మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్‌లో విద్యా బాలన్ హాట్ సవారీ

డర్టీ పిక్చర్ సినిమాలో మన టాలీవుడ్ పాపులర్ సెలబ్రిటీ సిల్క్ స్మిత పాత్రను పోషించి, అటు టాలీవుడ్‌లోను ఇటు బాలీవుడ్‌లోను ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న విద్యా బాలన్ ఇప్పుడు పెళ్లి కూతరయ్యింది. గడచిన కొద్ది సంవత్సరాలుగా విద్యా బాలన్ ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. నేటితో వీరిద్దరి ప్రేమ ప్రయాణానికి శుభం కార్డు పడింది. గడచిన రెండు రోజుల క్రితం విద్య, సిద్ధార్థ్‌లకు నిశ్చితార్థం అయింది. కాగా.. నేడు (డిసెంబర్ 14, 2012)న వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ బ్రైడ్ గర్ల్ నడిపే ప్రైడ్ కారేంటో తెలుసా..? అయితే ఈ కథనం చదవండి..!

విద్యా బాలన్ వద్ద ఓ మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ కారు ఉంది. 2009లో విద్యా బాలన్ ఈ కారును కొనుగోలు చేసింది. తన నిశ్చితార్థానికి కూడా ఆమె ఇదే కారును ఉపయోగించింది (ఫోటోల్లో గమనించవచ్చు). జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న విలాసవంతమైన కార్లలో మెర్సిడెస్ బెంజ్ ఈ350 మోడల్ ఖరీదైనది. దేశీయ విపణిలో ఈ కారు ధరలు రూ.60 లక్షల నుంచి కోటి రూపాయలకు పైగా ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఈ350 కారులో 3498సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 6300 ఆర్‌పిఎమ్ వద్ద 272 బిహెచ్‌పిల శక్తిని, 4500 ఆర్‌పిఎమ్ వద్ద 355 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ జిట్రానిక్స్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది. అత్యంత విలాసవంతమైన ఫీచర్లతో కంపెనీ ఈ కారును తయారు చేసింది. ప్రస్తుతం ఇందులో ఓ ఏఎమ్‌జి స్పోర్ట్ వెర్షన్‌ను కూడా కంపెనీ ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర సుమారు కోటి రూపాయలకు పైగా ఉంది.

విద్యా బాలన్ 2005లో 'పరిణీత' అనే చిత్రం ద్వారా బాలివుడ్‌ అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'లగేరహో మున్నాభాయ్'‌, 'గురు', 'ఇష్క్‌కియా', 'కహానీ' వంటి సక్సెస్‌ఫుల్ సినిమాల్లో నటించింది. విద్యా బాలన్ తాజాగా నటించిన సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా తీసిన 'డర్టీ పిక్చర్‌'లో ఆమె నటనకు గాను ఆ సినిమాకు జాతీయ ఉత్తమ అవార్డు లభించింది. మరి పెళ్లి తర్వాత విద్యా బాలన్ సినిమాల్లో నటిస్తుందో లేక వెండి తెరకు దూరమవుతుందో, ఒకవేళ నటించినా ఇలాంటి డర్టీ రోల్స్ చేస్తుందో తెలియాల్సి ఉంది.

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

విద్యా బాలన్ - మెర్సిడెస్ బెంజ్ ఈ350

More from DriveSpark

Article Published On: Wednesday, December 12, 2012, 11:46 [IST]
English summary
Bollywood's hot actress Vidya Balan is a true car lover. Do you know Vidya Balan owns a Mercedes Benz E350. It is a car that can easily take Vidya to her shoots quickly and comfortably.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+