ఉచితంగా ఫోక్స్‌వ్యాగన్ కారును గెలుచుకునే అవకాశం!
ఫోక్స్‌వ్యాగన్ ఇండియా అందిస్తున్న పోలో హ్యాచ్‌బ్యాక్ కారును టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటున్నారా? అయితే, డ్రైవ్‌స్పార్క్ ఇప్పుడు మీకు ఓ చక్కటి అవకాశాన్ని అందిస్తోంది. పోలో టెస్ట్ డ్రైవ్ కోసం ఫోక్స్‌వ్యాగన్ సహకారంతో డ్రైవ్‌స్పార్క్ ఓ క్యాంపైన్‌ను నిర్వహిస్తోంది. ఈ క్యాంపైన్‌లో భాగంగా, మా పాఠకులకు ఫోక్స్‌వ్యాగన్ ఉచిత పోలో టెస్ట్ డ్రైవ్‌ను ఆఫర్ చేయనుంది. అంతేకాదండోయ్.. ఫోక్స్‌వ్యాగన్ పోలో కారును టెస్ట్ డ్రైవ్ చేయటం ద్వారా లక్కీ డ్రాలో ఈ కారును గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఈ క్యాంపైన్ ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ వెంటో సెడాన్‌కు కూడా వర్తించనుంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా, క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి, అందులో మీ వివరాలను నమోదు చేయటమే. మరింకెందుకు ఆలస్యం.. వెంటనే ఈ బుజ్జి కారును టెస్ట్ డ్రైవ్ చేసి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి..!
భారత మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ పోలో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతోంది. పెట్రోల్ వెర్షన్ పోలోలో 1.2 లీటర్, 3-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 5400 ఆర్‌పిఎమ్ వద్ద 75 పిఎస్‌ల శక్తిని, 3750 ఆర్‌పిఎమ్ వద్ద 110 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు పెట్రోల్‌కు 17.24 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.
ఇకపోతే డీజిల్ వెర్షన్ పోలో విషయానికి వస్తే.. ఇందులో 1.2 లీటర్, 3-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 4200 ఆర్‌పిఎమ్ వద్ద 75 పిఎస్‌ల శక్తిని, 2000 ఆర్‌పిఎమ్ వద్ద 180 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరు డీజిల్‌కు 22.07 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది.


Click it and Unblock the Notifications














