌లోని 1.3 లీటర్ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్‌కు వేరియబల్ జియోమెట్రీ టర్బోచార్జర్‌ను జోడించారు. దీని ద్వారా ఇది గరిష్టంగా 88 బిహెచ్‌పిల శక్తిని, 220 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 14 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. టాటా విస్టాలో ఈ పవర్‌ఫుల్ వెర్షన్ విస్టా క్వాడ్రాజెట్‌ను విడుదల చేయటం ద్వారా ఇది ఈ సెగ్మెంట్లోని పుంటో 90 హెచ్‌పి, హ్యుందాయ ఐ20 వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్ల సరసన చేరినట్లయింది.

కొత్త విస్టా క్వాడ్రాజెట్ 90
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న పాపులర్ హ్యాచ్‌బ్యాక్ 'టాటా విస్టా' ఇప్పుడు మరింత పవర్‌ఫుల్ ఇంజన్‌తో లభ్యం కానుంది. 1.3 లీటర్ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్ అమర్చిన కొత్త 'విస్టా క్వాడ్రాజెట్ 90' వెర్షన్‌ను కంపెనీ నేడు మార్కెట్లో విడుదల చేసింది.

కొత్త టాటా విస్టా
టాటా మోటార్స్ 2011లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విస్టాను విడుదల చేసినప్పటికీ, గతకొద్ది నెలలుగా గమనిస్తే ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగటం లేదు. ఈ నేపథ్యంలో, కొత్త పవర్‌ఫుల్ విస్టా క్వాడ్రాజెట్ 90 ద్వారానైనా ఈ మోడల్ అమ్మకాలు జోరుగా సాగవచ్చని కంపెనీ విశ్వసిస్తోంది.

కొత్త టాటా విస్టా
టాటా మోటార్స్ 2011లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విస్టాను విడుదల చేసినప్పటికీ, గతకొద్ది నెలలుగా గమనిస్తే ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన రీతిలో సాగటం లేదు. ఈ నేపథ్యంలో, కొత్త పవర్‌ఫుల్ విస్టా క్వాడ్రాజెట్ 90 ద్వారానైనా ఈ మోడల్ అమ్మకాలు జోరుగా సాగవచ్చని కంపెనీ విశ్వసిస్తోంది.

కొత్త టాటా విస్టా
విస్టా క్వాడ్రాజెట్ 90 వెర్షన్‌లో ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఇదివరకటి వెర్షన్లలో మాదిరిగా డ్యాష్‌బోర్డుకు మధ్యభాగంలో కాకుండా, స్టీరింగ్ వీల్ వెనుక భాగంలోకి మార్చబడింది.

కొత్త టాటా విస్టా
కొత్త విస్టాలో ఎక్స్టీరియర్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. కేవలం ఇంజన్ మరియు కొద్దిపాటి ఇంటీరియర్ మార్పులు మాత్రమే ఈ మోడల్‌లో గమనించవచ్చు. దీని ఇంటీరియర్స్ మాంజా సెడాన్ ఇంటీరియర్స్‌ను పోలి ఉండనున్నాయి.

కొత్త టాటా విస్టా
విఎక్స్ వేరియంట్లో పవర్ విండోస్, ఏబిఎస్, ఈబిడి, సెంట్రల్ లాకింగ్ వంటి ఫీచర్లు ఉండగా, జెడ్ఎక్స్ వేరియంట్లో విఎక్స్ వేరియంట్లో ఉండే ఫీచర్లకు అదనంగా, అల్లాయ్ వీల్స్, ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్లు లభిస్తాయి.

కొత్త టాటా విస్టా
విస్టా క్వాడ్రాజెట్ 90 వెర్షన్‌లోని 1.3 లీటర్ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్‌కు వేరియబల్ జియోమెట్రీ టర్బోచార్జర్‌ను జోడించారు. దీని ద్వారా ఇది గరిష్టంగా 88 బిహెచ్‌పిల శక్తిని, 220 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 14 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.


Click it and Unblock the Notifications








