అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కారు ది బీస్ట్ గురించి తెలుసా..?
బారాక్ ఒబామాను అమెరికన్లు విశ్వసించారు. అగ్రరాజ్యానికి అధినేతగా మరోసారి ఒబామా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో బరాక్ ఒబామా అధిక మెజారీటితో గెలిచారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన అగ్రరాజ్యాన్ని గట్టెక్కించడంలో, అలాగే, అమెరికాలో ఇటీవల సంభవించిన ప్రకృతి భీభత్సం (శాండీ స్ట్రోమ్) ప్రజలకు సేవలందించడంలో బరాక్ ఒబామా అమెరికన్ల మనసు దోచుకున్నారు. అందుకే వారంతా మరోసారి ఆయనకు పట్టం కట్టారు. ఈ సందర్భంగా తెలుగు డ్రైవ్‌స్పార్క్ బరాక్ ఒబామాకు అభినందనలు తెలియజేస్తోంది.
అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన బారాక్ ఒబామా, అమెరికా అధ్యక్ష భవనం ఇదివరకు కేటాయించిన అధికారిక వాహనాన్ని ఇకపై కూడా కొనసాగించనుంది. అమెరికా సైన్యం ది బీస్ట్ (దెయ్యం) అని ముద్దుగా పిలుచుకునే ఈ అత్యంత సురక్షితమైన, అధునాతనమైన వాహనాన్ని జనరల్ మోటార్స్ తయారు చేసింది. ఇది భద్రత పరంగా అత్యంత సురక్షితమైనది, సాంకేతిక పరిజ్ఞానం పరంగా అధునాతనమైనది. ఈ బుల్లెట్ ప్రూఫ్ కారు క్యాడిలాక్ బ్రాండ్‌కు చెందినది.

తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో బరాక్ ఒబామా అధిక మెజారీటితో గెలిచారు.

క్యాడిలాక్ లీమోజైన్
అమెరికా సైన్యం ది బీస్ట్ (దెయ్యం) అని ముద్దుగా పిలుచుకునే ఈ అత్యంత సురక్షితమైన, అధునాతనమైన వాహనాన్ని జనరల్ మోటార్స్ తయారు చేసింది. ఇది భద్రత పరంగా అత్యంత సురక్షితమైనది, సాంకేతిక పరిజ్ఞానం పరంగా అధునాతనమైనది. ఈ బుల్లెట్ ప్రూఫ్ కారు క్యాడిలాక్ బ్రాండ్‌కు చెందినది.

బుల్లెట్ ప్రూఫ్, గ్రనేడ్ ప్రూఫ్, కెమికల్ ప్రూఫ్
రాకెట్ లాంచర్ల ద్వారా ప్రయోగించే శక్తివంతమైన పేలుడు పదార్థాలను సైతం ఈ కారు ఎదుర్కోగలదు. కారు చుట్టపక్కల హ్యాండ్ గ్రనేడ్ విసిరినా కూడా కారులోని ప్రయాణికులకు ఎలాంటి హాని జరగదు. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే వారికి మాత్రమే ఈ అధికారి వాహనాన్ని ఇస్తారు.

కారులో అధ్యక్షుడు ఫుల్ సేఫ్!
ఈ కారులో ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక్క బటన్ నొక్కడం ద్వారా అధ్యక్షుడి చుట్టూ 10 అంగుళాల మందం ఉన్న బుల్లెట్‌ప్రూఫ్ ద్వారాలు తెరచుకొని ఆయన చుట్టూ రక్షణగా నిలుస్తాయి.

అమెరికా అధ్యక్షుడి వాహనం - సేఫ్టీ ఫీచర్స్
సుమారు మూడు టన్నుల బరువు ఉండే ఈ నలుపు రంగు కాడిలాక్ కారు గంటకు 60 మైళ్ల వేగంతో (గంటకు 96.5 కి.మీ.) ప్రయాణిస్తుంది. అమెరికా గూఢచార సంస్థ (సీఐఏ)కు చెందిన నిపుణుడైన ఏజెంట్ ఈ కారును డ్రైవ్ చేస్తాడు. ప్రమాదంలో కారు టైర్లు పేలిపోయినా వాహనం మాత్రం ఆగకుండా దాదాపు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.

ది బీస్ట్ - బ్లడ్ బ్యాంక్
ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో ప్రమాదంలో గాయపడిన అధ్యక్షుడికి అత్యవసరంగా రక్తాన్ని అందించాల్సి వచ్చినప్పుడు కారులో అధ్యక్షుడి బ్లడ్ గ్రూప్ రక్తాన్ని కూడా స్టోర్ చేసి ఉంచుతారు.

క్యాడిలాక్ లీమోజైన్ - టెక్నాలజీ
ఈ కారులో అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. జస్ట్ ఈ కారు వెనుక సీటులో కూర్చునే ఒబామా ప్రపంచంలో ఏ మూల నుంచైనా అమెరికాను పాలించే వెసులుబాటు ఉంటుంది. లాప్‌టాప్, వైర్‌లెస్ ఇంటర్నెట్, శాటిలైట్ ఫోన్ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు ఎల్లప్పుడూ అమెరికాలోని వైట్‌హౌస్‌కు కనెక్ట్ చేయబడి ఉంటాయి. మన దేశ కరెన్సీలో ఈ కారు ధర సుమారు రూ.2.6 కోట్లకు పైమాటే.

ఒబామా బస్
ఈ బస్సును అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత సురక్షితంగా ఉండేలా డిజైన్ చేశారు. ఇందులో ఓ మీటింగ్ రూమ్, ఒక రెస్ట్ రూమ్, బ్లడ్ బ్యాంక్, ఆహారాన్ని అందించేందుకు చిన్న పాటి ప్యాంట్రీ వంటి ఎన్నో వసతులు ఉన్నాయి. ఇందులో శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఉంది. ఈ బస్సు కూడా ఒబామా వాడే కారు మాదిరిగానే బాంబ్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్, కెమికల్ అటాక్ ప్రూఫ్, పంక్చర్ ప్రూఫ్ టైర్లతో అధ్యక్షుడిని అత్యంత భధ్రంగా రక్షిస్తుంది.

ఒబామా బస్
ఈ బస్సును కెనడాకు చెందిన మోటార్ కోచ్ బిల్డర్ ప్రెవోస్ట్ కంపెనీ రూపొందించగా, ఇందులోని ఇంటీరియర్లను నాష్‌విల్లేకు చెందిన హెమ్‌ఫిల్ బ్రదర్స్ కో డిజైన్ చేసింది. మరి ఈ బస్సు ధర ఎంతో తెలుసా కేవలం 1.1 మిలియన్ డాలర్లు. అంటే మన దేశ కరెన్సీలో సుమారు ఐదు కోట్ల రూపాయాలు అన్నమాట.
రాకెట్ లాంచర్ల ద్వారా ప్రయోగించే శక్తివంతమైన పేలుడు పదార్థాలను సైతం ఇది ఎదుర్కోగలదు. కారు చుట్టపక్కల హ్యాండ్ గ్రనేడ్ విసిరినా కూడా కారులోని ప్రయాణికులకు ఎలాంటి హాని జరగదు. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే వారికి మాత్రమే ఈ అధికారి వాహనాన్ని ఇస్తారు. ఈ కారులో ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక్క బటన్ నొక్కడం ద్వారా అధ్యక్షుడి చుట్టూ 10 అంగుళాల మందం ఉన్న బుల్లెట్‌ప్రూఫ్ ద్వారాలు తెరచుకొని ఆయన చుట్టూ రక్షణగా నిలుస్తాయి.
ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో ప్రమాదంలో గాయపడిన అధ్యక్షుడికి అత్యవసరంగా రక్తాన్ని అందించాల్సి వచ్చినప్పుడు కారులో అధ్యక్షుడి బ్లడ్ గ్రూప్ రక్తాన్ని కూడా స్టోర్ చేసి ఉంచుతారు. సుమారు మూడు టన్నుల బరువు ఉండే ఈ నలుపు రంగు కాడిలాక్ కారు గంటకు 60 మైళ్ల వేగంతో (గంటకు 96.5 కి.మీ.) ప్రయాణిస్తుంది. అమెరికా గూఢచార సంస్థ (సీఐఏ)కు చెందిన నిపుణుడైన ఏజెంట్ ఈ కారును డ్రైవ్ చేస్తాడు. ప్రమాదంలో కారు టైర్లు పేలిపోయినా వాహనం మాత్రం ఆగకుండా దాదాపు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
ఇంకా ఈ కారులో అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. జస్ట్ ఈ కారు వెనుక సీటులో కూర్చునే ఒబామా ప్రపంచంలో ఏ మూల నుంచైనా అమెరికాను పాలించే వెసులుబాటు ఉంటుంది. లాప్‌టాప్, వైర్‌లెస్ ఇంటర్నెట్, శాటిలైట్ ఫోన్ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు ఎల్లప్పుడూ అమెరికాలోని వైట్‌హౌస్‌కు కనెక్ట్ చేయబడి ఉంటాయి. మన దేశ కరెన్సీలో ఈ కారు ధర సుమారు రూ.2.6 కోట్లకు పైమాటే.
బరాక్ ఒబామాకు అమెరికా సర్కారు కేటాయించిన పొడవాటి అధ్యక్ష కారు (క్యాడిలాక్ లీమోజైన్) మాదిరగానే ఓ అధునాతన బస్సును కూడా కేటాయించడం జరిగింది. ఈ బస్సును కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత సురక్షితంగా ఉండేలా డిజైన్ చేశారు. ఈ బస్సులో ఓ మీటింగ్ రూమ్, ఒక రెస్ట్ రూమ్, బ్లడ్ బ్యాంక్, ఆహారాన్ని అందించేందుకు చిన్న పాటి ప్యాంట్రీ వంటి ఎన్నో వసతులు ఉన్నాయి. ఇందులో శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఉంది.
ఈ బస్సు కూడా ఒబామా వాడే కారు మాదిరిగానే బాంబ్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్, కెమికల్ అటాక్ ప్రూఫ్, పంక్చర్ ప్రూఫ్ టైర్లతో అధ్యక్షుడిని అత్యంత భధ్రంగా రక్షిస్తుంది. ఈ బస్సును కెనడాకు చెందిన మోటార్ కోచ్ బిల్డర్ ప్రెవోస్ట్ కంపెనీ రూపొందించగా, ఇందులోని ఇంటీరియర్లను నాష్‌విల్లేకు చెందిన హెమ్‌ఫిల్ బ్రదర్స్ కో డిజైన్ చేసింది. మరి ఈ బస్సు ధర ఎంతో తెలుసా కేవలం 1.1 మిలియన్ డాలర్లు. అంటే మన దేశ కరెన్సీలో సుమారు ఐదు కోట్ల రూపాయాలు అన్నమాట. మరి అమెరికా అధ్యక్షుడా మాజానా..!


Click it and Unblock the Notifications








