ఆగస్ట్ 24న మార్కెట్లోకి రానున్న సరికొత్త టొయోటా క్యామ్రీ

టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎమ్) దేశీయ విపణిలో అందిస్తున్న లగ్జరీ సెడాన్ 'టొయోటా క్యామ్రీ'లో ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను కంపెనీ ఈనెలలో మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఎంట్రీ లెవల్ లగ్జరీ కార్ సెగ్మెంట్లో పెరుగుతున్న పోటీను తట్టుకునేందుకు గానూ, అత్యాధునిక హంగులతో, సరికొత్త ఫీచర్లు, స్టయలిష్ లుక్ అండ్ ఫీల్‌తో అప్‌గ్రేడ్ చేసిన ఫేస్‌లిఫ్ట్ టొయోటా క్యామ్రీ సెడాన్‌ను టికెఎమ్ ఆగస్టు 24న మార్కెట్లో విడుదల చేయనుంది.

టొయోటా కిర్లోస్కర్ మోటార్‌కు కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ఉన్న ప్లాంట్‌లో ఈ సరికొత్త క్యామ్రీను అసెంబ్లింగ్ చేయనున్నట్లు కంపెనీ డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్ (మార్కెటింగ్) సందీప్ సింగ్ వెల్లడించారు. ఈ మోడల్‌ను సికెడి (కంప్లీట్లీ నాక్‌డ్ డౌన్) రూట్లో విడిభాగాలగా ఇండియాకు దిగుమతి చేసుకొని ఈ ప్లాంట్‌లో అసెంబ్లింగ్ చేయనున్నారు. అయితే, ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.

కొత్త 2012 వెర్షన్ టొయోటా క్యామ్రీని మార్కెట్లో విడుదల చేసే సమయంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించనుంది. ఇప్పటికే ఈ మోడల్ గ్లోబల్ మార్కెట్లో మంచి సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకుంది. భారత మార్కెట్లో కూడా కొత్త క్యామ్రీ లగ్జరీ సెడాన్‌కు మంచి స్పందన లభించగలదని కంపెనీ ఆశిస్తోంది. టొయోటా నుంచి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న కారు టొయోటా క్యామ్రీ కావటం విశేషం.

ప్రతికూల మార్కెట్ పరిస్థితిల్లోనూ తమ కంపెనీ ప్రోత్సాహకర అమ్మకాలను కనబరిచిందని, ఈ ఏడాది 1.70 లక్షల యూనిట్లు విక్రయించాలన్న లక్ష్యం పెట్టుకున్నామని సందీప్ సింగ్ తెలిపారు. గడచిన సంవత్సరంలో టికెఎమ్ 1.31 లక్షల వాహనాలను విక్రయించింది. కాగా.. గడచిన జులై 2012 నెలల కంపెనీ అమ్మకాలు 7 శాతం వృద్ధిని సాధించి 14,574 యూనిట్లుగా నమోదయ్యాయి.

More from DriveSpark

Article Published On: Monday, August 6, 2012, 10:10 [IST]
English summary
Toyota Kirloskar Motor is all set to launch its all-new luxury car 'Camry' in Indian market on 24th August 2012. This premium sedan would be assembled at the company’s Bangalore facility.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+