మ్యాన్ ఆఫ్ ది సిరీస్ విరాట్ కోహ్లీకి రెనో డస్టర్ ఎస్‌యూవీ
భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ జాక్‌పాట్ కొట్టేశాడు. ఇటీవల ముగిన ఇండియా వర్సెస్ శ్రీలంక 2012 మైక్రోమ్యాక్స్ కప్ 5 సిరీస్ మ్యాచ్‌లో భారత జట్టు 4-1 తేడాతో శ్రీలంకపై ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఈ ఢిల్లీ బుల్లోడిని రెనో డస్టర్ ఎస్‌యూవీ వరించింది.
విరాట్ కోహ్లీకి రెనో ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ లెన్ కుర్రెన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుగా రెనో డస్టర్ ఎస్‌యూవీని బహుకరించారు. ఈ కారును అందుకున్న తర్వాత విరాట్ కోహ్లీ మరియు ఇండియన్ క్రికెట్ టీమ్ ఈ కారులో స్టేడియం చుట్టూ చక్కర్లు కొడుతూ, తమ విజయాన్ని పంచుకున్నారు.
జులై నెల మొదటి వారంలో మార్కెట్లో విడుదలైన రెనో డస్టర్ ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. ఈ మోడల్‌కు ఇప్పటికే 10,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చి పడ్డాయి. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మొత్తం ఎనిమిది వేరియంట్ల (రెండు పెట్రోల్, నాలుగు డీజిల్ వేరియంట్ల)లో లభ్యమవుతోంది. మార్కెట్లో రెనో డస్టర్ ప్రారంభ వేరియంట్ ధర రూ.7.19 లక్షలు (ఆర్ఎక్స్ఈ 1.6 పెట్రోల్)గా మాత్రమే ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.11.29 లక్షలు (ఆర్ఎక్స్‌జెడ్ 1.5 డీజిల్ లెథర్ ప్యాక్ 110 పిఎస్)గా ఉంది.
రెనో డస్టర్ ఎస్‌యూవీ ఫోటో గ్యాలరీ
రెనో డస్టర్‌లో వేరియంట్ వారీగా లభించే ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఈ 1.6 పెట్రోల్ - రూ. 7.19 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ 1.6 పెట్రోల్ - రూ. 8.19 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఈ 1.5 డీజిల్ 85 పిఎస్ - రూ. 7.99 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ 1.5 డీజిల్ ఆప్షన్ ప్యాక్ 85 పిఎస్ - రూ. 9.99 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ 1.5 డీజిల్ 85 పిఎస్ - రూ. 8.99 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ 1.5 డీజిల్ 110 పిఎస్ - రూ. 9.99 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్‌జెడ్ 1.5 డీజిల్ 110 పిఎస్ - రూ. 10.99 లక్షలు
* రెనో డస్టర్ ఆర్ఎక్స్‌జెడ్ 1.5 డీజిల్ లెథర్ ప్యాక్ 110 పిఎస్ - రూ. 11.29 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
రెనో డస్టర్ ఎస్‌యూవీ మైలేజ్:
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఈ (పెట్రోల్) - 13.24 కెఎమ్‌పిఎల్
* రెనో డస్టర్ ఆర్ఎక్స్ఎల్ (85 పిఎస్ డీజిల్) - 20.45 కెఎమ్‌పిఎల్
* రెనో డస్టర్ ఆర్ఎక్స్‌జెడ్ (110 పిఎస్ డీజిల్) - 19.01 కెఎమ్‌పిఎల్


Click it and Unblock the Notifications









