కొత్త సఫారీ స్టోర్మ్ బుకింగ్స్‌ను ప్రారంభించిన టాటా డీలర్లు

By Ravi

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త పవర్‌ఫుల్, స్టయిలిష్ ఎస్‌యూవీ టాటా సఫారీ స్టోర్మ్ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. పండుగ సీజన్‌లో సందడి చేసేందుకు కొత్త సఫారీ తయారుగా ఉంది. గడచిన జనవరిలో తొలిసారిగా ప్రజల ముందుకు వచ్చిన, మంచి ఆదరణను సొంతం చేసుకొన్న కొత్త సఫారీ స్టోర్మ్ కోసం టాటా డీలర్లు ఇప్పుడు ముందస్తు బుకింగ్‌లను స్వీకరిస్తున్నట్లు సమాచారం.

దీన్ని బట్టి చూస్తుంటే కొత్త టాటా సఫారీ స్టోర్మ్ దీపావళి కానుకగా కొనుగోలుదారుల ముంగిట కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే ఊపందుకున్న ఎస్‌యూవీ మార్కెట్లో కొత్తగా వస్తున్న కార్లను సవాల్ చేసేలా టాటా మోటార్స్ తమ కొత్త సఫారీని తీర్చిదిద్దింది. గ్లోబల్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని టాటా మోటార్స్ అందిస్తున్న టాటా ఆరియా క్రాసోవర్‌లో ఉపయోగించిన ఛాస్సిస్‌నే ఈ కొత్త సఫారీ స్టోర్మ్ ఎస్‌యూవీలోను ఉపయోగించారు. దీని వలన ఇది పాత సఫారీతో పోల్చుకుంటే మెరుగైన డ్రైవింగ్ డైనమిక్స్‌ను కలిగి ఉంటుంది.


టాటా సఫారీ స్టోర్మ్‌ సాధారణ హ్యాలోజెన్ బల్బులతో పాటు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌ ఆప్షన్‌తో లభిస్తుంది. డ్యూయెల్ సైలెన్సర్స్, ఆల్-రౌండ్ డిస్క్ బ్రేక్స్‌, బూట్ క్రింది భాగంలో అమర్చిన స్పేర్ వీల్‌ వంటి ఫీచర్లతో ఇది లభిస్తుంది. ఇంటీరియర్స్‌లో నాణ్యమైన ప్లాస్టిక్స్‌తో తయారు చేసిన సరికొత్త డ్యాష్‌బోర్డ్, అధునాతన ఎయిర్ కండిషనింగ్, రెండవ వరుసలో కూర్చునే ప్రయాణికుల కోసం రూఫ్‌పై ఏర్పాటు చేసిన ఏసి వెంట్, చివరి వరుసలో ప్రయాణికుల కోసం పిల్లర్స్‌పై ఏర్పాటు చేసిన ఏసి వెంట్స్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.

అంతేకాకుండా, లోపలి వైపు డోర్లపై క్రోమ్ కోటింగ్ కలిగిన డోర్ హ్యాండిల్స్, యాంత్రికంగా నియంత్రించబడే కొత్త రియర్ వ్యూ మిర్రర్స్, రిమోట్ కంట్రోల్డ్ కీ, థియేటర్ డిమ్మింగ్ లైట్స్, 60:40 నిష్పత్తిలో మడిచిపెట్టే వీలున్న ఫోల్డబిల్ రియర్ సీట్, బూట్‌లో లగేజ్ నెట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. 4-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో లభ్యం కానున్న కొత్త టాటా సఫారీ స్టోర్మ్‌లో 2.2-లీటర్ 16-వాల్వ్ కామన్ రైల్ (డైకార్) ఇంజన్‌‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 140 పిఎస్‌ల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.

ఈ సెగ్మెంట్లోకి కొత్తగా వచ్చిన మహీంద్రా ఎక్స్‌యూవీ500, రెనో డస్టర్ వంటి ఎస్‌యూవీలకు టాటా సఫారీ స్టోర్మ్ గట్టి పోటీ ఇవ్వనుంది. భారత మార్కెట్లో టాటా సఫారీ స్టోర్మ్ ధర రూ.9 లక్షల నుండి 12 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. మరింకెందుకు ఆలస్యం మంచి సమయం మించి పోకమునుపే మీ సమీపంలో టాటా మోటార్స్ అధీకృత డీలర్‌ను సంప్రదించి ముందుగా మీ సఫారీని బుక్ చేసుకోండి.

More from DriveSpark

Article Published On: Monday, September 24, 2012, 19:31 [IST]
English summary
Tata Motors has opened bookings for its Safari Storme premium SUV across its showrooms in India. The 2012 Tata Safari Storme was expected to be launched early this year itself as it was displayed at the Delhi Auto Expo in January. However Tata Motors did not bring out the Storme in the first half of 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+