ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేయిస్తే, 3200 కి.మీ. దూరం వెళ్లొచ్చు

సాధారణంగా స్పోర్ట్స్ కార్లలో ఎక్కువ శాతం పవర్‌ఫుల్ పెట్రోల్ ఇంజన్లనే ఉపయోగిస్తుంటారు. పెట్రోల్ ఇంజన్లు మెరుగైన పెర్ఫామెన్స్‌ను కలిగి ఉండి మంచి స్పీడ్‌ను, పికప్‌ను కలిగి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే, బ్రిటన్‌కు చెందిన కార్ కంపెనీ ట్రైడెంట్ మాత్రం డీజిల్‌తో కూడిన ఓ పవర్‌ఫుల్ స్పోర్ట్స్ కారును తయారు చేసింది. ట్రైడెంట్ తయారు చేసిన 'ఐస్నీ గ్రాండ్ టూరర్' డీజిల్ స్పోర్ట్స్ కారులో ఉపయోగించిన టార్క్ మల్టిప్లికేషన్ టెక్నాలజీ కోసం కంపెనీ పేటెంట్ హక్కులను కూడా పొందింది.

ట్రైడెంట్‌కు నార్‌ఫోల్క్‌లో ఉన్న ప్లాంటులో ఈ స్పోర్ట్స్ కారును తయారు చేశారు. ఐస్నీ గ్రాండ్ టూరర్ డీజిల్ స్పోర్ట్స్ కారులో 6.6 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు . ఇది గరిష్టంగా 430 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 1288 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్పోర్ట్స్ కారు కేవలం 3.7 సెకండ్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 322 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఈ కారు ధర 75,000 బ్రిటీష్ పౌండ్లు.

ట్రైడెంట్ ఐస్నీ గ్రాండ్ టూరర్ - ఇంజన్

ట్రైడెంట్ ఐస్నీ గ్రాండ్ టూరర్ - ఇంజన్

* 6.6 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్‌

* గరిష్ట పవర్ - 430 బిహెచ్‌పి

* గరిష్ట టార్క్ 1288 ఎన్ఎమ్‌

ట్రైడెంట్ ఐస్నీ గ్రాండ్ టూరర్ - స్పీడ్, మైలేజ్

ట్రైడెంట్ ఐస్నీ గ్రాండ్ టూరర్ - స్పీడ్, మైలేజ్

* యాక్సిలరేషన్ - 3.7 సెకండ్లలో 0 నుంచి 100 కిలోమీటర్లు

* గరిష్ట వేగం - గంటకు 322 కిలోమీటర్లు

* మైలేజ్ - 20 కిలోమీటర్లకు పైగా

* ఇంధనం - బయో డీజిల్, పామ్ ఆయిల్, లిన్‌సీడ్ ఆయిల్

* ఫుల్ ట్యాంక్‌పై 3,200 కిలోమీటర్ల రేంజ్

ట్రైడెంట్ ఐస్నీ గ్రాండ్ టూరర్ - ఛాస్సిస్

ట్రైడెంట్ ఐస్నీ గ్రాండ్ టూరర్ - ఛాస్సిస్

* ఫోల్డెడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ 4003 గ్రేడ్, జీవితాంతం గ్యారంటీ (100 ఏళ్లు)

* బాడీ - అన్‌స్రెస్స్డ్ కాంపోజిట్

* లగేజ్ సామర్థ్యం - 4 సూట్‌కేసులు, ఒక సెట్ గోల్ఫ్ క్లబ్

ట్రైడెంట్ ఐస్నీ గ్రాండ్ టూరర్ - సేఫ్టీ, సర్వీసింగ్

ట్రైడెంట్ ఐస్నీ గ్రాండ్ టూరర్ - సేఫ్టీ, సర్వీసింగ్

* ఫ్రంట్ రియర్ క్రషబల్ జోన్స్

* డ్రైవర్, ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్

* సర్వీసింగ్ - వార్షికంగా లేదా 1,00,000 మైళ్లు

ట్రైడెంట్ ఐస్నీ గ్రాండ్ టూరర్ - ధర

ట్రైడెంట్ ఐస్నీ గ్రాండ్ టూరర్ - ధర

* ఈ కారు ధర 75,000 బ్రిటీష్ పౌండ్లు. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.63 లక్షలకు పైమాటే. ఈ ధరకు దిగుమతి సుంఖాలు, పన్నులు కలుపుకుంటే ఇది కోటిరూపాయలకు పైగా ఉంటుంది.


అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ.63 లక్షలకు పైమాటే. ఈ ధరకు దిగుమతి సుంఖాలు, పన్నులు కలుపుకుంటే ఇది కోటిరూపాయలకు పైగా ఉంటుంది. ఈ ఇంజన్‌ను టార్క్ మల్టిప్లికేషన్ టెక్నాలజీ ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశారు. ఇది బయో డీజిల్, పామ్ ఆిల్, లిన్‌సీడ్ ఆయిల్ ఇంధనాలతో నడుస్తుంది. ఇందులో 660 బిహెచ్‌పి సామర్థ్యం కలిగిన మరో ఇంజన్‌ను కూడా అభివృద్ధి చేయాలని కంపెనీ యోచిస్తోంది. (ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలను పై ఫోటో ఫీచర్ కథనంలో చూడొచ్చు).

ట్రైడెంట్ ఐస్నీ గ్రాండ్ టూరర్ పవర్‌ఫుల్ స్పోర్ట్స్ కారు అయినప్పటికీ, ఇది లీటరు ఇంధనానికి 20 కిలోమీటర్లకు పైగా మైలేజీనిస్తుంది. ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేయిస్తే ఈ కారులో 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ట్రైడెంట్ ఐస్నీ గ్రాండ్ టూరర్ 39కి పైగా ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన వివిధ భాగాలు ఉన్నాయి. అందులో చక్రాలు, సీట్లు, ఎయిర్ వెంట్స్, ఇన్‌స్ట్రుమెంట్స్, డోర్ పుల్స్ అండ్ హ్యాండిల్స్, ఆక్యులైట్ రూఫ్ ప్యానెల్స్, లైట్స్, గ్లాస్, గ్రిల్స్ అండ్ వెంట్స్, గేర్ బాక్స్ అండ్ డిఫరెన్షియల్ మొదలైన ఫీచర్లు చెప్పుకోదగినవి.

More from DriveSpark

Article Published On: Thursday, October 4, 2012, 12:35 [IST]
English summary
The Trident Iceni is the culmination of a small team's dream to produce a beautiful Grand Tourer with unique features and innovations. It is equipped with 6.6 Litre turbo diesel engine complete with common rail and direct injection, 4 valves per cylinder and a variable vane turbo. The standard car is geared to 200 mph, but at a constant 70 mph, over 68 mpg is achievable with a range of 2000 on a single tank full.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+