రాష్ట మార్కెట్లోకి కొత్త ఫోక్స్‌వ్యాగన్ జెట్టా టిఎస్‌ఐ విడుదల

జర్మనీకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా గడచిన జూన్ నెలలో దేశీయ విపణిలో ప్రవేశపెట్టిన సరికొత్త పెట్రోల్ వేరియంట్ ప్రీమియం సెడాన్ 'ఫోక్స్‌వ్యాగన్ జెట్టా టిఎస్ఐ'ను కంపెనీ తాజాగా హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసింది. 120 బిహెచ్‌పిల శక్తిని విడుదల చేసే శక్తివంతమైన పెట్రోల్ ఇంజన్‌ను కలిగిన కొత్త ఫోక్స్‌వ్యాగన్ జెట్టా టిఎస్ఐ ట్రెండ్‌లైన్, కంఫర్ట్‌లైన్ అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ జెట్టాలో ఉపయోగించిన 1.6 లీటర్ టర్బో-ఛార్జ్‌డ్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 120 బిహెచ్‌పిల శక్తిని, 200ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ ప్రకారం, కొనుగోలుదారులు పెట్రోల్ కార్లను వదలి, డీజిల్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ, రానున్న కాలంలో తిరిగి పెట్రోల్ కార్ల వైపే కొనుగోలుదారులు మరలే ఆస్కారం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.


ఫ్రంట్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కలిగి కొత్త పెట్రోల్ వేరియంట్ ఫోక్స్‌వ్యాగన్ జెట్టా సెడాన్ సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది. డి-సెగ్మెంట్ సెడాన్‌గా వచ్చిన కొత్త ఫోక్స్‌వ్యాగన్ జెట్టా పెట్రోల్ వెర్షన్ ప్రారంభ వేరియంట్ (ట్రెండ్‌లైన్) ధర రూ.13.60 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్ (కంఫర్ట్‌లైన్) వేరియంట్ ధర రూ.15.07 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

డీజిల్ వెర్షన్ జెట్టా కన్నా పెట్రోల్ వెర్షన్‌ ఫోక్స్‌వ్యాగన్ జెట్టా టిఎస్ఐ ట్రెండ్‌లైన్ వేరియంట్ ధర సుమారు లక్ష రూపాయాలకు పైగా తక్కువగా ఉంటుంది. ఈ కొత్త వేరియంట్‌ జెట్టాలో సరికొత్త అల్లాయ్ వీల్స్, వెనుక వైపు ఫాగ్ ల్యాంప్స్, సైడ్ మిర్రర్లపై ఇండికేటర్స్, పార్కింగ్ సెన్సార్స్, డ్యూయెల్ ఎగ్జాస్ట్ పైస్స్ (సైలెన్సర్) వంటి ఎక్స్టీరియర్ మార్పులు చేర్పులు చేయటం జరిగింది.

అలాగే, ఇంటీరియర్స్‌లో దూరప్రయాణాల్లో సైతం సైతం సౌకర్యవంతమైన అనుభూతిని తీర్చిదిద్దిన నాణ్యమైన లెథర్ సీట్స్, లెథర్‌తో కప్పబడిన స్టీరింగ్ వీల్, గేర్ నాబ్‌, ఎనిమిది స్పీకర్లతో కూడిన మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో కూడిన ఎయిర్ కండిషనింగ్, ఎత్తుకు తగినట్లుగా అడ్జస్ట్ చేసుకునే వీలున్న ముందు సీట్లు వంటి ఫీచర్లను గమనించవచ్చు.

ఫోక్స్‌వ్యాగన్ జెట్టా ఫోటో గ్యాలరీ:

భద్రతా ఫీచర్లలో విషయంలో కూడా ఫోక్స్‌వ్యాగన్ ఎక్కడా రాజీ పడలేదు. ఫోక్స్‌వ్యాగన్ జెట్టా టిఎస్ఐలో అధునాతన ఈఎస్‌పి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), హిల్ హోల్డ్ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లతో లభ్యమవుతుంది.

More from DriveSpark

Article Published On: Saturday, July 21, 2012, 16:02 [IST]
English summary
Volkswagen has launched the petrol variant of the Jetta D-segment sedan with a price tag of Rs.13.6 lakhs (ex-showroom Delhi). We can say Volkswagen has taken a bold step considering the low demand for petrol cars arising from high petrol prices.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+