లిమిటెడ్ ఎడిషన్ ఇన్నోవా ఏరోను విడుదల చేసిన టయోటా

భారత ఎమ్‌పివి సెగ్మెంట్లో అగ్రగామిగా ఉన్న టొయోటా ఇన్నోవాలో మరికొత్త వేరియంట్‌ను కంపెనీ నేడు మార్కెట్లో విడుదల చేసింది. ఈ సెగ్మెంట్లో మారుతి సుజుకి ఎర్టిగా, నిస్సాన్ ఇవాలియా వంటి కొత్త ఎమ్‌పివిల రాకతో పోటీ అధికమవుతున్న నేపథ్యంలో, కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు టొయోటా ఇన్నోవాలో ఓ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది.

టొయోటా ఇన్నోవా ఏరో అనే పేరుతో వస్తున్న ఈ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ సాధారణ ఇన్నోవాతో పోల్చుకుంటే సరికొత్త ఫీచర్లను కలిగి ఉండనుంది. దేశీయ విపణిలో ఈ కొత్త వేరియంట్ ధరలు రూ.12.25 లక్షల నుంచి రూ.12.30 లక్షల రేంజ్ (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లో ఉన్నాయి. కేవలం 1,200 యూనిట్ల లిమిటెడ్ ఎడిషన్ టొయోటా ఇన్నోవా ఏరో ఎమ్‌పివిలను మాత్రమే కంపెనీ విక్రయించనుంది.

టొయోటా ఇన్నోవా ఏరో - ఫీచర్లు

టొయోటా ఇన్నోవా ఏరో - ఫీచర్లు

* డ్యూయెల్ టోన్ ఫ్రంట్ బంపర్ స్పాయిలర్ - రేస్ ద్వారా స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన బంపర్ స్పాయిలర్ లిమిటెడ్ ఎడిషన్ ఇన్నోవా ఏరోకు సరికొత్త స్పోర్టీ లుక్‌నిస్తుంది.

* డ్యూయెల్ టోన్ రియర్ బంపర్ స్పాయిలర్ - ఈ సరికొత్త బంపర్ స్పాయిలర్ లిమిటెడ్ ఎడిషన్ ఇన్నోవా ఏరోకు సరికొత్త స్పోర్టీ లుక్‌నివ్వటమే కాకుండా, వాహనం వెనుక వైపు ట్రెండీ అప్పీల్‌ను ఇస్తుంది.

టొయోటా ఇన్నోవా ఏరో - ఫీచర్లు

టొయోటా ఇన్నోవా ఏరో - ఫీచర్లు

* సైడ్ స్కర్ట్ - సైడ్ మౌల్డ్స్‌కు మ్యాచ్ అయ్యేలా డిజైన్ చేసిన సన్నటి సైడ్ స్కర్ట్ ఇన్నోవాకు సరికొత్త ఎక్స్టీరియర్ లుక్‌నిస్తుంది.

* రూఫ్ స్పాయిలర్ - సన్నటి డిజైన్ కలిగిన రూఫ్ స్పాయిలర్ ఇన్నోవాకు డైనమిక్ లుక్‌నిస్తుంది.

* ఏరో లోగో - లిమిటెడ్ ఎడిషన్ ఇన్నోవా ఏరోపై ఏర్పాటు చేసిన స్టయిలిష్ ఏరో బ్రాండింగ్, ఈ వాహనానికి విశిష్టమైన గుర్తింపుని అందిస్తుంది.

టొయోటా ఇన్నోవా ఏరో - ధర

టొయోటా ఇన్నోవా ఏరో - ధర

భారత మార్కెట్లో లిమిటెడ్ ఎడిషన్ టొయోటా ఇన్నోవా ఏరో వేరియంట్ ధరలు రూ.12.25 లక్షల నుంచి రూ.12.30 లక్షల రేంజ్ (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లో ఉన్నాయి. ఇవి కేవలం 1,200 యూనిట్లు అందుబాటులో ఉంటాయి.

నిస్సాన్ ఇవాలియా వర్సెస్ టొయోటా ఇన్నోవా

నిస్సాన్ ఇవాలియా వర్సెస్ టొయోటా ఇన్నోవా

ఎమ్‌పివి సెగ్మెంట్లో కొత్తగా వచ్చిన నిస్సాన్ ఇవాలియాకు టొయోటా ఇన్నోవా గట్టీ పోటీ ఇవ్వనుంది.

టొయోటా ఇన్నోవా వర్సెస్ మారుతి ఎర్టిగా

టొయోటా ఇన్నోవా వర్సెస్ మారుతి ఎర్టిగా

ఎమ్‌పివి సెగ్మెంట్లో మారుతి సుజుకి ఎర్టిగా, నిస్సాన్ ఇవాలియా వంటి కొత్త ఎమ్‌పివిల రాకతో పోటీ అధికమవుతున్న నేపథ్యంలో, కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు టొయోటా ఇన్నోవాలో ఓ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది.


డిసెంబర్ నెలాఖరు వరకు మాత్రమే వీటి అమ్మకాలు అందుబాటులో ఉంటాయి. ఈ లిమిటెడ్ ఎడిషన్ ఇన్నోవా సూపర్ వైట్, సిల్వర్ మైకా మెటాలిక్ బాడీ కలర్లలో అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతం టొయోటా ఇన్నోవాలో లభిస్తున్న జిఎక్స్ గ్రేడ్ వేరియంట్‌కు మరిన్ని అదనపు హంగులు, ఫీచర్లను జోడించి లిమిటెడ్ ఎడిషన్ ఏరో బ్రాండింగ్‌తో ఈ సరికొత్త ఎమ్‌పివిని కంపెనీ ఆఫర్ చేస్తుంది.

లిమిటెడ్ ఎడిషన్ టొయోటా ఇన్నోవా ఏరో 7-సీటర్, 8-సీటర్ ఆప్షన్లతో, యూరో 3, యూరో 4 కాలుష్య నిబంధనలకు లోబడి అందుబాటులో ఉంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఏరో కిట్ వాహనం యొక్క లుక్ అండ్ ఫీల్‌ను మార్చివేస్తుంది. ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ టొయోటా ఇన్నోవా ఏరో వేరియంట్‌లో లభించే ఫీచర్ల వివరాలను పై ఫోటో ఫీచర్‌లో గమనించవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, September 27, 2012, 16:59 [IST]
English summary
Toyota has introduced an all new Innova Aero (Limited Edition). The variant list of the Innova just seems to be getting longer. However, this special edition will be rolled out only in 1200 exclusive units.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+