దక్షిణాఫ్రికాలో కొత్త ఇండిగో మాంజాను విడుదల చేసిన టాటా

ఈ కొత్త కారు విడుదల సందర్భంగా, టాటా మోటార్స్ అంతర్జాతీయ బిజినెస్ హెడ్ (ప్యాసింజర్ కార్స్) జానీ ఒమ్మెన్ మాట్లాడుతూ.. వివిధ దేశాల్లో టాటా మాంజాకు లభిస్తున్న స్పందనను గమనించిన తర్వాత, ఈ కారును తాజాగా దక్షిణాఫ్రికా మార్కెట్లో విడుదల చేస్తున్నామని, ఇతర మార్కెట్ల మాదిరిగానే ఇక్కడి మార్కెట్లో కూడా ఇది ఘన విజయం సాధించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
న్యూ జనరేషన్ టాటా ఇండిగో మాంజా సెడాన్ 4.4 మీటర్ల పొడవు, 1.7 మీటర్ల వెడల్పు, 2520 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉండి మంచి ఇంటీరియర్ స్పేస్‌ను ఆఫర్ చేస్తుంది. సరికొత్త హెడ్‌ల్యాంప్స్, పెద్ద 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, సరికొత్త వీల్ ఆర్చెస్, 460 లీటర్ బూట్ స్పేస్ వంటి ప్రత్యేకతలు ఈ కొత్త కారు సొంతం. టెక్నాలజీ మరియు లగ్జరీతో కూడిన ఫీచర్లతో దీనిని అభివృద్ధి చేశారు.
డ్యూయెల్ టోన్ ఫ్యాబ్రిక్ క్యాబిన్, అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, టిల్ట్ అడ్జస్టబల్ పవర్ స్టీరింగ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్ (ఓవిఆర్ఎమ్), సెంటర్ కన్సోల్‌పై డ్రైవర్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్, సాఫ్ట్ ఫీల్ కలిగిన డ్యాష్‌బోర్డ్ డిజైన్, యూఎస్‌బి పోర్ట్, బ్లూటూత్ కెనెక్టివిటీ కలిగిన 2 డిన్ మ్యూజిక్ సిస్టమ్స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్ వంటి విలాసవంతమైన కార్లలో లభించే ఫీచర్లను కొత్త మాంజాలో పొందవచ్చు.
ఇంకా, ఇందులో కొలాప్సబల్ స్టీరింగ్, యాంటీ-లాక్ బ్రేక్ సిస్టమ్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. గ్లోబల్ వినియోగదారుల అవసరాలను, అక్కడి మార్కెట్ నిబంధనలను పాటించేలా టాటా మోటార్స్ ఈ న్యూ జనరేషన్ టాటా మాంజాను తీర్చిదిద్దింది.


Click it and Unblock the Notifications








