జెట్టాలో సరికొత్త వేరియంట్‌ను విడుదల చేసిన ఫోక్స్‌వ్యాగన్
జర్మనీకు చెందిన ప్రముఖ కార్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ప్రీమియం సెడాన్ 'జెట్టా'లో మరో సరికొత్త వేరియంట్‌ను కంపెనీ నేడు మార్కెట్లో విడుదల చేసింది. 120 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేసే పెట్రోల్ ఇంజన్ కలిగిన కొత్త ఫోక్స్‌వ్యాగన్ జెట్టా టిఎస్ఐ ట్రెండ్‌లైన్, కంఫర్ట్‌లైన్ అనే రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. కొత్త ఫోక్స్‌వ్యాగన్ జెట్టాలో ఉపయోగించిన 1.6 లీటర్ టర్బో-ఛార్జ్‌డ్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 120 బిహెచ్‌పిల శక్తిని, 200ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఫ్రంట్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కలిగి కొత్త పెట్రోల్ వేరియంట్ ఫోక్స్‌వ్యాగన్ జెట్టా సెడాన్ సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. డి-సెగ్మెంట్ సెడాన్‌గా వచ్చిన కొత్త ఫోక్స్‌వ్యాగన్ జెట్టా పెట్రోల్ వెర్షన్ ప్రారంభ వేరియంట్ (ట్రెండ్‌లైన్) ధర రూ.13.60 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్ (కంఫర్ట్‌లైన్) వేరియంట్ ధర రూ.15.07 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా ఉంది.
పెట్రోల్ వెర్షన్‌లో లభ్యమయ్యే ఫోక్స్‌వ్యాగన్ జెట్టా టిఎస్ఐ ట్రెండ్‌లైన్ వేరియంట్ ధర డీజిల్ వెర్షన్ జెట్టా కన్నా సుమారు లక్ష రూపాయాలకు పైగా చవకైనది. ఈ కొత్త వేరియంట్ జెట్టాలో సరికొత్త అల్లాయ్ వీల్స్, వెనుక వైపు ఫాగ్ ల్యాంప్స్, సైడ్ మిర్రర్లపై ఇండికేటర్స్, పార్కింగ్ సెన్సార్స్, డ్యూయెల్ ఎగ్జాస్ట్ పైస్స్ (సైలెన్సర్) వంటి ఎక్స్టీరియర్ మార్పులను గమనించవచ్చు.
ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే.. నాణ్యమైన లెథరతో చేయబడిన సీట్స్ లాంగ్ రైడ్‌లలో సైతం సౌకర్యవంతమైన అనుభూతిని కల్పిస్తాయి. స్టీరింగ్ వీల్, గేర్ నాబ్‌లను లెథర్‌తో కప్పబడి ఉంటాయి. ఇంకా ఎనిమిది స్పీకర్లతో కూడిన మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో కూడిన ఎయిర్ కండిషనింగ్, ఎత్తుకు తగినట్లుగా అడ్జస్ట్ చేసుకునే వీలున్న ముందు సీట్లు వంటి విశిష్టతలు కొత్త జెట్టా సొంతం.
ఫోక్స్‌వ్యాగన్ జెట్టా ఫోటో గ్యాలరీ
భద్రతా ఫీచర్లలో విషయంలో కూడా ఫోక్స్‌వ్యాగన్ ఎక్కడా రాజీ పడలేదు. ఫోక్స్‌వ్యాగన్ జెట్టా టిఎస్ఐలో అధునాతన ఈఎస్‌పి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), హిల్ హోల్డ్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లతో లభ్యమవుతుంది. ప్రస్తుతం పెట్రోల్ ధరలు భగ్గమంటున్న నేపథ్యంలో ఈ పెట్రోల్ వేరియంట్ జెట్టా హిట్ అవుతుందో లేక ఫట్ అవుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications









