ఎతియోస్ లివాలో స్పోర్ట్ వెర్షన్‌ను విడుదల చేసిన టొయోటా

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టొయోటా కిర్లోస్కర్ మోటార్, దేశీయ విపణిలో అందిస్తున్న చిన్న కారు 'ఎతియోస్ లివా'లో ఓ సరికొత్త స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ లివా టిఆర్‌డి స్పోర్టివో వేరియంట్ అమ్మకాలు అక్టోబర్ 2012 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఈ సమయంలో కేవలం 1200 యూనిట్ల ఎతియోస్ లివా టిఆర్‌డి స్పోర్టివో కార్లను విక్రయిస్తామని కంపెనీ పేర్కొంది. నేటి ఆధునిక యువతరాన్ని దృష్టిలో ఉంచుకొని, మరింత స్టయిలిష్ లుక్, స్పోర్టీ పెర్ఫామెన్స్‌లో ఈ స్పెషల్ ఎడిషన్ లివా టిఆర్‌డి స్పోర్టివోను టొయోటా తీర్చిదిద్దింది. టొయోటాకు జపాన్‌లో ఉన్న టొయోటా రేసింగ్ డెవలప్‌మెంట్ (టిఆర్‌డి) విభాగాం ఈ లిమిటెడ్ ఎడిషన్ లివాకు రూపకల్పన చేసింది.


ఈ కొత్త వేరియంట్‌లో రేసింగ్ నుంచి స్పూర్తి పొందిన బాడీ గ్రాఫిక్స్‌ను గమనించవచ్చు. టొయోటా ఎతియోస్ లివా టిఆర్‌డి స్పోర్టివో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. ఇందులో పెట్రోల్ వెర్షన్ ధర రూ.5.23 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండగా, డీజిల్ వెర్షన్ ధర రూ.6.32 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. మరింత స్పోర్టీ లుక్‌ ఉండేలా ఈ కారును తీర్చిదిద్దారు కాబట్టే దీనికి స్పోర్టివో అనే పేరును పెట్టడం జరిగింది.

సరికొత్త ఫ్రంట్ బంపర్ స్పాయిలర్, ఏరోడైనమిక్ సైడ్ స్కర్ట్, టూ-టోన్ రియర్ బంపర్ స్పాయిలర్ మరియు రూఫ్ స్పాయిలర్‌లు ఈ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌లో ప్రధానంగా చెప్పుకోదగిన ఎక్స్టీరియర్ మార్పులు. ఈ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ రెండు ఎక్స్‌క్లూజివ్ (వైట్, ఆల్ట్రామెరైన్ బ్లూ) రంగుల్లో లభిస్తుంది. కారుకు సైడ్ భాగంలో స్పోర్టీ బాడీ గ్రాఫిక్స్‌ను కూడా గమనించవచ్చు.

ఇంకా, గన్ మెటల్ ఫినిష్‌తో కూడిన 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, కారు బయట మరియు లోపలి వైపున స్పెషల్ ఎడిషన్ 'టిఆర్‌డి స్పోర్టివో' బ్రాండింగ్, బూట్ లిడ్‌పై క్రోమ్ బ్యాడ్జ్ వంటి ప్రత్యేకమైన మార్పులతో ఈ బుజ్జి కారు లభిస్తుంది. మరింత స్పోర్టీయర్ లుక్ అండ్ ఫీల్ కోరుకునే వారికి కొత్త లిమిటెడ్ ఎడిషన్ టొయోటా ఎతియోస్ లివా టిఆర్‌డి స్పోర్టివో ఓ చక్కటి ఆప్షన్‌గా ఉంటుంది. మరికెందుకు ఆలస్యం వెంటనే, మీ సమీపంలో టొయోటా డీలర్‌ను సంప్రదించి సరికొత్త స్పోర్టీ వెర్షన్ లివాను బుక్ చేసుకోండి. త్వరపడండి, ఈ వేరియంట్ కేవలం స్టాక్ ఉన్నంత వరకూ మాత్రమే.

More from DriveSpark

Article Published On: Wednesday, August 1, 2012, 12:23 [IST]
English summary
The Limited Edition Liva TRD Sportivo has been launched today by Toyota Kirloskar Motor (TKM). Toyota has launched the Liva Sportivo, in order to mark the first anniversary of Etios Liva. The company will sell the new Toyota Etios Limited edition till the month of October 2012.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+