రెనో డస్టర్‌కు పోటీగా 'రష్'ను ప్రవేశపెట్టనున్న టొయోటా
ప్రస్తుతం మార్కెట్లో పెద్ద ఎస్‌యూవీలకు ఆదరణ తగ్గి చిన్న ఎస్‌యూవీలకు డిమాండ్ జోరందుకుంది. ఈ నేపథ్యంలో వివిధ ఆటోమొబైల్ కంపెనీలు (ఆడి, బిఎమ్‌డబ్ల్యూ వంటి లగ్జరీ కార్ కంపెనీలు కూడా) కాంపాక్ట్ ఎస్‌యూవీలపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవలే ఫ్రెంచ్ కార్ కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి తమ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ రెనో డస్టర్‌ను ప్రవేశపెట్టగా, అమెరికాకు చెందిన కార్ కంపెనీ ఫియట్ త్వరలో తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫోర్డ్ ఈకోస్పోర్ట్‌ను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం, జపాన్‌కు చెందిన ఆటో దిగ్గజం టొయోటా గ్లోబల్ మార్కెట్లలో అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ 'టొయోటా రష్'ను భారత మార్కెట్‌కు పరిచయం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇండియన్ మార్కెట్లో ఈ ఫైవ్-సీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధర సుమారు రూ.7.5 లక్షల నుంచి 12.5 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.
ప్రస్తుతం రష్ కాంపాక్ట్ ఎస్‌యూవీని మలేషియా వంటి మార్కెట్లలో టొయోటా అందిస్తోంది. మలేషియన్ వెర్షన్ టొయోటా రష్ ఎస్‌యూవీలో 1.5 లీటర్ వివిటి-ఐ (వేరియబల్ వాల్వ్ టైమింగ్ విత్ ఇంటలిజెన్స్) ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 109 పిఎస్‌ల శక్తిని, 4,400 ఆర్‌పిఎమ్ వద్ద 141 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.
ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, స్టయిలిష్ డిజైన్, సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన అత్యాధునిక భద్రతా ఫీచర్లతో ఇది లభ్యం కానుంది. కేవలం రష్ కాంపాక్ట్ ఎస్‌యూవీతో సరిపెట్టకుండా రానున్న రోజుల్లో మరిన్ని ఉత్పత్తులను టొయాటా ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేయనుంది.


Click it and Unblock the Notifications









