టాటా నానోలో ఎడమ చేతి వాటపు డ్రైవింగ్ వెర్షన్!

టాటా మోటార్స్ ప్రజల కారు 'టాటా నానో' రానున్న రోజుల్లో మరిన్ని కొత్త అవతారాల్లో దర్శనమివ్వనుంది. ఇప్పటికే పొరుగు దేశాలకు చేరుకున్న టాటా నానో కారును మరిన్ని అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెట్టేందుకు టాటా మోటార్స్ సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఎడమచేతి వాటం డ్రైవ్ (లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్) కలిగిన ఓ టాటా నానో కారును కంపెనీ ప్రస్తుతం టెస్ట్ రన్ నిర్వహిస్తోంది.

యూరోపియన్, అమెరికన్ వంటి దేశాల్లో ఎడమ చేతి వాటం కలిగిన కార్లను మాత్రమే ఉపయోగిస్తారు. గతంలో టాటా మోటార్స్ తమ చిన్న కారును అమెరికా, యూరప్ మార్కెట్లో ప్రవేశపెడతామని కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి మార్కెట్ల కోసం అభివృద్ధి చేసిన లెఫ్ట్ డ్రైవ్ టాటా నానో కారును కంపెనీ పరీక్షిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన రహస్య చిత్రాలు (స్పై షాట్స్) ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి.


ఇవే కాకుండా, నానో డీజిల్ వెర్షన్, సిఎన్‌జి వెర్షన్‌లను టాటా మోటార్స్ ట్రైల్ రన్ నిర్వహిస్తోంది. ఈ ట్రైల్ రన్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసినట్లయితే, వాణిజ్య పరంగా ఇవి మార్కెట్లో విడుదల కావటమే ఆలస్యం. టాటా నానో ఎల్‌హెచ్‌డి కారు ఫ్రంట్ వైపర్ పొజిషన్ కూడా మార్చబడి ఉంది. మిగిలిన ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫీచర్లలో పెద్దగా మార్పులు ఏమీ లేవు.

దక్షిణ అమెరికా, ఆఫ్రికా వంటి దేశాల్లో తక్కువ ధర కలిగిన చిన్న కార్లకు అధిక డిమాండ్ ఉంది. ఇలాంటి మార్కెట్లో టాటా నానో ఓ చక్కటి ఆప్షన్‌గా నిలుస్తుంది. అయితే, ఇది ఆయా దేశాలకు తగినట్లుగా పూర్తి భద్రతా నిబంధనలు పాటించగలినట్లయితే, వీటిని సదరు మార్కెట్లలో అంగీకరించడం జరుగుతుంది. టాటా నానో కారు ఆరంభంలో విమర్శలు ఎదుర్కున్నప్పటికీ, ప్రస్తుతం ఇది మెల్లిగా వృద్ధిని సాధిస్తూ, కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

More from DriveSpark

Article Published On: Monday, July 23, 2012, 19:33 [IST]
English summary
Tata Motors has developed a left hand drive version of the Tata Nano. The LHD Nano could be developed for testing in left hand drive car markets such as america, Europe and some chinese countries.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+