నీరు, ఇసుక, రోడ్డు, మంచుపై నడిచే ఫోక్స్‌వ్యాగన్ ఆక్వా
నీటిపై, నీటిలోపల, ఇసుక రోడ్లు, మట్టి రోడ్లు, మంచు రహదారులు ఎలాంటి రోడ్లయినా సరే సర్...మని దూసుకుపోయే వాహనం లభిస్తే ఎలా ఉంటుంది. అవును అన్ని రకాల రోడ్లపైనే కాకుండా నీటిపై సైతం నడిచే వాహనమే ఈ 'ఫోక్స్‌వ్యాగన్ ఆక్వా'. ఇదొక హోవర్‌క్రాఫ్ట్ (నీటిపై, రోడ్డు ప్రయాణించే వాహనం). అభివృద్ధి చెందుతున్న అత్యాధునిక సాకంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ కాన్సెప్ట్ వాహనాన్ని రూపొందించారు.
చైనా దేశానికి చెందిన ఓ 21 ఏళ్ల టీనేజర్ ఈ కాన్సెప్ట్‌కు రూపం పోయగా, జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఈ రూపానికి ప్రాణం పోసింది. సిన్హువా యూనివర్సిటీలో మెకానికల్ విద్యార్థి యువాన్ ఝాంగ్ (21) అనే కుర్రాడు ఫోక్స్‌వ్యాగన్ నిర్వహించిన ఓ కాంపిటీషన్ కోసం ఈ కారును డిజైన్ చేశాడు.

నీటిపై ఫోక్స్‌వ్యాగన్ ఆక్వా
ఫోక్స్‌వ్యాగన్ ఆక్వా హోవర్‌క్రాఫ్ట్ కాన్సెప్ట్ కారు నీటిపైనే కాకుండా, నీటి లోపల కూడా ప్రయాణిస్తుంది.

మంచుపై ఫోక్స్‌వ్యాగన్ ఆక్వా
ఫోక్స్‌వ్యాగన్ ఆక్వా హోవర్‌క్రాఫ్ట్ మంచు రోడ్లపై కూడా సనాయాసంగా పరుగులు తీయగలదు.

మట్టి రోడ్లపై ఫోక్స్‌వ్యాగన్ ఆక్వా
ఫోక్స్‌వ్యాగన్ ఆక్వా హోవర్‌క్రాఫ్ట్‌ను నడపటానికి ప్రత్యేకించి రోడ్లేమీ అవసరం లేదు. ఇది ఎలాంటి రోడ్లపై అయినా సరే సలువుగా ప్రయాణించగలదు.

ఫోక్స్‌వ్యాగన్ ఆక్వా కాన్సెప్ట్
ఫోక్స్‌వ్యాగన్ ఆక్వాను చైనాలోని సిన్హువా యూనివర్సిటీలో మెకానికల్ విద్యార్థి యువాన్ ఝాంగ్ (21) అనే టీనేజర్ రూపొందించగా, జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఈ రూపానికి ప్రాణం పోసింది.

ఫోక్స్‌వ్యాగన్ ఆక్వా - పనితీరు
ఫోక్స్‌వ్యాగన్ ఆక్వా హోవర్‌క్రాఫ్ట్‌లో చక్రాలకు బదులుగా నాలుగు హైపవర్ ఫ్యాన్లు ఉంటాయి. అందులో రెండు ఫ్యాన్లు కారు కిందివైపు గాలి బుడగలను (ఎయిర్ బ్యాగ్) తయారయ్యేలా చేస్తాయి. ఈ గాలి పీడనానికి కారు ఉపరితలం నుంచి కొంత ఎత్తు (గ్రౌండ్ క్లియరెన్స్) గాల్లోకి లేస్తుంది. మిగిలిన రెండు ఫ్యాన్లు ముందుకు, వెనుకకు కదలడానికి ఉపయోగపడతాయి.

ఫోక్స్‌వ్యాగన్ ఆక్వా - టాప్ స్పీడ్
ఫోక్స్‌వ్యాగన్ ఆక్వా గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

ఫోక్స్‌వ్యాగన్ ఆక్వా - హైడ్రోజన్ పవర్
హైడ్రోజన్‌ను ఇంధనంగా వినియోగించుకునేందుకు గాను ఈ కాన్సెప్ట్ కారులో రెండు మోటార్లు ఉంటాయి.

ఫోక్స్‌వ్యాగన్ ఆక్వా - కాన్సెప్ట్
ఫోక్స్‌వ్యాగన్ ఆక్వా హోవర్‌క్రాఫ్ట్‌లో చక్రాలకు బదులుగా నాలుగు హైపవర్ ఫ్యాన్లు ఉంటాయి. అందులో రెండు ఫ్యాన్లు కారు కిందివైపు గాలి బుడగలను (ఎయిర్ బ్యాగ్) తయారయ్యేలా చేస్తాయి. ఈ గాలి పీడనానికి కారు ఉపరితలం నుంచి కొంత ఎత్తు (గ్రౌండ్ క్లియరెన్స్) గాల్లోకి లేస్తుంది. మిగిలిన రెండు ఫ్యాన్లు ముందుకు, వెనుకకు కదలడానికి ఉపయోగపడతాయి. హైడ్రోజన్‌ను ఇంధనంగా వినియోగించుకునే ఈ కాన్సెప్ట్ కారులో రెండు మోటార్లు ఉంటాయి. ఫోక్స్‌వ్యాగన్ ఆక్వా గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.


Click it and Unblock the Notifications