స్పెషల్ ఎడిషన్ నానో విడుదల చేసిన టాటా మోటార్స్

By Ravi

మధ్య తరగతి ప్రజల కారు కలను నిజం చేస్తూ దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ప్రవేశపెట్టిన ప్రజల కారు టాటా నానో ఇప్పుడు మరిన్ని అదనపు ఫీచర్లతో లభ్యం కానుంది. పండుగల సీజన్ నేపథ్యంలో దేశవ్యప్తంగా పండుగ వాతావరణం నెలకొనడంతో ఈ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు టాటా నానోలో ఓ సరికొత్త స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది.

టాటా మోటార్స్ తమ నానోలో ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఇదివరకటి కథనంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త టాటా నానో స్పెషల్ ఎడిషన్‌లో రూ.25,000 విలువ కలిగిన 5 అదనపు ఫీచర్లను కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఈ అధనపు ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి..


టాటా నానో స్పెషల్ ఎడిషన్ ఫీచర్లు:

1. స్పెషల్ ఎడిషన్ స్టిక్కర్
నానోకు ఇరువైపులా అంటించిన స్పెషల్ ఎడిషన్ స్టిక్కర్స్ (బ్యాడ్జెస్) మీ టాటా నానో మిగతా నానోల కల్లా స్పెషల్ అని గుర్తు చేస్తుంది.

2. బాడీ గ్రాఫిక్స్
బయటివైపు డోర్లకు ఇరువైపులా అంటించిన ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్ మీ టాటా నానోకు ఓ విశిష్టమైన లుక్‌ని ఆఫర్ చేస్తుంది.

3. అల్లాయ్ వీల్స్
స్పెషల్ ఎడిషన్ నానోకు అమర్చిన కస్టమైజ్డ్ అల్లాయ్ వీల్స్ మీ టాటా నానోకు స్టయిలిష్ లుక్‌నిచ్చి, మీ డ్రైవ్‌ను మరింత స్టయిలిష్‌గా మార్చుతుంది.

4. గ్లౌవ్ బాక్స్
టాటా నానో డ్యాష్ బోర్డులో ఎడమ వైపు, కుడి వైపు ఏర్పాటు చేసిన గ్లౌవ్ బాక్సులతో మీ నానోలో కావల్సిన స్టోరేజ్ స్పేస్ ఏర్పడుతుంది.

5. కార్ ఆడియో సిస్టమ్
ఎమ్‌పి3 ప్లేయర్, ఐపాడ్ కనెక్టివిటీ, యూఎస్‌బి. ఆక్స్-ఇన్ సపోర్ట్, రెండు ఫ్రంట్ డోర్ స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్ మీ డ్రైవ్‌ను మరింత ఉల్లాసవంతంగా మార్చుతుంది.

స్పెషల్ ఎడిషన్ టాటా నానో ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది. ఇది స్టాండర్డ్ వేరియంట్‌లో మాత్రం లభ్యం కాదు. ఈ స్పెషల్ ఎడిషన్ వేరియంట్ పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపురా, సిక్కిం రాష్ట్రాల్లో మాత్రమే లభ్యమవుతుందని కంపెనీ పేర్కొంది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం టాటా నానో కారుపై కంపెనీ ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. కొనుగోలుదారులు ఇప్పుడు కేవలం రూ.15,000 డౌన్‌పేమెంట్‌కే టాటా నానో కారును సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా, ప్రతి పాత కారు ఎక్సేంజ్‌పై రీసేల్ వ్యాల్యూ కాకుండా అదనంగా రూ.30,000 ఎక్సేంజ్ బోనస్‌ను, అలాగే పాత ద్విచక్ర వాహన ఎక్సేంజ్‌పై రూ.15,000 ఎక్సేంజ్ బోనస్‌ను కంపెనీ ఆఫర్ చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, October 22, 2012, 14:56 [IST]
English summary
Tata Motors launches a Nano Special Edition, packed with accessories worth Rs.25,000, like Alloy Wheels, Blaupunkt Music System, Glove Box and Designer De-cals. The Special Edition Tata Nano will be available in the states of WB, Karnataka, Gujarat, Maharashtra, Goa, Kerala, Assam, Arunachal Pradesh, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Tripura and Sikkim only.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+