లిమిటెడ్ ఎడిషన్ కరోలా ఆల్టిల్ ఏరోను విడుదల చేసిన టొయోటా
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా కిరోస్కర్ మోటార్ (టికెఎమ్) అందిస్తున్న ప్రీమియం సెడాన్ కరోలా ఆల్టిస్‌లో ఓ స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను విడుదల చేసింది. సరసమైన ధరకే విలాసవంతమైన ఫీచర్లతో కూడిన 'కరోలా ఆల్టిస్ ఏరో' అనే ఓ స్పెషల్ ఎడిషన్ పెట్రోల్ వేరియంట్ కారును కేవలం రూ.11.48 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరకే టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ దేశీయ విపణిలోకి విడుదల చేసింది.

తాము భారత మార్కెట్లోకి ప్రవేశించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈ స్పెషల్ ఎడిషన్ కారును విడుదల చేస్తున్నామని టికెఎమ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ సింగ్ తెలిపారు. విశాలమైన ఇంటీరియర్ స్పేస్, అధిక సైకర్యం, మెరుగైన మైలేజ్ వంటి విషయాల్లో కరోలా ఆల్టిస్ ఈ సెగ్మెంట్లో ది బెస్ట్ సెడాన్ అనిపించుకుంటుంది. టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ విడుదల చేసిన ఈ లిమిటెడ్ ఎడిషన్ టొయోటా కరోలా ఆల్టిస్ ఏరో మోడల్ కేవలం 500 యూనిట్లను మాత్రమే కంపెనీ తయారు చేయనుంది.
ప్రస్తుతం పెట్రోల్ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, వీటి అమ్మకాలను పెంచుకునేందుకు కూడా కరోలా ఆల్టిస్ ఏరో సహకరించనుంది. ప్రస్తుతానికి పెట్రోల్ వేరియంట్‌లో మాత్పమే ఈ స్పెషల్ ఎడిషన్ కరోలా ఆల్టిస్ ఏరో మోడల్‌ను విడుదల చేస్తున్నామని, మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి ఇందులో డీజిల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టే విషయం ఆలోచిస్తామని సందీప్ సింగ్ చెప్పారు. ఈ కొత్త కారును దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన షోరూమ్‌లలో ప్రదర్శనకు ఉంచి, ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అమ్మకాలను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
కొత్త స్పెషల్ ఎడిషన్ టొయోటా కరోలా ఆల్టిస్‌లో సరికొత్త ఫ్రంట్ బంపర్, ఎల్ఈడితో కూడిన రియర్ స్పాయిలర్, స్మోక్డ్ హ్యాలోజెన్ హెడ్‌ల్యాంప్స్ అండ్ రియర్ కాంబినేషన్ ల్యాంప్స్, కొత్త క్రోమ్ ఫినిష్డ్ మఫ్లర్ కట్టర్, డ్యూయెలో టోన్ సీట్స్, ఇంటీరియర్లు, ఎక్స్‌టీరియర్లపై స్పెషల్ ఎడిషన్ అని తెలియజేసేలా డిజైన్ చేయబడిన ప్రత్యేకమైన ఏరో లోగోలు వంటి అనేక మార్పులను మనం గమనించవచ్చు. ఇది సిల్వర్ మైకా మెటాలిక్, బ్లాక్ మైకా అనే రెండు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యం కానుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ కరోలా ఆల్టిస్ ఏరో కారులో ప్రస్తుతం కరోలా ఆల్టిస్‌లో ఉపయోగిస్తున్న జే గ్రేడ్ 1.8 లీటర్ యూరో-4 పెట్రోల్ ఇంజన్‌నే ఉపయోగించారు.


Click it and Unblock the Notifications








